Deepika Padukone: సేల్స్ పర్సన్‌గా మారిన దీపికా పదుకొనె - సొంత బ్రాండ్ కోసం బేబీ బంప్‌తో ప్రమోషన్
Deepika Padukone: మొదటిసారి బేబీ బంప్‌తో ఒక మాల్‌లో సేల్స్ పర్సన్‌గా కనిపించింది దీపికా పదుకొనె. దీంతో యెల్లో ఫ్రాక్‌లో అందంగా మెరిసిపోతున్న ఈ భామ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Deepika Padukone As Sales Person: ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన విషయాల్లో దీపికా పదుకొనె ప్రెగ్నెన్సీ కూడా ఒకటి. ప్రెగ్నెన్సీ తర్వాత దీపికా పలు కార్యక్రమాల్లో పాల్గొంది. కానీ తాజాగా తన సేల్స్ పర్సన్‌గా మారి తన సొంత స్కిన్ కేర్ బ్రాండ్‌కు ప్రమోషన్ చేస్తున్న వీడియోలో తన బేబీ బంప్ మొదటిసారిగా స్పష్టంగా కనిపించింది. ఒకవైపు సినిమా, మరోవైపు బిజినెస్‌ను మ్యానేజ్ చేస్తూ సక్సెస్ సాధిస్తున్న వారిలో దీపికా కూడా ఒకరు. తాజాగా స్కిన్ కేర్ బ్రాండ్.. ఆన్‌లైన్ నుండి స్టోర్ వరకు రావడంతో దానికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను షేర్ చేసింది. అంతే కాకుండా ఈ ప్రొడక్ట్స్‌ను అమ్మడం కోసం తానే స్వయంగా సేల్స్ పర్సన్‌గా మారింది.
ఆన్‌లైన్ నుండి ఆఫ్‌లైన్‌కు..
‘82°E’ అనేది దీపికా పదుకొనె ప్రారంభించిన సొంత స్కిన్ కేర్ బ్రాండ్. ఇప్పటివరకు ఈ ప్రొడక్ట్స్ కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉండేవి. మొదటిసారి టీరా అనే స్టోర్‌లో ‘82 ఈస్ట్’ ప్రొడక్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ సంతోషంలో తను ఒక స్పెషల్ వీడియో షేర్ చేసింది. ‘‘ఇప్పటినుండి 82 ఈస్ట్.. ఆన్‌లైన్‌లో మాత్రమే కాకుండా ఆఫ్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. మా ప్రొడక్ట్స్ మొత్తాన్ని చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. మా బ్రాండ్ పేరును ఒక స్టోర్‌లో చూడడం మాకు చాలా పెద్ద విషయం. కానీ ఫైనల్‌గా దీనిని ఒక స్టోర్‌లో చూడడం.. దానిని టచ్ చేయడం, ఫీల్ అవ్వడం, ఎన్నో అంతర్జాతీయ బ్రాండ్స్ మధ్య చూడడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇది నిజంగా జరుగుతుందా అనిపిస్తుంది. గర్వంగా అనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చింది దీపికా. స్కిన్ కేర్ అనేది తనకు సెల్ఫ్ లవ్‌లో ఒక భాగమని బయటపెట్టింది.
View this post on Instagram
సేల్స్ పర్సన్..
టీరా స్టోర్‌లో తన బ్రాండ్ అయిన ‘82°E’ మొదటిసారి అందుబాటులోకి రాగా.. తానే స్వయంగా సేల్స్ పర్సన్‌గా కూడా మారింది. ఈ వీడియోను తను స్వయంగా షేర్ చేయకపోయినా.. సేల్స్ పర్సన్‌గా దీపికాను చూసిన తన ఫ్యాన్స్.. వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో దీపికా.. మరో వ్యక్తితో మాట్లాడుతూ కనిపిస్తుంది. ‘‘నేను నిజంగానే సేల్స్ పర్సన్ అయిపోవాలి’’ అని కౌంటర్ దగ్గర నిలబడిన దీపికా చెప్పింది. తన దగ్గరకు వచ్చిన కస్టమర్‌తో ‘‘మొదటిసారి నేను క్రెడిట్ కార్డ్‌ను తీసుకుంటున్నాను’’ అనగానే.. అవతలి వ్యక్తి క్యాష్ ఇస్తానన్నారు. దీంతో దీపికా నవ్వింది. ఈ వీడియో మొత్తం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. యెల్లో కలర్ ఫ్రాక్‌లో బేబీ బంప్‌తో దీపికా అందరినీ మరోసారి ఫిదా చేసేసింది.
View this post on Instagram
Also Read: దీపికా పదుకొనెపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం - కారణం ఇదేనట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

