అన్వేషించండి

NTR - Balakrishna : బాలకృష్ణకు ముందే చెప్పిన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్

బాబాయ్ బాలకృష్ణకు అబ్బాయిలు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ముందుగా ఓ సమాచారం ఇచ్చారని... వాళ్ళ మధ్య ఎటువంటి గ్యాప్ లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 

యుగపురుషుడు నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) శత జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో నిర్వహించిన వేడుకలకు ఆయన మనవళ్లు, హరికృష్ణ కుమారులైన నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram), మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) హాజరు కాలేదు. ఇటు నందమూరి అభిమానులు, అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది.

అసలు ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?
సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్ నగరంలో జరిగిన రోజే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. సుమారు 20 కుటుంబాలతో కలిసి టూర్ ప్లాన్ చేసుకున్నారు. ఉత్సవాలకు ఆహ్వానించడానికి వచ్చిన తండ్రి సమానులు నందమూరి రామకృష్ణతో ఆ విషయం చెప్పారు. అంతే కాదు... బాబాయ్ బాలకృష్ణకు సైతం ముందుగా సమాచారం ఇచ్చారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 

బాలకృష్ణ పరిస్థితి వివరించిన అబ్బాయిలు!
బాలకృష్ణకు ఫోన్ చేసిన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్... పుట్టినరోజు ఉండటం వల్ల చేసుకున్న ప్లాన్స్ & ఇతర షెడ్యూల్ వివరాలను వివరించారని సమాచారం. అబ్బాయిలతో బాబాయ్ కూడా సరేనని అన్నారని తెలిసింది. అసలు విషయం , వివరాలు తెలియని కొందరు సోషల్ మీడియా ఎన్టీఆర్ మీద దుష్ప్రచారం మొదలు పెట్టారు. కావాలని ఎన్టీఆర్ రాలేదని కామెంట్ చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ మద్దతుగా ఆయన్ను విమర్శించిన వారిపై ఎదురు దాడి చేసిన వాళ్ళూ ఉన్నారు. ఈ తరుణంలో తెలుగుదేశం నేత టీడీ జనార్థన్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చేసిన జూనియర్ మీద విమర్శలకు కారణం అయ్యాయి. 

Also Read : నిఖిల్ హీరోగా రామ్ చరణ్ సమర్పించు 'ది ఇండియా హౌస్' - తగలబడిన ఇంటి మిస్టరీ ఏమిటో?

ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం మీద చర్చ జరుగుతోందని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టీడీ జనార్థన్ (TD Janardhan)ను అడగ్గా... ''చర్చ ఏం లేదు! మేం పిలిచాం. మేం ఆహ్వానించడానికి ప్రయత్నిస్తే వారం రోజుల తర్వాత టైమ్ ఇచ్చారు. సరే అని వెళ్ళాం. అప్పుడు విషయం చెప్పాం. అయ్యో.... ఆల్రెడీ నేను ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నానని చెప్పారు'' అని సమాధానం ఇచ్చారు. 

పుట్టినరోజులు మళ్ళీ వస్తాయి... 
శత జయంతి ఒక్కసారే వస్తుందని చెప్పినా!
హైదరాబాద్ లో శక పురుషుడు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించిన రోజునే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. జన్మదినం సందర్భంగా ఆయన ముందుగా ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. శత జయంతి వేడుకలకు ఆహ్వానించడానికి వచ్చిన వ్యక్తులకు ఆ విషయం ఆయన చెప్పారు. 

''బాబూ! బర్త్ డేలు చాలా వస్తాయి. అన్నగారి సెంటినరీ (శత జయంతి) ఒక్కసారే వస్తుందని చెప్పాం. ఆ రోజు ఉదయం అభిమానులకు కలవడానికి ఉంటున్నానని చెప్పారు. ఒకవేళ ఉంటే రాత్రి వరకు ఉండి... తెల్లవారు జామున బర్త్ డే చేసుకోమని రిక్వెస్ట్ చేశాం. అయితే, ఆయనకు షెడ్యూల్ కుదరలేదేమో!? 22 మంది కుటుంబాలతో వెళుతున్నాం. ముందే అనుకున్నాను అని చెప్పారు. ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నారు'' అని టీడీ జనార్థన్ వివరించారు. హరికృష్ణ రెండో కుమారుడు నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram)ను కూడా తాము ఆహ్వానించామని, అయితే ఆయన కూడా టూర్ కు వెళ్ళారని టీడీ జనార్థన్ తెలిపారు.

Also Read : ఎన్టీఆర్‌ను దేవుడిగా ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?

టాప్ హెడ్ లైన్స్

Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Crazy Kalyanam Review - 'క్రేజీ కళ్యాణం' రివ్యూ: తెలంగాణ నేపథ్యంలో అనుపమ పరమేశ్వరన్ సినిమా... హిట్టా? ఫట్టా?
'క్రేజీ కళ్యాణం' రివ్యూ: తెలంగాణ నేపథ్యంలో అనుపమ పరమేశ్వరన్ సినిమా... హిట్టా? ఫట్టా?
Mahesh Babu Prithviraj Sukumaran : హ్యాపీ బర్త్ డే కుంభ - పృథ్వీరాజ్‌కు రాజమౌళి మహేశ్ బాబు బెస్ట్ విషెష్... వారణాసి రోల్‌పై హైప్ మామూలుగా లేదు
హ్యాపీ బర్త్ డే కుంభ - పృథ్వీరాజ్‌కు రాజమౌళి మహేశ్ బాబు బెస్ట్ విషెష్... వారణాసి రోల్‌పై హైప్ మామూలుగా లేదు
Least Eligible Bachelor Series : జబర్దస్త్ బాబుకు వైవా హర్ష బైక్ గిఫ్ట్ - రాయల్ ఎన్‌ఫీల్డ్‌ చూసి ఎమోషనల్ అయిన డైరెక్టర్
జబర్దస్త్ బాబుకు వైవా హర్ష బైక్ గిఫ్ట్ - రాయల్ ఎన్‌ఫీల్డ్‌ చూసి ఎమోషనల్ అయిన డైరెక్టర్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
Embed widget