NTR Thank You Note: అతడు లేకపోతే భీమ్ లేడు, RRRను ఊహించలేను! - ఎన్టీఆర్ ఎమోషనల్ థాంక్యూ నోట్
RRR - NTR Thank You Note: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు థాంక్స్ చెప్పారు. అలాగే, 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందానికి కూడా! ఇంకా ఆయన ఏమన్నారంటే...
![NTR Thank You Note: అతడు లేకపోతే భీమ్ లేడు, RRRను ఊహించలేను! - ఎన్టీఆర్ ఎమోషనల్ థాంక్యూ నోట్ NTR thanks RRR Cast and Crew, Fans, Audience for love and praise on RRR movie NTR Thank You Note: అతడు లేకపోతే భీమ్ లేడు, RRRను ఊహించలేను! - ఎన్టీఆర్ ఎమోషనల్ థాంక్యూ నోట్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/29/09d253ce0cdfa47e61ea251e29be4ffc_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
''ఆర్ఆర్ఆర్' (RRR Movie) విడుదలైన తరుణం నుంచి మీరంతా సినిమాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా నా సినిమా ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచిన 'ఆర్ఆర్ఆర్'ను రూపొందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను'' అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు.
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' (RRR Roudram Ranam Rudhiram) సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందానికి, అభిమానులకు, భారతీయ సినిమా ప్రేక్షకులకు ఎన్టీఆర్ థాంక్స్ చెబుతూ ఒక నోట్ విడుదల చేశారు.
"నా బెస్ట్ ఇచ్చేలా నన్ను ఇన్‌స్ఫైర్ చేసిన జక్కన్న (రాజమౌళి)కు థాంక్స్. నాలో బెస్ట్ బయటకు తీసుకొచ్చారు. నేను వాటర్ అని ఫీలయ్యేలా చేశారు. పాత్రలో లీనమయ్యేలా నన్ను పుష్ చేశారు. నా బ్రదర్ రామ్ చరణ్ లేకుండా 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని ఊహించుకోలేను. అల్లూరి సీతారామరాజు పాత్రకు చరణ్ తప్ప ఎవరూ న్యాయం చేయలేరు. 'ఆర్ఆర్ఆర్' సినిమాయే కాదు, భీమ్ పాత్ర కూడా చరణ్ లేకపోతే అసంపూర్తిగా ఉంటుంది. లెజెండరీ హీరో అజయ్ దేవగణ్ గారితో నటించడం గౌరవంగా భావిస్తున్నాను. ఆలియా భట్ పవర్ హౌస్. తన పాత్రతో సినిమాకు బలం చేకూర్చింది. ఒలీవియా, అలీసన్ డూడీ,రే స్టీవెన్ సన్ తమ నటనతో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. ఇండియన్ సినిమాకు వాళ్ళకు స్వాగతం పలుకుతున్నాను" అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య తమకు బలం అని ఎన్టీఆర్ తెలిపారు. 'ఆర్ఆర్ఆర్' అనే కలను నిజం చేసిన దానయ్యకు ఆయన థాంక్స్ చెప్పారు. కీరవాణి సంగీతం సినిమాకు ప్రాణం పోసిందన్నారు. రచయిత విజయేంద్ర ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ఎస్.ఎస్. కార్తికేయ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ తదితరులకు ఎన్టీఆర్ థాంక్స్ చెప్పారు.
Also Read: మూడు రోజుల్లో రూ. 500 కోట్లు, వసూళ్ల వేటలో 'ఆర్ఆర్ఆర్' సరికొత్త చరిత్ర
అభిమానులకు కూడా ఎన్టీఆర్ థాంక్స్ చెప్పారు. మరిన్ని సినిమాలతో వాళ్ళను ఎంటర్టైన్ చేస్తానని చెప్పారు. అభిమానులు చూపించే ఎటువంటి పరిమితులు లేని ప్రేమ, మద్దతు కరోనా సమయంలోనూ తాను బెస్ట్ ఇచ్చేలా దోహదం చేసిందని ఎన్టీఆర్ తెలిపారు.
Also Read: ఎమోషనల్ అయిన సాయి ధరమ్ తేజ్, యాక్సిడెంట్ తర్వాత తొలిసారి సెట్స్‌కు
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)