Jr NTR on Oscars : గుండెల్లో దేశాన్ని నింపుకొని, భారతీయుడిగా ఆస్కార్స్ రెడ్ కార్పెట్ మీద నడుస్తా - ఎన్టీఆర్
అమెరికా వెళ్లిన ఎన్టీఆర్, 'ఎంటర్టైన్మెంట్ టునైట్'కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో దేశం గురించి గొప్పగా చెప్పారు.
చరిత్రకు 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమా (RRR Movie) ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఆస్కార్ అవార్డుల్లో 'నాటు నాటు...' (Naatu Naatu Song)కు నామినేషన్ లభించిన విషయం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బెస్ట్ ఒరిజినల్ సింగ్ విభాగంలో ఆ పాటకు అకాడమీ అవార్డు రావడం ఖాయమని యావత్ భారత దేశమంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తోంది. భారతీయ కాలమానం ప్రకారం... ఈ సోమవారం తెల్లవారుజామున అవార్డ్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆల్రెడీ టీమ్ అంతా అమెరికా చేరుకుంది. లేటెస్టుగా 'ఎంటర్టైన్మెంట్ టునైట్'కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశమంతా గర్వించేలా ఆయన మాట్లాడారు.
'ఆర్ఆర్ఆర్' హీరోగా కాదు... భారతీయుడిగా!
'నాటు నాటు...' పాటకు ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ రావడం గురించి ఎన్టీఆర్ (NTR)ను హోస్ట్ ప్రశ్నించగా... ''ప్రపంచవ్యాప్తంగా సినిమాను సెలబ్రేట్ చేసుకునే ఆస్కార్ అవార్డుల్లో భాగం కావడం కన్నా ఓ యాక్టర్, ఫిల్మ్ మేకర్ ఏం కోరుకుంటాడు? ఆస్కార్స్ రోజున 'ఆర్ఆర్ఆర్' హీరోగా లేదంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా రెడ్ కార్పెట్ మీద నడవను. భారతీయుడిగా ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద నడుస్తా. నా గుండెల్లో దేశాన్ని నింపుకొని సగర్వంగా నడుస్తా'' అని ఎన్టీఆర్ సమాధానం ఇచ్చారు. ఆయన చెప్పిన మాటలు అభిమానులు గర్వపడేలా ఉన్నాయి. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాముఖ్యం ఇచ్చి దేశంపై తనకు ఎంత ప్రేమ, గౌరవం ఉన్నాయో ఎన్టీఆర్ చాటుకొన్నారు.
Also Read : స్టార్ హీరో సమాధానం చెప్పాలి - ప్లకార్డుతో హీరో ఇంటి ముందు వెంకటేష్ మహా ధర్నా
#RRR star @tarak9999 will carry his "nation in [his] heart" as he walks the #Oscars red carpet this Sunday. pic.twitter.com/mwWhDvI3KZ
— Entertainment Tonight (@etnow) March 10, 2023
కాళ్ళు ఇంకా నొప్పి పెడుతున్నాయ్!
'నాటు నాటు...' సాంగ్, అందులో స్టెప్పుల గురించి కూడా 'ఎంటర్టైన్మెంట్ టునైట్' షోలో ప్రస్తావన వచ్చింది. ఆ పాటకు స్టెప్పులు వేయడం వల్ల తన కాళ్ళు ఇంకా నొప్పి పెడుతున్నాయని ఎన్టీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు. దర్శక ధీరుడు రాజమౌళి ఆ పాట విషయంలో కాంప్రమైజ్ కాలేదని, తమతో 17 టేక్స్ చేయించారని ఎన్టీఆర్, రామ్ చరణ్ గతంలో వివరించిన సంగతి తెలిసిందే.
Also Read : 'యాంగర్ టేల్స్' రివ్యూ : నాలుగు కథలు, ఒక్కటే ఎమోషన్ - వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
#RRR's @tarak9999 says his "legs still hurt" from shooting the icon 'Naatu Naatu' dance scene, but that the singing was actually the hardest part. 👀 pic.twitter.com/dc8CHVyXsW
— Entertainment Tonight (@etnow) March 10, 2023
అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ (Ram Charan), కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ (NT Rama Rao Jr)... ఈ ఇద్దరూ లేకుండా 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాను ఊహించుకోలేం! రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు వాళ్ళిద్దరి నటన తోడు కావడంతో సినిమా రికార్డులు తిరగ రాసింది. సినిమాలో వాళ్ళిద్దరి యాక్టింగ్ ఒక హైలైట్ అయితే, 'నాటు నాటు...'లో చేసిన డ్యాన్స్ మరో హైలైట్! ఈ పాటకు ఆస్కార్ నామినేషన్ లభించింది. ఆస్కార్స్ లైవ్ షోలో సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ స్టేజి మీద లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. అంతకు మించి? అనేలా ఎన్టీఆర్, చరణ్ డ్యాన్స్ చేయనున్నారు. నందమూరి తారక రత్న మరణం కారణంగా ఎన్టీఆర్ కాస్త ఆలస్యంగా అమెరికా వెళ్లారు.
ఆస్కార్స్ అవార్డుల వేడుక ముగిసిన రెండు మూడు రోజుల తర్వాత ఎన్టీఆర్ ఇండియా రిటర్న్ అవుతారని సమాచారం. ఆయన వచ్చిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయిక అని అధికారికంగా వెల్లడించారు. దీనికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు వర్క్ చేయనున్నారు. అమెరికాలో అక్కడి ఫైట్ మాస్టర్లతో కూడా ఎన్టీఆర్ డిస్కషన్స్ చేయనున్నారు.