Amaravati Ki Atu Itu: మహేష్ సినిమా టైటిల్ అదేనా? సెంటిమెంట్ కంటిన్యూ చేసిన త్రివిక్రమ్
త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న తాజాగా చిత్రం ‘#SSMB28’. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్, మహేష్ బాబుల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టు ‘#SSMB28’. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నిర్మాతలు తాజాగా మరో అదిరిపోయే అప్ డేట్ ఇవ్వబోతున్నారు. మహేష్ తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 11న ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మూవీ టైటిల్ గురించి మేకర్స్ బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ తన సెంటిమెంట్ ను కొనసాగిస్తూ టైటిల్ ‘అ’ అనే అక్షరంతో మొదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. అనుకున్నట్లుగానే ఈ సినిమాకు ‘అమరావతి కి అటు ఇటు’ అనే టైటిల్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. మరో టైటిల్ పైనా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అయితే, ఆ టైటిల్ ఏంటి అనేది మాత్రం బయటకు రాలేదు.
జనవరి 13, 2024న విడుదల
ఇప్పటికే ‘#SSMB28’ సినిమా విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 13వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. చేతిలో సిగరెట్‌తో మాసీ లుక్‌లో మహేష్ బాబును ఈ పోస్టర్ ను విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
View this post on Instagram
13 ఏండ్ల తర్వాత మళ్లీ జోడీ కట్టిన మహేష్, త్రివిక్రమ్
'అతడు', 'ఖలేజా' తర్వాత... సుమారు 13 ఏండ్లకు త్రివిక్రమ్, మహేష్ బాబు మరోసారి సినిమా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సినిమా గురించి అనౌన్స్ చేశారు. చిన్న షెడ్యూల్ చేశారు. అయితే, పూర్తి స్థాయిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసింది మాత్రం 2023లోనే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
ఓటీటీ రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్
మహేష్ బాబు, త్రివిక్రమ్ తాజా సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ కొన్ని రోజుల క్రితం వెల్లడించింది. థియేట్రికల్ విడుదల తర్వాత తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను తమ ఓటీటీ వేదికలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. దీంతో ఇది పాన్ ఇండియా సినిమా అనే క్లారిటీ వచ్చింది. మహేష్ బాబుతో పాటు, త్రివిక్రమ్‌కు ఇదే తొలి పాన్ ఇండియా మూవీ. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ రూ. 80 కోట్ల రూపాయలు పలికినట్లు తెలుస్తోంది.
Read Also: పదిహేను కోట్లు ఖర్చు పెట్టి రివేంజ్ తీర్చుకోవాలా? ‘మళ్ళీ పెళ్లి’పై నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్