Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!
Samantha Footwear Cost : 'బ్రో' సినిమా కొత్త పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ఒక్కటే చర్చ... పవన్ కళ్యాణ్ షూ రేటు గురించి! క్యాజువల్ గా సమంత వేసుకుంటున్న చెప్పుల రేటు దాని కంటే డబుల్ అండీ బాబూ!
![Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్! Pawan Kalyan Shoes Vs Samantha Chappal Kushi actress dons fancy Louis Vuitton which cost almost double to pawan's shoe Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/30/4debe519acdc1d0c2b19aa80255074461685421148403313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'బ్రో' సినిమాలో మామ అల్లుడు కలిసి ఉన్న పోస్టర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షూ గురించి! దాని రేటు అక్షరాలా లక్ష రూపాయలు (Pawan Kalyan Shoes Cost)! పవన్ కోసం ప్రత్యేకంగా ఇటలీకి చెందిన గియుసేప్ జానోట్టి బ్రాండ్ షూస్ తెప్పించారు! అది పక్కన పెడితే... సినిమాల్లో కాదు, నిజ జీవితంలో సమంత ధరిస్తున్న చెప్పుల ఖరీదు వింటే నోరెళ్లబెట్టాలి!
దేవుడి షూ కంటే రెండింతలు ఎక్కువ!
'బ్రో' సినిమాలో పవన్ కళ్యాణ్ మోడ్రన్ దేవుడి పాత్రలో కనిపించనున్నారు. ఆ రోల్ కోసమే లక్ష రూపాయల షూ! రెండు రోజుల క్రితం 'ఖుషి' చిత్రీకరణ కోసం సమంత (Samantha) విదేశాలు వెళ్లారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఆమె కనిపించారు. అప్పుడు సామ్ చెప్పులు వేసుకుని నడుస్తూ వెళ్లారు. వాటి ఖరీదు ఎంతో తెలుసా?
Samantha Chappal Cost : సమంత ఉపయోగిస్తున్న చెప్పులు లూయిస్ విట్టోన్ (Louis Vuitton pool slides) కంపెనీకి చెందినవి. వాటిని పూల్ స్లైడర్స్ అంటారట! వాటి రేటు సుమారు రెండున్నర లక్షల రూపాయలు! దేవుడి షూ ఖరీదు కంటే రెండున్నర రేట్లు ఎక్కువ అని చెప్పాలి. సామ్ లైఫ్ స్టైల్ చాలా కాస్ట్లీ గురూ అనాల్సిందే!
సమంత ఎక్కడికి వెళ్ళారంటే?
సమంత ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో 'ఖుషి' ఒకటి. అందులో రౌడీ బాయ్, పాన్ ఇండియా సెన్సేషన్ విజయ్ దేవరకొండకు జోడీగా కనిపించనున్నారు. ఆ చిత్రంలో ఓ పాటను టర్కీలో చిత్రీకరణ చేయాలని ప్లాన్ చేశారు. సమంత శనివారం రాత్రి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారు. సాంగ్ షూటింగ్ కోసమే ఆమె టర్కీ వెళ్ళారు.
Also Read : బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ 'బ్రో' కాదు - బర్త్ డే గిఫ్ట్ రెడీ!
'ఖుషి'లో ఐటీ ఉద్యోగిగా సమంత!
సమంత పుట్టినరోజు కానుకగా 'ఖుషి' నుంచి చిత్ర బృందం ఓ స్టిల్ విడుదల చేసింది. అందులో ఆమెను చూస్తే... ఐటీ ఉద్యోగి పాత్ర చేస్తున్నారని ఈజీగా చెప్పవచ్చు. కశ్మీరీ యువతి ఐటీ ఉద్యోగి కావడం వెనుక ఏమైనా ట్విస్ట్ ఉందా? లేదా? అనేది సినిమా వస్తే గానీ తెలియదు. విశేషం ఏమిటంటే... ఆ స్టిల్ చూశాక, చాలా మందికి తెలుగులో సమంత తొలి సినిమా 'ఏ మాయ చేసావె' గుర్తుకు వస్తోంది.
'ఏ మాయ చేసావె'లో సమంత ఐటీ ఉద్యోగి పాత్రలో కనిపించారు. ఆ తర్వాత 'ఎటో వెళ్ళిపోయింది మనసు', 'జనతా గ్యారేజ్' చిత్రాల్లో ఉద్యోగిగా కనిపించారు. అయితే, 'ఏ మాయ చేసావె' తర్వాత మళ్ళీ పూర్తిస్థాయి ఐటీ ఉద్యోగి పాత్ర చేయడం 'ఖుషి'లోనే అనుకుంట! అందులోనూ సినిమాలోని కొత్త స్టిల్ చూస్తే... 'ఏ మాయ చేసావె'లో నడిచినట్టే ఉంది. అందులో చీర అయితే, 'ఖుషి'లో చుడిదార్! అదీ సంగతి! ఆ మధ్య హైదరాబాద్, దుర్గం చెరువు సమీపంలోని ఐటీ కంపెనీలలో విజయ్ దేవరకొండ, సమంత మీద కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. 'ఖుషి' కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం 'సిటాడెల్' వెబ్ సిరీస్ చేస్తున్నారు సమంత.
Also Read : 'ఆదిపురుష్' తెలుగు థియేట్రికల్ రైట్స్ రేటు యమా ఘాటు - ఇది భారీ డీల్ రామా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)