Thandel Trailer: తండేల్ ట్రైలర్ వచ్చేసింది... నాగ చైతన్య, సాయి పల్లవి ఇరగదీశారుగా
Thandel Telugu Trailer Release: నాగ చైతన్య మోస్ట్ అవైయిటెడ్ మూవీ 'తండేల్' ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది.

Naga Chaitanya Thandel Telugu Trailer Out: అక్కినేని హీరో నాగచైతన్య, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'తండేల్'. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. దీంతో చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా జరుపుకుటుంది. ఇందులో భాగంగా మంగళవారం మూవీ ట్రైలర్‌ని రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు విశాఖపట్నంలోని శ్రీరామ పిక్చర్స్ ప్లేస్ వేదికైంది.
దేశభక్త, ఎమోషనల్ లవ్‌స్టోరీతో ఆద్యాంత ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. మత్స్యకారుడైన రాజు పాత్రలో చై జీవించాడు అని చెప్పాలి. ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ లవ్‌స్టోరీతో సాగిన ఈ ట్రైలర్ మూవీ మరిన్ని అంచనాలు పెంచేస్తొంది.
'తండేల్' ట్రైలర్ విషయానికి వస్తే... ఊరిలో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య ప్రేమ కథ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన హీరో అతని స్నేహితులు తూఫానులో చిక్కుకోవడం, తర్వాత పాకిస్తాన్ సైన్యానికి చిక్కడం వంటివి అన్నీ చూపించారు. 'తండేల్' అంటే నాయకుడు అని అర్థం చెప్పారు. మా ఊరిలో ఊర కుక్కలు అన్నీ ఉత్తరం వైపు తిరిగి పోస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఫోటో లేకుండా పోతుందని హీరో చెప్పిన డైలాగ్స్ విజిల్స్ వేయించేలా ఉంది.
వరుస ప్లాప్స్... తండేల్ కోసం వెయిటింగ్
'బంగార్రాజు' వంటి హిట్ తర్వాత 'థ్యాంక్యూ, కస్టడీ చిత్రాలతో వరుస ప్లాప్స్ చూసిన చై తండేల్‌తో మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఇక అక్కినేని ఫ్యాన్స్ కూడా నాగ చైతన్య నుంచి బ్లాక్‌బస్టర్ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా విడుదలైన తండేల్ ట్రైలర్ చూస్తుంటే వారి ఎదురు చూపులకు మంచి ఫలితం వచ్చేలానే కనిపిస్తోంది. ఈసారి నాగ చైతన్య ఖాతాలో హిట్ కాదు ఓ బ్లాక్‌బస్టర్ హిట్ పడేలా కనిపిస్తోంది. కాగా నాగ చైతన్య, సాయి పల్లవిల పెయిర్‌కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. లవస్టోరీ వీరిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. అదే ఇప్పుడు తండేల్‌కు కూడా వర్కౌట్ అయ్యే చాన్స్‌స్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఇప్పుడు తండేల్ కోసం మరోసారి జతకట్టిన చై, సాయి పల్లవిలు.. మళ్లీ ఆ మేజిక్‌ని రిపీట్ చేయబోతున్నారని ట్రైలర్ చూసి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తండేల్ ట్రైలర్‌కు ఆడియన్స్, ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సాయి పల్లవి, నాగ చైతన్య కాంబో అనగానే తండేల్‌పై అంచనాలు నెలకొన్నాయి. పైగా ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రచార పోస్టర్స్, పాటలకు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా బుజ్జితల్లి పాటు యూట్యూబ్‌లో మారుమోగింది. ఇక ఆ తర్వాత విడుదలైన శివ శక్తి, హైలెస్సో హైలెస్సో పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. అంతేకాదు తరచూ ఏదోక ఆసక్తికర అప్‌డేట్‌తో మేకర్స్ మూవీపై బజ్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తండేల్ మూవీపై ఆడియన్స్ అంచనాలు రెట్టింపు అయ్యాయి. దీంతో మూవీ కోసం ఆడియన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
అల్లు అరవింద్ ఫస్ట్ రివ్యూ
మరోవైపు ఇటీవల నిర్మాత బన్నీవాసు చేసిన ట్వీట్ మూవీపై బజ్ పెరిగింది. అల్లు అరవింద్ ఫస్ట్ కాపీ చూశారని, అది చూసిన ఆయన మూవీ హిట్ అని అన్నారు, ఫిబ్రవరి 7న థియేటర్లో రాజులమ్మ జాతరే అంటూ ఈ సినిమా వందకు వంద మార్కులు ఇచ్చారని బన్నీ వాసు ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో అభిమానుల్లో పూనకాలు మొదలయ్యాయి. కాగా ఈ సినిమాను నిజ జీవిత సంఘటన ఆధారంగా దేశభక్తి నేపథ్యంలో రూపొందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నాగ చైతన్య మత్స్యకారుడైన రాజు అనే యువకుడి పాత్ర పోషిస్తున్నాడు. చాక్లేట్ బాయ్‌లా ఉండే చై తండేల్ రా అండ్ రస్టిక్ మాస్ లుక్‌లో అలరించబోతున్నాడు. అతడి లుక్‌తోనే మూవీపై అంచనాలు నెలకొన్నాయి. ఇక ఫిబ్రవరి 7న తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా తండేల్ మూవీ విడుదల కానుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

