By: Suresh Chelluboyina | Updated at : 10 Mar 2023 01:04 PM (IST)
Image Credit: H.E Dr Naresh VK actor/Twitter
ప్రముఖ నటుడు నరేష్ వీకే, పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, చాలామంది ఇది ఫేక్ కావచ్చనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం నరేష్, ఆయన మూడో భార్య మధ్య విడాకుల కేసు నడుస్తోంది. అయితే, అది కొలిక్కి వచ్చిందా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. ఒక వేళ వారి కేసు కోర్టులో ఉన్నట్లయితే నరేష్, పవిత్రా లోకేష్‌ల పెళ్లి చెల్లకపోవచ్చు. ఈ నేపథ్యంలో నరేష్ కావాలనే ఈ వీడియో వదిలారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నరేష్ పోస్ట్ చేసిన వీడియోను బాగా గమనిస్తే.. అది నిజమైనా పెళ్లిలా లేదు. పైగా ఆ వీడియోలో ఉన్నవారు కూడా బంధువుల్లా లేరు. ఏదో ఒక స్టూడియో సెట్టింగ్‌లో పెళ్లి చేసినట్లుగా విజువల్స్ కనిపిస్తున్నాయి. దీంతో ఇది ఏదైనా ప్రకటన కోసం కూడా కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే నరేష్ చేసిన ట్వీట్ కూడా అంత స్పష్టంగా లేదు. ఒక వేళ ఆయన మూడో భార్య రమ్య కోర్టులో ఈ పెళ్లి విషయాన్ని ప్రస్తావిస్తే.. నరేష్ ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్నది ఓ సినిమా కోసమనే సమాచారం కూడా చక్కర్లు కొడుతోంది. ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో వాళ్ళిద్దరూ జంటగా నటిస్తున్నారు. అందులో భాగంగానే వీరిద్దరిపై పెళ్లి సీన్ చిత్రీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై నరేష్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
నరేష్, పవిత్ర.. ఇద్దరూ నటీనటులే. కాబట్టి, వృత్తిలో భాగంగా ఇలాంటి సీన్లలో నటించడం సర్వ సాధారణమే. పైగా వీరు టాలీవుడ్‌లో పాపులర్ లవ్ బర్డ్స్. ఈ నేపథ్యంలో ప్రకటన సంస్థలు కూడా వీరి జోడి తమ ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఒక వేళ రమ్య కోర్టులో ఈ వీడియోను చూపించి ఆరోపణలు చేయాలన్నా కష్టమే. కేవలం నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్నట్లు ధృవీకరించే మ్యారెజ్ సర్టిఫికెట్ చూపించగలిగితేనే కోర్టు కూడా నమ్ముతుంది. అందుకే, నరేష్ ఇలా గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి సీన్ క్రియేట్ చేసి.. శాంపిల్‌గా ఈ వీడియో వదిలి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు నరేష్-పవిత్ర లోకేష్‌ల రిలేషన్ వ్యవహారం గత కొన్నాళ్లుగా హాట్ టాపిక్‌గా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నట్లు డిసెంబర్ 31వ తేదీన అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఇద్దరూ లిప్ లాక్ చేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటూ రిలీజ్ చేసిన వీడియో వైరల్ అయింది. దీనిపై ఇంటర్నెట్ లో అనేక చర్చలు నడిచాయి. ఆ తర్వాత నరేష్, పవిత్ర పెళ్లి మీద ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. అయితే, శుక్రవారం విడుదల చేసిన వీడియో చూసిన తర్వాత అంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఎలాంటి హడావిడి లేకుండా నరేష్ పెళ్లి చేసుకోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. తన పెళ్లి గురించి ముందుగా లీక్ చేస్తే రమ్య నుంచి ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే అలా చేసి ఉండొచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మీరు కూడా ఈ వీడియోను చూసే ఉంటారు. మరి, మీ అభిప్రాయం ఏమిటీ?
Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023
ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముళ్ళు
ఏడు అడుగులు 🙏
మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
- మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g
Also Read: పెళ్లి చేసుకున్న నరేష్, పవిత్ర లోకేష్ - వీడియో వదిలిన కొత్త జంట
Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !
NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ
Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్
Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా
Rashmi Gautam Lifestyle : రష్మి వెనుక ఇంత తలనొప్పి ఉందా? స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ‘జబర్దస్త్’ యాంకర్
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
KTR Inaugurates LB Nagar Flyover : ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఇకపై ట్రాఫిక్ కష్టాలకు విముక్తి!
Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!
Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!