AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Minister Nimmala: మంత్రి నిమ్మల సభకు రావొద్దని స్పీకర్ స్థానంలో ఉన్న రఘురామ రూలింగ్ ఇచ్చారు. ఎందుకంటే ?

Andhra Minister Nimmala: ఎవరైనా సభ్యుడు సభకు రావొద్దని రూలింగ్ ఇవ్వడం అంటే.. అది విపక్ష సభ్యులను ఉద్దేశించే ఉంటుంది. ఎందుకంటే సభలో ఏదైనా అలజడి సృష్టిస్తే ఈ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఏపీ అసెంబ్లీలో ఓ వినూత్న పరిణామం చోటు చేసుకుంది. అధికార పార్టీ సభ్యుడిని అది కూడా మంత్రిని అసెంబ్లీకి రావొద్దని రూలింగ్ ఇచ్చారు. ఆ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇలా రూలింగ్ ఇవ్వడానికి కారణం ఏమిటంటే.. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నా సరే ... సెలైన్లు పెట్టించుకుని మరీ ఆసెంబ్లీకి వస్తున్నారు. ఇది ఆయనకు మంచిది కాదని.. స్పీకర్ ఊ రూలింగ్ ఇచ్చారు.
రామానాయుడు పని రాక్షసుడని. అయితే ప్రజా సేవతో పాటు మీ ఆరోగ్యం కూడా చూసుకోవాలని డిప్యూటీ స్పీకర్ స్పష్టం చేశారు. జ్వరం తగ్గేవరకు అసెంబ్లీకి రావద్దు. ఇది నా రూలింగ్ అని డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉన్నరఘురామ తేల్చేశారు.
#అసెంబ్లీకి_మంత్రి_నిమ్మలరాకుండా_రూలింగ్......
— Nimmala Ramanaidu (@RamanaiduTDP) March 7, 2025
*అసెంబ్లీలో జ్వరంతో బాధపడుతున్న మంత్రి నిమ్మల గురించి ఆసక్తికర చర్చ.....
గత నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ సెలైన్, ఐ వి ఎక్కించుకుంటూ రాష్ట్ర శాసనసభ సమావేశానికి హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు పై ఆసక్తికర చర్చ జరిగింది.… pic.twitter.com/hiYmOxKL3d
తీవ్ర జ్వరంతో ఉండి కూడా అసెంబ్లీ సమావేశాలకు నిమ్మల హాజరవుతున్నారు. చేతికి క్యానులా తో అసెంబ్లీకి హాజరైన మంత్రి రామానాయుడు ఆరోగ్యాన్ని ఇతర సభ్యులు అడిగి తెలుసుకున్నారు. గోరకల్లు రిజర్వాయర్ పై సమాధానం ఇచ్చి, తన సీట్లో కూర్చున్న సందర్భంలో స్పీకర్ స్థానంలో ఉన్న రఘురాం కృష్ణంరాజు మంత్రి నిమ్మల తామరాకు మీద నీటిబొట్టులా సమాధానం చెప్పారని సరదాగా అన్నారు. దీనిపై మంత్రి లోకేష్ వెంటనే స్పందించి.. అన్నకు బాగోలేదు అయినా అసెంబ్లీకి వచ్చేస్తున్నారు. చెప్పినా వినడం లేదు. మీరైనా రూలింగ్ ఇవ్వాలన్నారు.
ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనం అని భావించే మంత్రి నిమ్మల. సాటి మంత్రి ఆరోగ్యం గురించి ఆందోళన పడి ఆరా తీస్తున్న మంత్రి నారా లోకేశ్. గతంలో ఇలాంటి ఘటనలు అసెంబ్లీలో ఉండేవి కావు. బూతులు, దౌర్జన్యాలు, వెటకారాలు నాటి కౌరవ సభలో చూశాం. నేడు తోటి సభ్యులకు గౌరవం ఇచ్చే గౌరవ సభని చూస్తున్నాం.… pic.twitter.com/MblZOGu1wf
— Telugu Desam Party (@JaiTDP) March 7, 2025
జ్వరం అని తనకు తెలియదని రఘురామ అన్నారు. రామానాయుడు నాకు చాలా కాలంగా తెలుసు మా ఊరు పక్కవాడే. పట్టుదల మనిషి. జ్వరం తగ్గేవరకు అసెంబ్లీకి రా వద్దని రూలింగ్ ఇచ్చి తీరాల్సిందే అధ్యక్షా అని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా కోరడంతో రఘురామ రూలింగ్ ఇచ్చారు.
Also Read: ఏపీ చరిత్రలో మొదటిసారి టీచర్స్ సీనియారిటీ లిస్టు - అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

