Adipurush Telugu Theatrical Rights : 'ఆదిపురుష్' తెలుగు థియేట్రికల్ రైట్స్ రేటు యమా ఘాటు - ఇది భారీ డీల్ రామా!
'ఆదిపురుష్' జూన్ 16న థియేటర్లలో విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... తెలుగు థియేట్రికల్ హక్కులను భారీ రేటుకు అమ్మేశారు.
థియేటర్లలోకి జూన్ 16న 'ఆదిపురుష్' వస్తుంది. సినిమా విడుదలకు ఇంకా 20 రోజులు మాత్రమే ఉంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను భారీ రేటుకు ఓ బడా నిర్మాణ సంస్థ తీసుకుంది.
పీపుల్స్ మీడియా చేతికి 'ఆదిపురుష్'
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్ట్రాల 'ఆదిపురుష్' థియేట్రికల్ హక్కులను రూ. 170 కోట్లకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసుకుందని తెలిసింది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమాను ఆ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
తెలుగులో జరిగిన భారీ థియేట్రికల్ రైట్స్ డీల్స్ చూస్తే... 'ఆర్ఆర్ఆర్' రెండు రాష్ట్రాల హక్కులు సుమారు 226 కోట్లకు విక్రయించారు. 'బాహుబలి 2' అయితే రూ. 120 కోట్లకు. 'సాహో' రూ. 124 కోట్లకు విక్రయించారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత స్థానం 'ఆదిపురుష్'ది అని చెప్పవచ్చు.
సోమవారమే 'ఆదిపురుష్'లో రెండో పాట
శ్రీ రామ చంద్రునిగా ప్రభాస్ (Prabhas) నటించిన సినిమా 'ఆదిపురుష్' (Adipurush Movie). ఇందులోని తొలి పాట 'జై శ్రీరామ్'లో 'మహిమాన్విత మంత్రం నీ నామం' అంటూ రామనామం యొక్క గొప్పదనాన్ని వివరించారు. ఆయన వెంట నడుస్తూ లంకపై యుద్ధం చేసిన వానర సైన్యం పాడిన పాటగా దానిని తీర్చిదిద్దారు. రెండో పాట సీతారాముల మీద ఉంటుందని తెలిసింది.
Also Read : 'ఇండియా హౌస్' హిస్టరీ తెలుసా? సావర్కర్ కథను రామ్ చరణ్ ఎందుకు తీసుకున్నాడంటే?
మే 29న మధ్యాహ్నం 12 గంటలకు 'రామ్ సియా రామ్' పాట విడుదల కానుంది. ఈ గీతానికి రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా... సచేత్ పరంపర సంగీతం అందించడంతో పాటు ఆలపించారు. రేడియో స్టేషన్స్, మూవీ ఛానల్స్, నేషనల్ న్యూస్ ఛానల్స్, అవుట్ డోర్ బిల్ బోర్డ్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్, టిక్కెటింగ్ పార్ట్నర్స్, మూవీ థియేటర్స్, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్... 70కు పైగా మార్కెట్లలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు 'ఆదిపురుష్' టీమ్ వెల్లడించింది.
Also Read : ఎన్టీఆర్‌ను దేవుడిగా ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?
View this post on Instagram
'ఆదిపురుష్' సినిమాలో సీతా దేవిగా కృతి సనన్ నటించారు. లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్, హనుమంతుని పాత్రను దేవదత్తా నాగే పోషించారు. లంకేశుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. అంటే కంటే ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నారు. అదీ తెలుగు గడ్డపై!
తిరుపతిలో 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుక!
Adipurush Pre Release Event Date : ఆధ్యాత్మిక క్షేత్రమైన, హిందువులు ఎంతో భక్తిశ్రద్దలతో కొలిచే ఏడు కొండల శ్రీవాసుడు కొలువన తిరుపతిలో 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన యువి క్రియేషన్స్ తెలియజేసింది. జూన్ 6వ తేదీ సాయంత్రం భారీ ఎత్తున భక్తులు, ప్రేక్షకులు, అభిమానుల సమక్షంలో వేడుకగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుపతిలోనే 'బాహుబలి' ప్రీ రిలీజ్ కూడా!
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడం వెనుక ముఖ్య భూమిక పోషించిన 'బాహుబలి' సినిమా ప్రీ రిలీజ్ వేడుక సైతం తిరుపతిలో జరిగింది. మరోసారి తిరుపతి గడ్డ మీద ప్రభాస్ సినిమా వేడుకకు ఏర్పాట్లు జరుగుతుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.