News
News
X

Kajal Aggarwal Ghosty In Telugu : తెలుగులోకి కాజల్ అగర్వాల్ 'ఘోస్టీ' - విడుదల ఎప్పుడంటే?

కాజల్ అగర్వాల్, రాధికా శరత్ కుమార్, యోగి బాబు ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా 'ఘోస్టీ'. తెలుగులోనూ ఈ సినిమా విడుదల కానుంది.

FOLLOW US: 
Share:

తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). ఆఫ్టర్ ఏ స్మాల్ బ్రేక్... మళ్ళీ వెండితెరపై సందడి చేయడానికి రెడీ అయ్యారు. అదీ మామూలుగా కాదు, డ్యూయల్ రోల్ సినిమాతో ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి ఈ నెలలోనే థియేటర్లలోకి కాజల్ వస్తున్నారు. తమిళంలో ఆమె నటించిన సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

తెలుగులోనూ 'ఘోస్టీ' 
కాజల్ అగర్వాల్, కోలీవుడ్ స్టార్ కమెడియన్ యోగి బాబు (Yogi Babu) ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమా 'ఘోస్టీ' (Ghosty Movie). అలయన్స్ విత్ ఘోస్ట్... అనేది ఉపశీర్షిక. అంటే... దెయ్యంతో దోస్తీ, లేదంటే సంధి అనుకోవచ్చు. గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకు వస్తోంది. 

ఉగాదికి సినిమా విడుదల
Kajal Aggarwal's Ghosty Movie Release Date : 'ఘోస్టీ'కి కళ్యాణ్ దర్శకత్వం వహించారు. తమిళంలో ఈ సినిమాను సీడ్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఉగాది సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నట్లు గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత వెల్లడించారు. తమిళంలో మార్చి 17న సినిమాను విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. మరి, తెలుగులో కూడా ఆ తేదీకి వస్తుందా? లేదా? అనేది త్వరలో తెలుస్తుంది.
 
మార్చి 17న తెలుగులో మరో రెండు సినిమాలు విడుదల కానున్నాయి. కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర, 'కిచ్చా' సుదీప్ నటించిన 'కబ్జా', నాగశౌర్య హీరోగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' చిత్రాలు సైతం ఆ రోజే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. 'కబ్జా'లో శ్రియ హీరోయిన్. రెండో సినిమాలో మాళవికా నాయర్ హీరోయిన్. 

కాజల్ అగర్వాల్ డ్యూయల్ రోల్
'ఘోస్టీ' / 'కోస్టీ' సినిమాలో కాజల్ అగర్వాల్ డ్యూయల్ రోల్ చేశారు. పోలీస్ అధికారి పాత్రలో, కథానాయికగా... రెండు పాత్రల్లో సందడి చేయనున్నారు. విజయ్ 'జిల్లా' సినిమాలో కాజల్ పోలీస్ రోల్ చేశారు. అయితే... ఆ పాత్రకు, 'ఘోస్టీ'లో పాత్రకు చాలా వ్యత్యాసం ఉంటుందట. కాజల్ రెండు పాత్రలకు ఆత్మలకు సంబంధం ఏమిటి అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్.

హైలైట్ కానున్న కన్‌ఫ్యూజన్ కామెడీ
'ఘోస్టీ'లో అప్‌కమింగ్ దర్శకుడిగా యోగి బాబు కనిపించనున్నారు. ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలనుకుని కాజల్ దగ్గరకు వెళతాడు. తనను, తన స్నేహితులను మణిరత్నం దగ్గర అసిస్టెంట్లుగా పరిచయం చేసుకుంటాడు. అయితే, హీరోయిన్ క్యారెక్టర్ దగ్గరకు కాదు. పోలీస్ క్యారెక్టర్ దగ్గరకు! మరొక సందర్భంలో ఇంకొకరు కూడా అదే విధంగా కన్‌ఫ్యూజ్ అవుతారు. ఆ కామెడీ హైలైట్ కానుందని సమాచారం. అసలు, హీరోయిన్ దగ్గరకు ఆత్మలు ఎందుకు వెళ్లాయి? అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ అంట!

Also Read : నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి నిజమా? ఫేకా? - వీడియోలో ఇవి గమనించారా?

'ఘోస్టీ'లో భారీ తారాగణం ఉంది. కాజల్, యోగి బాబుకు తోడు కె.ఎస్. రవికుమార్, రిడిన్ కింగ్ స్లే, తంగదొరై, జగన్, ఊర్వశి, సత్యన్, 'ఆడు కాలం' నరేన్, మనోబాల, మొట్ట రాజేంద్రన్, సంతాన భారతి, దేవదర్శిని నటించారు. రాధికా శరత్ కుమార్ అతిథి పాత్ర చేశారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు.    

కాజల్ చేతిలో భారీ సినిమాలు! 
నీల్ జననం తర్వాత కొన్నాళ్ళు షూటింగులకు దూరంగా ఉన్న కాజల్, మళ్ళీ ముఖానికి మేకప్ వేస్తున్నారు. కమల్ హాసన్ 'ఇండియన్ 2'లో ఆమె నటిస్తున్నారు. తమిళంలో మరో సినిమా ఉంది. హిందీ సినిమా 'ఉమ' చిత్రీకరణ పూర్తి చేశారు. హిందీలో 'షూటవుట్ ఎట్ బైకులా' సినిమా ఒకటి ఉంది.  

Also Read : గుండెల్లో దేశాన్ని నింపుకొని, భారతీయుడిగా ఆస్కార్స్ రెడ్ కార్పెట్ మీద నడుస్తా - ఎన్టీఆర్

Published at : 10 Mar 2023 04:53 PM (IST) Tags: kajal aggarwal Yogi Babu Ghosty Telugu Release Ghosty On Ugadi 2023

సంబంధిత కథనాలు

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం

Ravanasura – Sushanth: సుశాంత్‌కు ‘రావణాసుర’ టీమ్ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్, విలన్ పాత్రలో అదుర్స్ అనిపించాడుగా!

Ravanasura – Sushanth: సుశాంత్‌కు ‘రావణాసుర’ టీమ్ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్, విలన్ పాత్రలో అదుర్స్ అనిపించాడుగా!

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !