Unstoppable With NBK Ram Charan | అన్ స్టాపబుల్ లో రచ్చ రచ్చ చేసిన బాలయ్య, రామ్ చరణ్ | ABP Desam
మెగా, నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కాంబినేషన్ వచ్చేసింది. అన్ స్టాపబుల్ సీజన్ లో గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్ మీట్ అయ్యారు. సంక్రాంతికి సందడి చేయనున్న ఈ హీరోలిద్దరూ హోస్టు, గెస్టులుగా రచ్చ రచ్చ చేశారు. అన్ స్టాపబుల్ లో సీజన్ 4లో భాగంగా తొమ్మిదో ఎపిసోడ్ కు రామ్ చరణ్ గెస్ట్ గా అన్ ప్రెడిక్టబుల్ ఎపిసోడ్ ప్లాన్ చేసిన ఆహా టీమ్ ప్రోమోను ఈ రోజు రిలీజ్ చేసింది. రామ్ చరణ్ సినిమా నుంచి మొదలుపెట్టి ఫ్యామిలీ వరకూ, ఫ్రెండ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రభాస్ చెప్పే సీక్రెట్స్ వరకూ చాలానే మాస్ ఎలిమెంట్స్ పెట్టారు ఎపిసోడ్ లో. క్లీంకార గురించి మాట్లాడుతూ ఎమోషన్ అయ్యారు రామ్ చరణ్. పాప నాన్న అని పిలిచినప్పుడే తనను అందరికీ చూపిస్తానని మాటిచ్చారు. మీ నాన్నగారు గర్వపడేలా ఇంటికి అమ్మవారిని తీసుకువచ్చావని బాలకృష్ణ అన్నప్పుడు ఎమోషనల్ అయ్యారు రామ్ చరణ్. రామ్ చరణ్ నాన్నమ్మ, అమ్మ రాసిన లెటర్ ను ఎపిసోడ్ లో చదివారు బాలకృష్ణ. వాళ్లకు మనవడు కూడా కావాలట. చరణ్ కు సపోర్ట్ చేయటానికి హీరో శర్వానంద్ వచ్చాడు. గతంలో ప్రభాస్ అన్ స్టాపబుల్ కి వచ్చినప్పుడు చెర్రీకి ఫోన్ చేస్తే..ఇప్పుడు చరణ్ వచ్చినప్పుడు బాలయ్య ప్రభాస్ కి ఫోన్ చేశారు. ప్రభాస్ ఏదో సీక్రెట్ కూడా చెప్పినట్లున్నారు చరణ్ గురించి. తన కుక్కపిల్ల రైమ్ గురించి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా చెప్పారు. అలా మొత్తం ఫుల్ ఫన్ అండ్ మసాలా ఎలిమెంట్స్ తో ఉన్న NBK RC ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా జనవరి 8 రాత్రి 7గంటలకు ఆహాలో స్ట్రీమ్ కానుంది.