అన్వేషించండి

AP ICET 2025: ఏపీ ఐసెట్-2025 నోటిఫికేషన్‌ విడుదల, దరఖాస్తు ప్రక్రియ ఎప్పటినుంచంటే

ఏపీలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2025 విడుదలైంది. మార్చి 13 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంమవుతుంది. మే 7న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

AP ICET 2025 Notification: ఆంధ్రప్రదేశ్‌లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2025 (AP ICET 2025) నోటిఫికేషన్‌ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. దీని ద్వారా 2025-2026 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫుల్ టైమ్‌ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 13 నుంచి ఏప్రిల్‌ 9వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 7న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.650, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.550 చెల్లించాలి.

వివరాలు..

* ఏపీ ఐసెట్-2025

కోర్సుల వివరాలు..

1) ఎంసీఏ

అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీసీఏ, బీఎస్సీ-కంప్యూటర్స్, బీకామ్, బీఏ). ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

2) ఎంబీఏ

అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకామ్/ బీబీఏ/ బీబీఎం/ బీసీఏ/ బీఈ/ బీటెక్/ బీఫార్మసీ). ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

వయోపరిమితి: 19 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ఠ వయసు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఐసెట్ ర్యాంకు ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.650 చెల్లించాలి. బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550 చెల్లిస్తే సరిపోతుంది. 

పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: కమ్యూనికేషన్ ఎబిలిటీ-70 ప్రశ్నలు-70 మార్కులు, సెక్షన్-సి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-55 ప్రశ్నలు-55 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు (రెండున్నర గంటలు).

Notification
AP ICET 2025: ఏపీ ఐసెట్-2025 నోటిఫికేషన్‌ విడుదల, దరఖాస్తు ప్రక్రియ ఎప్పటినుంచంటే

ఏపీ ఐసెట్-2025 ముఖ్యమైన తేదీలు: 

➽ ఏపీఐసెట్-2025 నోటిఫికేషన్:  11.03.2025.

➽ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 13.03.2025. 

➽ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 09.04.2025.

➽ ఏపీ ఐసెట్ పరీక్ష నిర్వహణ:  07.05.2025.
పరీక్ష సమయం: 09.00 AM - 11.30AM, 02.00 PM to 04.30 PM

ALSO READ: 

AP CETS 2025 Schedule: ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 12న ప్రకటించింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో పరీక్షల షెడ్యూలును విడుదల చేశారు. రాష్ట్రంలో మే 2 నుంచి జూన్ 25 మధ్య పలు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 2 నుంచి 5 మధ్య ఏపీఆర్‌సెట్ (APRCET) పరీక్షలు; మే 6న ఏపీఈసెట్ (AP ECET); మే 7న ఏపీ ఐసెట్ (APICET); మే 19 నుంచి 27 మధ్య ఏపీఈఏపీసెట్ (AP EAPCET) పరీక్షలు నిర్వహించనున్నారు. వీటిలో అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు మే 19, 20 తేదీల్లో, ఇంజినీరింగ్ విభాగానికి మే 21 నుంచి 27 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.  మే 25న లాసెట్/పీజీఎల్‌సెట్ (AP LAWCET/PGLCET), పీజీఈసెట్ (PGECET) పరీక్షలను జూన్ 5 నుంచి 7 వరకు, ఎడ్‌సెట్ (AP EDCET) పరీక్షలను జూన్ 8న, పీజీసెట్ (AP PGCET) పరీక్షలు జూన్ 9 నుంచి 13 వరకు జరుగనున్నాయి.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Study in Germany: జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
జర్మనీలో చదువు ఫ్రీ.. కానీ ట్యూషన్ ఫీజులు, అసలు ఖర్చుల గురించి తెలుసా?
Local Reservation In Telangana: తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్
తెలంగాణలో స్థానికత అంశంపై సుప్రీంకోర్టు క్లారిటీ.. వారికి మాత్రమే లోకల్ రిజర్వేషన్ అని తీర్పు
NRI Become IAS: ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
ఎన్ఆర్ఐలు UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయొచ్చా?.. ఐఏఎస్ అవ్వాలంటే అర్హతలేంటి?
Adilabad News: తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive
తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Degree Case: ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
ప్రధాని మోదీ డిగ్రీ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌ అప్పీల్ కొట్టివేత, రూ.25 వేల జరిమానా
Onions Price: ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
ఏపీలో రైతు బజార్లలో రూ.35కే కేజీ ఉల్లిపాయలు విక్రయం
Palle Panduga 3.0: వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
వైసీపీ ఐదేళ్ల కంటే కూటమి రెండేళ్లలో పదింతల రోడ్లు.. 161 నియోజకవర్గాల్లో డొంక రోడ్లు - పవన్ కల్యాణ్
Water Based Battery: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Bigg Boss Season 10 Today Promo 2: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో 2: కెప్టెన్సీ పోగొట్టుకున్నా ఆ పదవి కోసం ముకేశ్ గొడవ! చేతులారా చేసుకున్నాడా!
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Embed widget