By: Suresh Chelluboyina | Updated at : 10 Mar 2023 12:09 PM (IST)
Image Credit: H.E Dr Naresh VK actor/Twitter
ప్రముఖ టాలీవుడ్ నటుడు నరేష్ వీకే, పవిత్ర లోకేష్ ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు. శుక్రవారం సోషల్ మీడియాలో తమ పెళ్లి వీడియోను విడుదల చేశారు.
‘‘ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముళ్ళు
ఏడు అడుగులు 🙏
మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
- మీ #PavitraNaresh’’
అంటూ ఆయన ట్విట్టర్ ద్వారా తమ పెళ్లి గురించి ప్రకటించారు. అయితే, వీరి పెళ్లి ఎక్కడ జరిగిందనేది స్పష్టత లేదు. తమ కుటుంబ సభ్యుల సమక్షంలో మైసూర్‌లో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఇది నిజమైన పెళ్లా? లేదా తెలివిగా వదిలిన వీడియోనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు నరేష్-పవిత్ర లోకేష్‌ల రిలేషన్ వ్యవహారం గత కొన్నాళ్లుగా హాట్ టాపిక్‌గా చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నట్లు డిసెంబర్ 31వ తేదీన అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఇద్దరూ లిప్ లాక్ చేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటూ రిలీజ్ చేసిన వీడియో వైరల్ అయింది. దీనిపై ఇంటర్నెట్ లో అనేక చర్చలు నడిచాయి. ఆ తర్వాత నరేష్, పవిత్ర పెళ్లి మీద ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. అయితే, శుక్రవారం విడుదల చేసిన వీడియో చూసిన తర్వాత అంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఆయన భార్య రమ్యతో విడాకుల వ్యవహారం ఇంకా కోర్టులో ఉండగా.. నరేష్ పెళ్లి ఎలా చేసుకుంటారనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే, వారి కేసు ఎంత వరకు వచ్చిందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. కోర్టు అంగీకారంతోనే వీరిద్దరూ ఒక్కటయ్యారా? లేదా అవేవీ పట్టించుకోకుండానే పెళ్లి చేసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.
Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023
ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముళ్ళు
ఏడు అడుగులు 🙏
మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
- మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g
నరేష్, పవిత్ర తమ పెళ్లి గురించి ప్రకటించిన రోజునే రమ్యా మీడియాతో మాట్లాడింది. వారి పెళ్లి జరగనివ్వనని తెలిపింది. నరేష్, పవిత్రల లిప్ లాక్‌పై కూడా స్పందించింది. తనకూ, నరేష్ కూ విడాకులు అయిపోయాయని, అందుకే నరేష్, పవిత్రను పెళ్లి చేసుకోవడానికి సిద్దమైపోయాడు అంటూ వార్తలు వస్తున్నాయని, అందులో ఏ మాత్రం నిజం లేదని ఆమె వెల్లడించింది. తమ విడాకుల వ్యవహారం కోర్టులో నడుస్తోందని చెప్పంది. పవిత్ర తన ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడు తన చేత్తో అన్నం పెట్టానని, ఇప్పుడు అన్న పెట్టిన చేతికే సున్నం రాస్తోందని మండిపడింది. అయితే, ఇదంతా రమ్య రెండు నెలల కిందట చెప్పిన మాటలు. ప్రస్తుతం ఈ కేసు ఎంతవరకు వచ్చిందనేది.. రమ్య స్పందిస్తేనే తెలుస్తుంది.
నరేష్ అశ్లీల వీడియోలు కూడా చూస్తాడని, దానికి తమ కొడుకే సాక్ష్యం అని తెలిపింది. నరేష్ వల్ల తమ కుమారుడు మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని వాపోయింది. తండ్రి అనే బాధ్యత కూడా లేకుండా నరేష్ దారుణంగా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే నరేష్, పవిత్రల పెళ్లి వార్తల గురించి తానేమీ కంగారు పడటంలేదని, కానీ ఇలాంటివన్నీ చూసి ఏ భార్య అయినా ఎలా తట్టుకోగలదని అప్పట్లో ప్రశ్నించింది. నరేష్ తనను వదిలించుకోవడానికి ఎన్నో దారుణాలకు ఒడిగట్టాడని, అందుకే ఏదిఏమైనా నరేష్ కు మాత్రం తాను విడాకులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది.
గతంలో కూడా నరేష్ పవిత్ర మైసూర్ హోటల్ లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది రమ్య. అప్పుడు కూడా వారిద్దరి పై పోలీసులకు ఫిర్యాదు చేసి రచ్చ చేసింది. తర్వాత కూడా ఇదే వ్యవహారంపై ఒకటిరెండు సార్లు వార్తల్లో నిలిచింది. రమ్య రఘుపతి ఏపీ కాంగ్రెస్ నాయకుడు రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె. 2010లో నరేష్ ఆమెను మూడో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఓ బాబు కూడా ఉన్నాడు. మరి, నరేష్, పవిత్రల పెళ్లి వీడియో చూసిన తర్వాత రమ్య ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read : గుండెల్లో దేశాన్ని నింపుకొని, భారతీయుడిగా ఆస్కార్స్ రెడ్ కార్పెట్ మీద నడుస్తా - ఎన్టీఆర్
Kajal Aggarwal: బాలయ్య సరసన కాజల్ - రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్!
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్
Nikhil Siddhartha: నిఖిల్ కు ఐకానిక్ గోల్డ్ అవార్డు, ‘కార్తికేయ 2‘లో నటనకు గాను ప్రతిష్టాత్మక పురస్కారం
Ravanasura – Sushanth: సుశాంత్‌కు ‘రావణాసుర’ టీమ్ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్, విలన్ పాత్రలో అదుర్స్ అనిపించాడుగా!
Aishwaryaa Rajinikanth: రజనీకాంత్ కుమార్తె ఇంట్లో భారీ చోరీ, పోలీసులకు ఫిర్యాదు
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !
Suryakumar Yadav: టీ20ల్లో టాప్ - వన్డేల్లో ఫ్లాప్ - సూర్యకుమార్ షో ఎక్కడ?