నాగ చైతన్యకు భలే కలిసొచ్చిన పేరు... నాలుగు సార్లూ హిట్టు
abp live

నాగ చైతన్యకు భలే కలిసొచ్చిన పేరు... నాలుగు సార్లూ హిట్టు

Published by: Satya Pulagam
కార్తీక్... ఆ పేరు పెడితే సినిమా హిట్టే
abp live

కార్తీక్... ఆ పేరు పెడితే సినిమా హిట్టే

నాగ చైతన్యకు సెంటిమెంట్స్ ఉన్నాయో? లేవో? కానీ, ఆయన సినిమాల్లో కార్తీక్ అనే పేరు మాత్రం సెంటిమెంట్ కింద మారిందని చెప్పవచ్చు. ఆయన ఆ పేరు వాడిన నాలుగుసార్లు విజయాలు వచ్చాయి.

ఏ మాయ చేసావె... మొదటిసారి
abp live

ఏ మాయ చేసావె... మొదటిసారి

హీరోగా పరిచయమైన 'జోష్' కంటే తర్వాత చేసిన 'ఏ మాయ చేసావె' నాగ చైతన్యకు మెమరబుల్ హిట్ అందించింది. అందులో హీరో పేరు కార్తీక్. 

'తడాఖా'లో ఇంకోసారి... హిట్ వచ్చింది రెండోసారి
abp live

'తడాఖా'లో ఇంకోసారి... హిట్ వచ్చింది రెండోసారి

'ఏ మాయ చేసావె' తర్వాత '100% లవ్' కూడా హిట్టే. అయితే... 'దడ', 'బెజవాడ' మూవీస్ ఆయనకు ఫ్లాప్స్ తెచ్చాయి. వాటి తర్వాత 'తడాఖా' చేశారు. విజయం అందుకున్నారు. అందులో హీరో పేరు కూడా కార్తీక్.

abp live

ఒక లైలా కోసం... కార్తీక్ పాత్రలో

'ఒక లైలా కోసం' సినిమాలో ముచ్చటగా మూడోసారి కార్తీక్ పాత్రలో కనిపించారు నాగ చైతన్య. ఆ సినిమా డీసెంట్ హిట్ అనిపించుకుంది.

abp live

'వెంకీ మామ'తోనూ... సెంటిమెంట్ పేరే

మేనమామ విక్టరీ వెంకటేష్‌తో కలిసి నాగ చైతన్య నటించిన సినిమా 'వెంకీ మామ'. అందులోనూ తన పాత్రకు సెంటిమెంట్ పేరు వాడారు నాగ చైతన్య. అందులో కెప్టెన్ కార్తీక్ శివరామ్ వీరమాచినేనిగా కనిపించారు.

abp live

కార్తీక్ నాలుగుసార్లు... విక్రమ్ రెండుసార్లు

నాగ చైతన్య నటించిన నాలుగు సినిమాల్లో హీరో క్యారెక్టర్ పేరు కార్తీక్ అయితే... రెండు సినిమాల్లో విక్రమ్. విక్రమ్ వాత్సల్య (ప్రేమమ్), విక్రమ్ ఆదిత్య (సవ్యసాచి)గా కనిపించారు. హీరోగా నాగార్జున తొలి సినిమా 'విక్రమ్'కు గుర్తుగా నాగార్జున వీరాభిమాని, దర్శకుడు చందూ మొండేటి ఆ పేరు వాడారు.

abp live

ఆ ఒక్క సినిమాలో సొంత పేరుతో... చైతుగా

'శైలజా రెడ్డి అల్లుడు'లో హీరో క్యారెక్టర్ పేరు చైతు అలియాస్ చైతన్య. ఆ ఒక్క సినిమాలో సొంత పేరుతో కనిపించారు. 'మనం'లో చైతు పాత్రకు ఆయన తండ్రి నాగార్జున పేరు పెట్టారు. 'మహానటి'లో ఏయన్నార్‌గా అతిథి పాత్రలో సందడి చేశారు.

abp live

'తండేల్'కు పేరు మార్చిన చందూ మొండేటి

'ప్రేమమ్', 'సవ్యసాచి' సినిమాల్లో హీరో పాత్రకు విక్రమ్ పేరు పెట్టిన చందూ మొండేటి, నాగ చైతన్య హీరోగా తీస్తున్న తాజా పాన్ ఇండియా సినిమా 'తండేల్'లో మాత్రం తండేల్ రాజు అని పెట్టారు. నెక్స్ట్ మళ్ళీ కార్తీక్, విక్రమ్ పాత్రల్లో చైతూ ఎప్పుడు కనిపిస్తారో?