అన్వేషించండి

The GOAT Movie Song: ‘ది గోట్’ నుంచి రెండో తెలుగు పాట - సాంగ్ ప్రోమోపై పాజిటివ్ రెస్పాన్స్

The GOAT Movie Song: ‘ది గోట్’ మూవీకి సంబంధించి తమిళంతో పాటు తెలుగులో కూడా అప్డేట్స్ బయటికొస్తున్నాయి. అందులో భాగంగానే ఇందులోని ఒక ఫీల్ గుడ్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.

The GOAT Movie Telugu Song Promo: ఈరోజుల్లో సీనియర్ హీరోలు కూడా యంగ్ హీరోలకు పోటీగా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్‌ను ఓకే చేయడంతో పాటు వాటిని పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు కూడా. అందులో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఒకరు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్.. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఆయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (G.O.A.T)లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి రెండో పాటకు సంబంధించిన అప్డేట్ బయటికొచ్చింది. దాంతో పాటు ఈ సాంగ్ ప్రోమో కూడా విడుదలయ్యింది.

భారీ అంచనాలు..

వెంకట్ ప్రభు, విజయ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’పై ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అందరిలాగా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఆలోచిస్తూ సినిమాలు తెరకెక్కించడంలో వెంకట్ ప్రభు దిట్ట. అలాంటి దర్శకుడు.. విజయ్‌ను ఎలా చూపిస్తాడో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన ప్రతీ అప్డేట్.. అందరినీ బాగా ఇంప్రెస్ చేసింది. పైగా ఇందులో విజయ్ డ్యూయెల్ రోల్‌లో కనిపించనున్నాడని కూడా ముందే ఓపెన్‌గా ప్రకటించారు మేకర్స్. ఇక తాజాగా ఈ సినిమాలోని రెండో పాటకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. తమిళంలో ఈ సాంగ్ ఎప్పుడో విడుదలయినా తెలుగులో విడుదల అవ్వడానికి కాస్త ఆలస్యం అయ్యింది.

తమిళంతో పాటు తెలుగులో..

విజయ్ ఇతర చిత్రాలలాగానే ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ కూడా తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ ఎత్తున విడుదల కానుంది. అందుకే ఈ సినిమాకు తమిళంతో పాటు తెలుగులో కూడా ప్రమోషన్స్ ప్రారంభించారు. తమిళంలో విడుదలయిన ప్రతీ అప్డేట్ తెలుగులో కూడా విడుదల అవుతోంది. అక్కడ ‘చిన్న చిన్న కంగళ్’ అనే పేరుతో విడుదలయిన పాట.. ఇక్కడ ‘నిన్ను కన్న కనులే’ పేరుతో విడుదలకు సిద్ధమయ్యింది. తాజాగా ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. జులై 18 సాయంత్రం 6 గంటలకు పూర్తి పాట రిలీజ్ అవ్వనుందని మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ ప్రోమోలో సింగర్ చిత్ర వాయిస్.. అందరినీ కట్టిపడేస్తోంది.

ఒక్క లిరిక్‌తోనే ఫిదా..

‘‘నిన్ను కన్న కనులే మెరిసెనుగా.. కన్న పేగు మరలా మురిసెనుగా. నిన్నలన్ని వరమై కురిసెనుగా.. గుండెలన్ని తేనెలో తడిసెనుగా’’ అనే  లిరిక్‌తో ప్రోమోను విడుదల చేశారు. ఎస్పీ చరణ్, చిత్ర కలిసి ఈ పాటను ఆలపించారు. యువన్ శంకర్ రాజా.. ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’కు సంగీతాన్ని అందించారు. దీంతో ఈ పాట ప్రోమోకు ఫిదా అయిన మ్యూజిక్ లవర్స్ ఫుల్ సాంగ్ కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా మీనాక్షి చౌదరీ నటించింది. ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, అజ్మల్ అమీర్, వైభవ్, లైలా, మోహన్, అరవింద్ కృష్ణ వంటి నటీనటులు కూడా ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అడ్వాన్స్ టెక్నికల్ ఎలిమెంట్స్‌తో ఈ మూవీ తెరకెక్కుతుందని సమాచారం.

Also Read: నవీన్ పోలిశెట్టికి గాయాలు - ఏం జరిగిందో క్లారిటీ ఇస్తూ ఎమోషనల్ పోస్ట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget