Police Notices to Allu Arjun | అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు | ABP Desam
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తొమ్మిదేళ్ల శ్రీతేజ్ ను కలిసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాలని అల్లు అర్జున్ భావించారు. ఉదయం 10.30 గంటలకు కిమ్స్ కు వెళ్లాలని అల్లు అర్జున్ వెళ్లాలని సమాచారం పోలీసులకు తెలియటంతో అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. బన్నీ ఇంటికి వెళ్లిన నార్త్ జోన్ రామ్ గోపాల్ పేట్ పోలీసులు బాధితుడిని అల్లు అర్జున్ కలవటానికి వీల్లేదని నోటీసులు ఇచ్చారు. ఆసమయంలో అల్లు అర్జున్ లేకపోవటంతో ఆయన మేనేజర్ మూర్తికి నోటీసులు అందచేసి గోడకు అంటించారు. అల్లు అర్జున్ పాపులారిటీ ఉన్న హీరో కాబట్టి ఆయన రావటం వెళ్లటం తోటి రోగులకు , ఆసుపత్రికి వచ్చే వారికి తీవ్ర ఇబ్బంది కలగొచ్చని పోలీసులు నోటీసులో తెలిపారు. అల్లు అర్జున్ ఎప్పుడు వస్తారనేది ముందే చెబితే ఏర్పాట్లు చేసుకుంటామన్న పోలీసులు...ఆయన ఆసుపత్రికి వచ్చే విషయం కూడా రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని నోటీసులో పేర్కొన్నారు.