By: ABP Desam | Updated at : 16 Jul 2022 04:18 PM (IST)
'మెగా 154' సినిమా సెట్స్‌లో మాస్ మహారాజ రవితేజ
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఒక సినిమా (Mega 154) రూపొందుతోంది. స్వతహాగా చిరంజీవి అభిమాని అయిన బాబీ... మెగా అభిమానులకు 'పూనకాలు లోడింగ్' అంటూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు.
ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మెగా 154 సెట్స్‌కు రవితేజ వెళ్లిన వీడియో విడుదల చేశారు. 'అన్నయ్యా...' అని రవితేజ కేర్ వ్యాన్ డోర్ కొట్టడం... 'వెల్కమ్ బ్రదర్' అని చిరంజీవి అనడం అందులో వినిపించాయి. 'మెగా మాస్ కాంబో మొదలైంది' అని దర్శకుడు బాబీ తెలిపారు.
Mega 154కు 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) టైటిల్ ఖరారు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే... ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.
చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : అరెరే, విజయ్ దేవరకొండ 'లైగర్' క్లైమాక్స్ ట్విస్ట్ లీక్ అయ్యిందే
చిత్ర దర్శకుడు బాబీ కథ, మాటలు రాయగా... స్క్రీన్‌ప్లే : కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్ దేవరమానె, ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్: సుష్మిత కొణిదెల, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం.
Also Read : నాకు మా అమ్మాయి ఏమీ చెప్పలేదు - లలిత్ మోడీతో సుష్మితా సేన్ డేటింగ్‌పై తండ్రి స్పందన
Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?
Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక
Swathimuthyam Release Date : దసరా సీజన్ టార్గెట్ చేసిన బెల్లంకొండ
Karthi Confirms Kaithi 2 : 'ఖైదీ' సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన కార్తీ - విజయ్ సినిమాతో ముడి పడిన మేటర్ మరి
Rana Daggubati : అన్నీ డిలీట్ చేసిన రానా - ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా లేదు
Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే
IB Terror Warning: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు ఛాన్స్! IB వార్నింగ్, ఈ ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్
Road Accident: ఒక్కసారిగా టైరు పేలి కారు బోల్తా, నలుగురు మృతి - నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Godavari Floods: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి - రెండో ప్రమాద హెచ్చరిక జారీ