Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్
Salman Khan: మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తాజాగా సల్మాన్ ఖాన్ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం కాల్పుల పరిణామాలపై చర్చించారు.
Maharashtra Chief Minister Eknath Shinde met Bollywood actor Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడం బాలీవుడ్ లో కలకలం రేపిన విషయం తెలిసిందే. సరిగ్గా రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ముంబై బాంద్రాలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్టుమెంట్ ముందు ఇద్దరు అగంతకులు కాల్పులు జరిపారు. మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరిపి ఆ తర్వాత బైక్ పై పారిపోయారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయం కాకపోవడంతో ప్రమాదం కాస్త తప్పింది. ఈ ఘటనతో బాలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనపై ఇప్పటికే పలువురు సల్మాన్ ఖాన్‌కు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకోగా.. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే సల్మాన్ ఖాన్ నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
సల్మాన్ ఇంటికి మహారాష్ట్ర సీఎం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మంగళవారం సల్మాన్ ఖాన్ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికారు. ఈ మేరకు సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యుల్ని సీఎం ఏక్ నాథ్ షిండే పరామర్శించారు. అనంతరం కాల్పుల పరిణామాలపై చర్చించారు. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ భద్రత గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిక్, జీషన్ సిద్ధిక్, రాహుల్ కనల్ సైతం పాల్గొన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Maharashtra Chief Minister Eknath Shinde met Bollywood actor Salman Khan at Galaxy Apartment in Bandra. Senior screenwriter Salim Khan, father of Salman Khan, was also present on this occasion. During the visit, the Chief Minister assured Salman and his family of their safety. He… https://t.co/XRBEsNbE6Z
— ANI (@ANI) April 16, 2024
సల్మాన్ భద్రత పై సీఎం ప్రత్యేక ఆదేశాలు
సల్మాన్ ఖాన్‌తో భేటీ అనంతరం సీఎం ఏక్ నాథ్ షిండే మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంతేకాకుండా కాల్పుల ఘటనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించిన ఆయన.. ఈ సంఘటనలో ఎలాంటి ముఠా ఉన్నా వదిలి పెట్టబోమని హెచ్చరించారు. అంతేకాకుండా సల్మాన్ కుటుంబానికి భద్రత కల్పించాలని పోలీస్ కమిషనర్ కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
అదుపులోకి ఇద్దరు నిందితులు
సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర నిందితులు జరిపిన కాల్పుల ఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసిటీవీలో రికార్డు కాగా వాటి ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు మమ్మరం చేసి గాలింపు జరపడంతో నిందితులు గుజరాత్‌లో ఉన్నట్లు తెలిసింది. నిందితులిద్దరూ విక్కీ గుప్తా, సాగర్ పాల్ గా పోలీసులు గుర్తించారు. గుజరాత్ లోని భుజ్ లో వారిద్దరిని అరెస్ట్ చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఆ ఇద్దరు నిందితులు బీహార్ లోని పశ్చిమ చంపారన్‌కు చెందిన వాళ్లని, గతంలో వాళ్లపై చాలా చైన్స్ స్నాచింగ్ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నార్త్ ఇండియాలోని పలు రాష్ట్రాల్లో దొంగతనాలు కూడా చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయన్నారు.
Also Read : సల్మాన్ భాయ్‌ను చంపొద్దు, మీకు చేతులు జోడించి వేడుకుంటున్నా - బాలీవుడ్ నటి ఆవేదన!