Sankranti TV Movies 2025: సమంత 'యశోద' to వెంకీ 'సైంధవ్', కళ్యాణ్ రామ్ 'డెవిల్' వరకు - సంక్రాంతికి 'ఈటీవీ సినిమా'లో సందడి వీటిదే
Makar Sankranti 2025 TV Movies Telugu: ప్రతిరోజూ టీవీలో వచ్చే సినిమాల కోసం వెయిట్ చేసే ఆడియన్స్ కొందరు ఉంటారు. సంక్రాంతి రోజు ఏయే సినిమాలు వస్తున్నాయ్ అని చూసే జనాల కోసం 'ఈటీవీ సినిమా'లో లిస్ట్...
Telugu movies to watch on ETV Cinema Channel airing from January 10 to 17th, every night at 7 PM: సంక్రాంతి... మన తెలుగు ప్రజలకు పెద్ద పండుగ. మెజారిటీ జనాలు థియేటర్లలో కొత్త సినిమాలు చూసేందుకు వెళ్తారు. కొంతమంది కుటుంబంతో కలిసి టీవీలో వచ్చే సినిమాల కోసం వెయిట్ చేస్తారు. అటువంటి జనాల కోసం పెద్ద పండుగ - సంక్రాంతి వారంలో 'ఈటీవీ సినిమా' ఛానల్ అర డజను సినిమాలను బుల్లితెర వీక్షకుల కోసం టెలికాస్ట్ చేస్తోంది. సంక్రాంతి సంబరాలు పేరుతో తీసుకు వస్తున్న ఆ సినిమాలేవో చూడండి.
జనవరి 10వ తేదీ రాత్రి... నిఖిల్ నటించిన థ్రిల్లర్!
'కార్తికేయ 2'తో పాన్ ఇండియా హిట్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్. సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఆజాద్ హింద్ ఫౌజ్ (ఆర్మీ)ని బేస్ చేసుకుని రూపొందించిన యాక్షన్ థ్రిల్లర్ 'స్పై'. ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్. జనవరి 10వ తేదీ రాత్రి 7 గంటలకు ఈ సినిమా టెలికాస్ట్ కానుంది.
జనవరి 11వ తేదీ రాత్రి... అజయ్ ఘోష్ హీరోగా!
'పుష్ప', 'మంగళవారం' తదితర సినిమాల్లో క్యారెక్టర్ల ద్వారా పాపులర్ అయిన నటుడు అజయ్ ఘోష్. ఆయన హీరోగా నటించిన సినిమా 'మ్యూజిక్ షాప్ మూర్తి'. ఐదు పదుల వయసులో సంగీత దర్శకుడు కావాలనే తన కలను ఎలా నెరవేర్చుకున్నాడనే కథతో రూపొందిన చిత్రమిది. ఇందులో చాందిని చౌదరి కీలక పాత్ర పోషించారు. జనవరి 11వ తేదీ రాత్రి 7 గంటలకు ఈ సినిమా టెలికాస్ట్ కానుంది.
జనవరి 12వ తేదీ రాత్రి... యూత్ ఫుల్ 'మ్యాడ్'
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ఓ హీరోగా నటించిన సినిమా 'మ్యాడ్'. ఇందులో సంగీత్ శోభన్, రామ్ నితిన్ ఇతర హీరోలు. కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ జనవరి 12వ తేదీ రాత్రి 7 గంటలకు 'ఈటీవీ సినిమా'లో టెలికాస్ట్ కానుంది.
జనవరి 13వ తేదీ రాత్రి... నోస్టాలజీలోకి వెళ్లే 90స్!
ఓటీటీ అంటే ఎరోటిక్, అడల్ట్ కంటెంట్ మాత్రమే చూసే ఆడియన్స్ ఉంటారనే అభిప్రాయాన్ని తప్పని నిరూపించిన వెబ్ సిరీస్ '90స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్'. సీనియర్ హీరో శివాజీ ప్రధాన పాత్రలో రూపొందిన సిరీస్ ఇది. ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైన సిరీస్ ఇది. జనవరి 13వ తేదీ రాత్రి 7 గంటలకు టెలికాస్ట్ కానుంది.
జనవరి 14వ తేదీ రాత్రి... సమంత 'యశోద'
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన కంటెంట్ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా 'యశోద'. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ షేడ్ ఉన్న రోల్ చేశారు. సరోగసి, మహిళల సౌందర్య ఉత్పత్తుల మీద రూపొందిన చిత్రమిది. జనవరి 14వ తేదీ రాత్రి 7 గంటలకు 'ఈటీవీ సినిమా'లో టెలికాస్ట్ కానుంది.
Also Read: ఈటీవీలో కొత్త సీరియల్... 'ఝాన్సీ' టెలికాస్ట్ టైమింగ్ నుంచి యాక్టర్స్ వరకు - ఈ డీటెయిల్స్ తెలుసా?
జనవరి 15వ తేదీ రాత్రి... వెంకీ మామ యాక్షన్ ఫిలిం!
విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా రూపొందిన 75వ సినిమా 'సైంధవ్'. హిట్ ఫ్రాంచైజీ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం సాధించలేదు. అయితే, వెంకీ మామను చాలా రోజుల తర్వాత మాస్ యాక్షన్ పాత్రలో చూపించిన సినిమా ఇది. జనవరి 15వ తేదీ రాత్రి 7 గంటలకు ఈ సినిమా టెలికాస్ట్ కానుంది.
జనవరి 16వ తేదీ రాత్రి... కళ్యాణ్ రామ్ డెవిల్!
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'డెవిల్'. సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంలో ఈ సినిమా కూడా రూపొందింది. సంయుక్త కథానాయికగా నటించిన ఈ సినిమా జనవరి 16వ తేదీ రాత్రి 7 గంటలకు టెలికాస్ట్ కానుంది.