India out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP Desam
ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో సమర్పించుకోవటంతో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడే అవకాశాన్ని కోల్పోయింది. ఇండియాలో న్యూజిలాండ్ తో సిరీస్ కు ముందు వరకూ టేబుల్ టాపర్ గా ఉన్న మన జట్టు...రెండు సిరీస్ ల ఫలితం తారుమారు అవటంతో ఫైనల్ ఛాన్సే కోల్పోయింది. 2019-21, 2021-23 రెండుసార్లు భారత్ WTC ఫైనల్ ఆడింది. మొదటిసారి న్యూజిలాండ్ పై రెండోసారి ఆస్ట్రేలియా పై ఫైనల్లో ఓడిపోయినా..అసలు మనం లేకుండా ఫైనల్ జరుగుతుండటం ఇదే మొదటిసారి. బ్యాటింగ్ లో ఘోరమైన వైఫల్యాలే మన కొంప ముంచాయి. కొహ్లీ, రోహిత్ సిరీస్ మొత్తం ఆడేందుకు ఇబ్బంది పడ్డారు. జైశ్వాల్, నితీశ్ సెంచరీలతో మెరవగా..లాస్ట్ మ్యాచ్ లో పంత్ టచ్ లోకి వచ్చాడు. బౌలర్లలో బుమ్రా సిరీస్ లో 32వికెట్లు తీసుకుని ఆసీస్ ను వణికించినా..రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసినా...మరో బౌలర్ నుంచి సహకారం లేకపోవటంతో టీమిండియా 1-3 తేడాతో సిరీస్ ను సమర్పించుకోక తప్పలేదు.