Pushpa 2: పుష్ప 2 థియేటర్లో మాస్ జాతర... కపాలం సీన్ రాగానే అమ్మవారు పూని, ఊగిపోయిన మహిళ - వీడియో వైరల్
' పుష్ప 2' సినిమాను థియేటర్ లో చూస్తూ ఓ మహిళ పూనకం వచ్చి ఊగిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమాలో కపాలం సీన్ వచ్చినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ "పుష్ప 2' సినిమా థియేటర్లను రఫ్ఫాడిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిదాకా ఈ సినిమాను వీక్షించిన ఏ ప్రేక్షకుడిని అడిగినా సరే పూనకాలు తెప్పించే ఆ ఒక్క సీన్ గురించే మాట్లాడుతారు. అదే జాతర సీన్. దానితో పాటే కపాలం ఫైట్ సీన్ కూడా. ఈ సీన్ గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా అల్లు అర్జున్ నటనకి ఏకంగా మరోసారి జాతీయ అవార్డును ఇచ్చేయొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ థియేటర్లలో జాతర సీన్ ఎంత పవర్ ఫుల్ గా ఉందో తెలిపే సంఘటన ఒకటి చోటు చేసుకుంది.
ఓ థియేటర్లో 'పుష్ప 2' సినిమాను చూస్తున్న సందర్భంలో ఓ మహిళా అభిమాని పూనకం వచ్చి ఊగిపోయింది. అల్లు అర్జున్ కపాలం ఫైట్ సీన్ ఎఫెక్ట్ కారణంగా ఆమె థియేటర్లోనే అమ్మవారు పూనినట్టు ఊగిపోతూ కనిపించింది. దీంతో పక్కనే ఉన్న ఆడియన్స్ అందరూ ఆమెను శాంత పరచడానికి ప్రయత్నించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను షేర్ చేస్తూ 'పుష్ప 2' మూవీ 100% గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉందంటూ, ప్రత్యేకంగా జాతర, కపాలం సీన్ల గురించి ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా ఏ రెండు సీన్లలో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓ రేంజ్ లో ఉంది.
— bunnyfan (@icon_bunny7) December 7, 2024
"ఇప్పటిదాకా మాస్ చూశారు, ఊర మాస్ చూశారు.. 'పుష్ప 2'తో జాతర మాస్ చూడబోతున్నారు" అంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ నిజమయ్యాయి. 'పుష్ప 2' మూవీ రిలీజ్ కు ముందు ప్రమోషన్లలో భాగంగా, అల్లు అర్జున్ 'అన్ స్టాపబుల్ సీజన్ 4'లో పాల్గొన్నారు. ఆ టైమ్ లో సినిమా గురించి బాలయ్యకు వివరిస్తూ అల్లు అర్జున్ ఈ కామెంట్స్ చేశారు. ఇప్పుడు సినిమాను చూసిన ప్రేక్షకులకు అప్పుడు అల్లు అర్జున్ చెప్పిన ఈ డైలాగ్ నిజమే అన్పిస్తోంది.
ఇదిలా ఉండగా 'పుష్ప 2' మూవీ కలెక్షన్ల పరంగా కూడా తగ్గేదే లే అంటూ దూసుకెళ్తోంది. బాక్స్ ఆఫీస్ లో ఈ మూవీ మొదటి రోజే రూ. 294 కోట్లు కొల్లగొట్టి, చరిత్రను సృష్టించింది. హయ్యెస్ట్ ఓపెనింగ్ సాధించిన ఇండియన్ ఫిలింగా హిస్టరీని క్రియేట్ చేసి, 'పుష్ప 2' రికార్డులకు ఎక్కింది. ఇక రెండో రోజు కూడా తగ్గేదేలే అంటూ ఏకంగా రూ.150 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి రెండు రోజుల్లోనే ఈ సినిమా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం సంచలనంగా మారింది. ఓపెనింగ్ డే రికార్డ్స్ విషయంలో ఆర్ఆర్ఆర్, జవాన్ సినిమాల రికార్డులను గల్లంతు చేసింది 'పుష్ప 2'. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న టాక్, జోరు చూస్తుంటే ఈజీగా సినిమా 1000 కోట్లు దాటడం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి పుష్ప రాజ్ 1000 రాబడతాడా? ఈ మేనియా ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది ? అనేది చూడాలి.
Also Read: నా కోసం కాదు, వాళ్ళ కోసం... ఆ మూడుసార్లూ Pushpa 2 హిట్టవ్వాలని బలంగా కోరుకున్నా - అల్లు అర్జున్