అన్వేషించండి

Telangana New Ration Cards: తెలంగాణ రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్- పాతకార్డులకు కాలం చెల్లినట్టేనా!

Telangana New Ration Cards: తెలంగాణలో క్యూఆర్ కోడ్‌తో ఉన్న రేషన్ కార్డులు పంపిణీకి సిద్ధమవుతోంది ప్రభుత్వం. దశల వారీగా పాత కార్డులను కూడా మార్చే ఆలోచన చేస్తోంది.

New Ration Card Telangana: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిసింది. ఇప్పటి వరకు రేషన్ కార్డుల పంపిణీ కోసం ఉన్న అడ్డంకి తొలగిపోయింది. దీంతో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. త్వరలోనే కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పనుంది. తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్డుల పంపిణీకి చర్యలు ప్రారంభించింది. క్యూఆర్‌ కోడ్‌తో ఉన్న కొత్త స్మార్ట్ కార్డులను ప్రజలకు ఇవ్వబోతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈ క్యూర్ కోడ్‌తో ఉన్న కార్డులు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. వివిధ రకాల డిజైన్‌లను అధికారులు ప్రభుత్వానికి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి చూసి ఫైనల్‌ చేసిన డిజైన్‌ను ఫైనల్‌ చేస్తారు.

పూర్తైన రేషన్ కార్దు దరఖాస్తుదారుల ఫిల్టరేషన్ 

తెలంగాణలో కొత్త కార్డుల కోసం లక్షల దరఖాస్తులు వచ్చాయి. అందులో అనర్హులను వేరు చేసి కొన్నింటిని ప్రభుత్వం ఫైనలైజ్ చేసింది. వాళ్లకు మొదట క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త రేషన్ కార్డులు ఇవ్వనుంది. అనంతరం ఇప్పటికే కార్డులు కలిగిన 90 లక్షల మందికి కూడా కార్డులు మార్చనుంది. అందరికీ స్మార్ట్ కార్డు మాదిరి కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 

కొత్త రేషన్ కార్డుల కోసం టెండర్లు

మార్చి మొదటి వారం నుంచే కొత్త కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది. దీనికి ఎమ్మెల్సీ కోడ్ అడ్డంకిగా మారింది. కానీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో పంపిణీ చేయాలని భావించారు. అయితే తొలిసారిగా క్యూఆర్‌ కోడ్ ఉన్న స్మార్ట్ కార్డులు ఇస్తున్నందున ప్రక్రియ ఆలస్యమైంది. అందుకే స్మార్ట్ కార్డుల కోసం టెండర్లు పిలిచింది ప్రభుత్వం. ఇందులో పాల్గొనే కంపెనీలు మార్చి 25 వరకు టెండర్లు వేయవచ్చు. ప్రీబిడ్డింగ సమావేశం మార్చి 17 నిర్వహిస్తారు. ఇది ఖరారు అయిన తర్వాత రేషన్ కార్డుల పంపిణీపై క్లారిటీ వస్తుంది. 

కొత్త కార్డులు మహిళల పేరుతోనే 

కొత్తగా వచ్చే స్మార్ట్ కార్డులు ఇంట్లో ఉండే మహిళల పేరుతోనే వస్తాయి. కార్డుపై ఆమె ఫోటోను ముద్రిస్తారు. ఒకవైపు సీఎం ఫొటో ఉంటుంది. మరోవైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటో చిన్నగా ఉంటాయి. పెద్ద ఫోటో కార్డు యజమానురాలదే ఉంటుంది. 

ప్రతి కార్డుపై క్యూఆర్ కోడ్ 

ఈ కార్డులకు QR కోడ్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. దీన్‌ని రేషన్ దుకాణాలలో స్కాన్ చేసినప్పుడు కుటుంబం సభ్యుల వివరాలు ఉంటాయి. ఆ రేషన్ కార్డు ఏ షాపు పరిధిలోకి వస్తుందో కూడా తెలుస్తుంది.  
ఈ రేషన్ కార్డుల కోసం అధికారులపై అధికారులు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు. రాజస్థాన్, కర్ణాటక, హర్యానా, గుజరాత్‌లో  అమలులో ఉన్న విధానాలు పరిశీలించారు. వాటిలో ఉత్తమమైన పద్దతులు గురించి తెలుసుకున్నారు. వాటిని ఇక్కడ అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  

ఇప్పుడు తీసుకొస్తున్న కొత్త కార్డులతో పంపిణీలో పారదర్శకత మెరుగుపడుతుంది. ప్రక్రియ కూడా వేగవంతం అవుతుంది. మోసాలు జరిగే అవకాశాలు తగ్గుతాయి. దుర్వినియోగానికి అవకాశం ఉండదని అధికారులు అంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
KTR Fires On Revanth Reddy:
"యువకులు ఆ*త్మహత్యలు చేసుకుంటున్నారు, జాబ్‌క్యాలెండర్‌ ఏమైంది?" ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget