
AR Rahman's bassist Mohini Dey : రెహమాన్ తండ్రితో సమానం.. ఎఫైర్ రూమర్లపై ఫస్ట్ టైమ్ ఘాటుగా స్పందించిన మోహినీ డే
AR Rahman's bassist Mohini Dey : రెహమాన్ తనకు తండ్రితో సమానమని.. అలాంటి వారితో ఎఫైర్ రూమర్లు చేయడం సరికాదంటూ ఫస్ట్ టైమ్ ఘాటుగా స్పందించిన మోహినీ డే.

Mohini Dey on Rumours : లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ రీసెంట్ గా తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. అయితే ఆయన తన భార్యతో బంధానికి గుడ్ బై చెప్పారన్న వార్తలు వచ్చిన గంటల వ్యవధిలోనే... ఏఆర్ రెహమాన్ అసిస్టెంట్ మోహిని డే తన భర్తకు విడాకులు ఇచ్చినట్టుగా ప్రకటించడం సంచలనంగా మారింది. దీంతో ఒక్కసారిగా ఏఆర్ రెహమాన్, మోహిని డే మధ్య ఎఫైర్ నడుస్తుందని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఆ వార్తలపై మోహిని డే తాజాగా స్పందించింది.
ఆస్కార్ అవార్డు గ్రహీత, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తన భార్య సైరాబానుతో 29 సంవత్సరాల వైవాహిక బంధానికి రీసెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ, తమ ప్రైవసీకి గౌరవం ఇవ్వాలని కోరారు. అయితే ఏఆర్ రెహమాన్ అసిస్టెంట్ మోహిని డే మరుసటి రోజే తన భర్త మార్క్ హార్ట్సిచ్ కు విడాకులు ఇచ్చింది. దీంతో వీరిద్దరూ తమ పార్టనర్స్ కు విడాకులు ఇచ్చి, త్వరలోనే ఒక్కటి కాబోతున్నారన్న పుకార్లు షికార్లు చేశాయి. అలాగే ఇద్దరిపై దారుణంగా ట్రోలింగ్ కూడా జరిగింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా మోహిని డే ఏఆర్ రెహమాన్ తో తన లింకప్ గురించి వస్తున్న వార్తలపై స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన నోట్ ను పంచుకుంది.
View this post on Instagram
ఆ పోస్టులో మోహినీ డే "ఏఆర్ రెహమాన్ తో కలిపి నాపై తప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. అవన్నీ నిరాధారమైనవి. ఈ రెండు సంఘటనలను మీడియా అసభ్యకరంగా చిత్రీకరించడం ఒక రకమైన నేరమే. నేను చిన్నప్పటి నుంచే ఏఆర్ రెహమాన్ తో కలిసి అతని సినిమాలు, ఈవెంట్స్ మొదలైన వాటిలో పాల్గొంటున్నాను. దాదాపు 8.5 సంవత్సరాల పాటు ఆయనతో కలిసి పని చేసిన సమయాన్ని గౌరవిస్తాను. ఇలాంటి భావోద్వేగ విషయాల పట్ల ప్రజలకు గౌరవం, సానుభూతి లేకపోవడం అనేది నిరుత్సాహంగా ఉంది. జనాల మానసిక స్థితి చూస్తుంటే బాధగా అనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ ఒక లెజెండ్. ఆయన నాకు తండ్రితో సమానం. నిజానికి నేను ఎవరికీ ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అది నా డైలీ రొటీన్ పై ఎఫెక్ట్ చూపించడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇలాంటి తప్పుడు వాదనలను ఆపండి. అలాగే మా ప్రైవసీకి కూడా గౌరవం ఇవ్వండి" అంటూ పుకార్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ సమాధానం చెప్పింది.
ఇదిలా ఉండగా ఈ రూమర్లపై ఏఆర్ రెహమాన్ మాజీ భార్య సైరా కూడా స్పందించారు. "గత రెండు నెలలుగా నేను శారీరకంగా అస్వస్థతతో ఉన్నాను. ప్రస్తుతం ముంబైలో చికిత్స తీసుకుంటున్నాను. అందుకే నేను ఏఆర్ రెహమాన్ నుంచి బ్రేక్ తీసుకోవాలనుకున్నాను. ఏఆర్ రెహమాన్ ఒక లెజెండ్. అతను ప్రపంచంలోనే అత్యుత్తమమైన వ్యక్తి. దయచేసి ఆయన గురించి చెడుగా ప్రచారం చేయకండి' అంటూ రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
