అన్వేషించండి
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
RBI Governor Hospitalised: గవర్నర్ శక్తికాంత దాస్ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆర్‌బీఐ అధికారికంగా ప్రకటించింది.

చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స
Source : twitter
RBI Governor Shaktikanta Das Hospitalised: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ చెన్నైలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే ఆసుపత్రి నుంచి ఇంకా అధికారిక అప్‌డేట్ రాలేదని వార్తా సంస్థ PTI రిపోర్ట్ చేసింది.
అసిడిటీ వల్ల వచ్చిన ఛాతీ నొప్పి కారణంగా గవర్నర్ శక్తికాంత దాస్ అడ్మిట్ అయ్యారని, ప్రస్తుతం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆర్‌బీఐ అధికారి ఒకరు ధృవీకరించారు. గవర్నర్ బాగానే ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందొద్దని చెప్పారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఇంకా చదవండి





















