The India House History : 'ఇండియా హౌస్' హిస్టరీ తెలుసా? సావర్కర్ కథను రామ్ చరణ్ ఎందుకు తీసుకున్నాడంటే?
నిఖిల్ హీరోగా రామ్ చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమాకు 'ది ఇండియా హౌస్' టైటిల్ ఫిక్స్ చేశారు. అసలు, ఆ టైటిల్ వెనుక ఉన్న హిస్టరీ ఏంటో తెలుసా?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సమర్పణలో నిఖిల్ (Nikhil Siddharth) హీరోగా రూపొందుతున్న సినిమా 'ది ఇండియా హౌస్' (The India House Film). ఈ రోజు సినిమాను వెల్లడిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
ఇండియా హౌస్... స్టూడెంట్ హాస్టల్!
The India House Story : ఇండియా హౌస్ అనేది లండన్ (London)లో హైగేట్ ఏరియాలోని క్రోమ్ వెల్ అవెన్యూలో ఉండే ఓ స్టూడెంట్ హాస్టల్. బారిస్టర్ చదువుకోవటానికి ఇండియా నుంచి లండన్ వచ్చే విద్యార్థుల్లో జాతీయతా భావాలను పెంపొందించాలని శ్యామ్ జీ కృష్ణవర్మ (Shyamji Krishna Varma) అనే లాయర్ ఇండియా హౌస్ స్థాపించారు. ఇండియా నుంచి విద్యార్థులకు ఇండియా హౌస్ తరపున స్కాలర్ షిప్ లు కూడా ఇచ్చేవారు. అంతే కాదు ది ఇండియన్ సోషియాలజిస్ట్ పేరుతో ఓ న్యూస్ పేపర్ ను కూడా నడిపేవారు ఇండియా హౌస్ తరపున నుంచి. బ్రిటీషు దొరలకు వ్యతిరేకంగా 1857 తిరుగుబాటు వీరుల విప్లవ కథలను ప్రచురించి జాతీయతా భావాలను పెంచటమే శ్యామ్ జీ కృష్ణవర్మ లక్ష్యం. స్వాత్రంత్యం సంపాదించాలంటే ఇదీ ఓ దారి అని నమ్మేవారు ఆయన.
1905లో లండన్ స్టూడెంట్ హాస్టల్ గా స్టార్ట్ అయినప్పుడు 30 మందితో ఉన్న ఇండియా హౌస్ ఐదేళ్లలో ఎన్నో జాతీయ వాద సంస్థలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. అలా వచ్చినవే ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ లాంటివి. మెల్లగా ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాల్లోనూ భారత జాతీయభావాలను పెంపొందించే విప్లవ సంస్థలుగా మారాయి. ఇండియా హౌస్ జాతీయవాద సంస్థలకు అడ్డాగా మారిపోయింది. భారత స్వాతంత్ర్యాన్ని కోరుకునే అనేక సంస్థలు ఇండియా హౌస్ నుంచి నడిచేవి. అక్కడ నుంచి పుట్టుకొచ్చేవి. అలా ఇండియా నుంచి ఇండియా హౌస్ స్కాలర్ షిప్ తో చదువుకునేందుకు లండన్ కు లా స్టూడెంట్ గా వచ్చిన యువకుడే వీర్ సావర్కర్. 1906లో ఇండియా హౌస్ కు స్కాలర్ షిప్ తో వచ్చిన వీర్ సావర్కర్... మెల్లగా అక్కడ ఓ లీడర్ గా మారిపోయాడు. ఎక్కువగా బ్రిటీషు అధికారులు సోదాలు నిర్వహించేవారు ఇండియా హౌస్ లో. ఎడిటర్ అయిన కృష్ణవర్మ చాలా ఇబ్బంది పడేవాడు. ఇక బ్రిటీషర్లు తనను చంపేస్తారని 1907లో పారిస్ కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత వీర్ సావర్కరే ఇండియా హౌస్ బాధ్యతలు తీసుకున్నాడు. సోషియాలజిస్ట్ పత్రికను మరింత తీవ్రతతో ప్రచురించాడు. నాస్తికుడైనా హిందూత్వ అజెండాతో పనిచేసేవాడు.
Also Read : ఎన్టీఆర్‌ను దేవుడిగా ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?
ఇండియా హౌస్ సభ్యుడైన మదన్ లాల్ ధింగ్రా 1909లో భారత దేశ వ్యవహారాల మంత్రికి రాజకీయ సలహాదారుడిగా ఉన్న సర్ WH కర్జన్ విల్లీని చంపేశాడు. దీంతో స్కాట్లాండ్ యార్డ్, ఇండియన్ పొలిటికల్ ఇంటిలెజెన్స్, మెట్రోపాలిటన్ పోలీసులు ఇండియాహౌస్ ను వదిలిపెట్టలేదు. అది పూర్తిగా నిర్మూలమయ్యేంత వరకూ జాతీయ వాదులందరినీ అరెస్ట్ చేశారు. చాలా మంది వేర్వేరు దేశాలకు పారిపోయి తలదాచుకున్నారు. అలా 1910లో చరిత్ర గర్భంలో ఇండియా హౌస్ కలిసిపోయింది. 1906, 1909లో గాంధీ వీర్ సావర్కర్ ను ఇండియా హౌస్ లో కలుసుకున్నారని చెబుతారు. 1910 లో తన మిత్రుల్లానే ప్యారిస్ కు వెళ్లిపోయినా సావర్కర్ ను కుట్రనేరం కింద బ్రిటీష్ పోలీసులు అరెస్ట్ చేశారు. 1911లో వీర్ సావర్కర్ కి 50ఏళ్ల జైలు శిక్ష పడింది. అండమాన్ సెల్యూలర్ కు జైలుకు తరలించారు. అక్కడే ఆయన చాలా సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. ఇదీ ఇండియా హౌస్ & సావర్కర్ కథ.
ఇప్పుడు నిఖిల్ హీరోగా రామ్ చరణ్ సమర్పణలో వస్తున్న సినిమాకు 'ఇండియా హౌస్' అని టైటిల్ పెట్టారు. ఆ ఇండియా హౌస్ స్థాపించిన కృష్ణవర్మగా అనుపమ్ ఖేర్ నటిస్తుంటే... శివ అనే కుర్రాడి పాత్రలో నిఖిల్ నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. మరి ఈ శివే వీర్ సావర్కరా? లేదా మరేదైనా ఫిక్షన్ స్టోరీని ఇండియా హౌస్ కు కథకు జోడించారా? అనేది తెలియాలి.
Also Read : బాలకృష్ణకు ముందే చెప్పిన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్