RC 16 Update: బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
Ram Charan New Look RC 16: బుచ్చిబాబు సినిమా కోసం రామ్ చరణ్ సాలిడ్ మేకోవర్ చేశారు ఆలిమ్ హకీమ్. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ పిక్ ను రిలీజ్ చేశారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం "గేమ్ ఛేంజర్" మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జనవరి 10న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే "గేమ్ ఛేంజర్" సినిమా షూటింగ్ పూర్తికాగా, ప్రమోషనల్ కార్యక్రమాలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. మరో వైపు రామ్ చరణ్ "గేమ్ ఛేంజర్" ప్రమోషన్లు షురూ అయ్యేలోపు, తన నెక్స్ట్ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నారు. తాజాగా ఈ సినిమా కోసం రామ్ చరణ్ మాసివ్ లుక్ లో కనిపించబోతున్నారు అనే అప్డేట్ ని ఇచ్చారు మేకర్స్.
"ఉప్పెన" ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ఇప్పటికే మైసూర్ లో ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. ఇక జాన్వి కపూర్ ఈ వీకెండ్ లో షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మైత్రి మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా "గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ సాలిడ్ మేకోవర్ చేశారు" అంటూ ఓ పిక్ ను షేర్ చేశారు. అందులో "ఇదివరకు ఎన్నడూ చూడని అదిరిపోయే లుక్ లోడింగ్ అవుతోంది" అంటూ అభిమానులను ఊరించారు.
Global Star @AlwaysRamCharan Garu gets a solid makeover by @AalimHakim Ji for #RC16
— Mythri Movie Makers (@MythriOfficial) November 25, 2024
A never seen before massive look loading 💥💥💥#RamCharanRevolts
@NimmaShivanna #JanhviKapoor @BuchiBabuSana @IamJagguBhai @arrahman @RathnaveluDop @artkolla @vriddhicinemas @SukumarWritings… pic.twitter.com/UH1rLHiz8P
ఇక పిక్ చూస్తుంటే చెర్రీ లుక్ సగం మాత్రమే కనిపించేలా తీశారు. ఎదురుగా బుచ్చిబాబుతో పాటు ఆలిమ్ హకీమ్ కూడా చెర్రీని చూస్తూ కనిపించారు. మరి ఆలిమ్ హకీమ్ ఎవరు? అతను సెలబ్రిటీలకు స్టైల్ చేయడానికి ఎంత వసూలు చేస్తాడు? అంటే... ఆయన రెమ్యూనరేషన్ భారీగానే ఉంటుంది. ఆలిమ్ హకీమ్ బాలీవుడ్ తో పాటు సౌత్ స్టార్స్ కి కూడా హెయిర్ స్టైల్స్ చేస్తూ ఉంటారు. ఈ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ కేవలం మూవీ ఆర్టిస్టులకు మాత్రమే కాదు ఎంఎస్ ధోని, కోహ్లీ పంటి ప్రముఖులకు కూడా హెయిర్ స్టైల్ చేస్తారు. అందుకే ఆయన తీసుకొనే ఫీజు కూడా అదే రేంజ్ లో ఉంటుంది.
హెయిర్ స్టైల్ ను బట్టి లక్ష నుంచి వసూలు చేస్తారు ఆలిమ్ హకీమ్. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రణ్‌వీర్ సింగ్, రణ్‌బీర్ కపూర్, షాహిద్ కపూర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని వంటి స్టార్స్ ఆయన రెగ్యులర్ క్లైంట్స్. ఆలిమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా రీసెంట్ గా అదిరిపోయే హెయిర్ స్టైల్ చేశారు. ఇలాంటి సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఇప్పుడు రామ్ చరణ్ కు సరికొత్త లుక్ ఇచ్చారనే వార్త అప్పుడే సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తోంది. మరి ఆ లుక్ ని మేకర్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.