Sushmita Sen Father Reaction: నాకు మా అమ్మాయి ఏమీ చెప్పలేదు - లలిత్ మోడీతో సుష్మితా సేన్ డేటింగ్‌పై తండ్రి స్పందన
లలిత్ మోడీతో సుష్మితా సేన్ డేటింగ్ గురించి ఆమె తండ్రి షుబీర్ సేన్ స్పందించారు. తనకు ఏమీ తెలియదని చెప్పారు.
లలిత్ మోడీతో సుష్మితా సేన్ డేటింగ్ విషయం తెలిశాక... హిందీ హీరో రణ్వీర్ సింగ్ కంగ్రాట్స్ చెప్పారు. మూడేళ్లు సుష్మితతో డేటింగ్ చేసిన రోమన్ షాల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సర్ప్రైజ్అయ్యానని చెప్పారు. మరి, తండ్రి సంగతి ఏంటి?
సుష్మితా సేన్ తండ్రి షుబీర్ సేన్‌కు అమ్మాయి ప్రేమ విషయం తెలుసా? అంటే... తెలియదు. ఇది నిజం! మీడియా చెప్పడంతో ఆయనకు అసలు విషయం అర్థం అయింది. అమ్మాయి లేటెస్ట్ రిలేషన్షిప్ గురించి షుబీర్ సేన్ మాట్లాడుతూ ''నాకు ఈ విషయం తెలియదు. శుక్రవారం ఉదయం మా అమ్మాయితో ఫోనులో మాట్లాడాను. అప్పుడు కూడా ఏమీ చెప్పలేదు. ఒక్కసారి కూడా లలిత్ మోడీ ప్రస్తావన తీసుకు రాలేదు. ఆయన చేసిన ట్వీట్ గురించి మీడియా మిత్రులు చెప్పారు. అందువల్ల, నేను ఏమీ వ్యాఖ్యానించలేను'' అని అన్నారు.
Also Read : లలిత్ మోడీ - సుష్మిత ప్రేమకు మాజీ బాయ్‌ఫ్రెండ్ సపోర్ట్
ఒకవేళ లలిత్ మోడీతో ప్రేమ నిజమైతే తన కుమార్తె జీవితంలో కీలక మలుపు అవుతుందని షుబీర్ సేన్ అన్నారు. భవిష్యత్తులో తనకు తప్పకుండా తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. తన కుమార్తె 18 నెలల క్రితం ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌కు వచ్చిందని... ఆ తర్వాత నుంచి ఫోనుల్లో మాట్లాడుకుంటున్నామని షుబీర్ చెప్పుకొచ్చారు. అదీ సంగతి!
Also Read : మళ్ళీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు
View this post on Instagram
View this post on Instagram