అన్వేషించండి

Siddharth - Pushpa 2: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే

Pushpa 2 : హీరో సిద్ధార్థ్ తన మనసులో ఉన్నది మాట్లాడేస్తారు. అందుకే కేర్ ఆఫ్ కాంట్రవర్సీ గా ఉంటారు. ‘మిస్ యూ’ చిత్రం ప్రమోషన్స్ సందర్భంగా ‘పుష్ప 2’ చిత్రంపై ఆయన వ్యాఖ్యలు మళ్లీ సెన్సేషనల్ అయ్యాయి.

Siddharth Comments on Allu Arjun Pushpa 2 : ఏ ఫిల్టర్ లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్టాడతారు హీరో సిద్ధార్థ్. చాలా సార్లు కేర్ ఆప్ కాంట్రవర్శీగా మారారు కూడా. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘మిస్ యూ’. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఆషికా రంగనాథ్ హీరోయిన్గా చేస్తుంది. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా.. నిర్వహించిన ప్రెస్ మీట్లో ‘‘పుష్ప 2 డిసెంబర్ లో తెలుగు, తమిళంలో కూడా విడుదల అవుతోంది. ఈ సమయంలో మీ సినిమాను ఎందుకు విడుదల చేస్తున్నారు? అనే ప్రశ్నకు సిద్ధార్థ్ స్పందిస్తూ, ‘‘నేను పాతికేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నా కంట్రోల్ లో లేని విషయాల గురించి నేను మాట్లాడను. రెండో వారంలో కూడా థియేటర్లలో నా సినిమా ఉండాలంటే  ముందు ప్రేక్షకులకు నచ్చాలి. బాగుండాలి. నా సినిమా బాగుంటే థియేటర్ల లోంచి ఎవరూ తీయలేరు. ప్రతి సినిమా పెద్ద సినిమానే . ఆ బడ్జెట్ లు ఆ సినిమా పెద్దదా? చిన్నదా? అనే విషయాన్ని నిర్ణయించకూడదు’’ అన్నారు సిద్ధార్థ్. 

ప్రేమకథలకు చేయకూడదని నిర్ణయించుకున్నా

‘‘ ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమా తర్వాత ప్రేమ కథల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. ఆ సమయంలోని సిద్ధార్థ్ వేరు. ఇప్పడు కనిపిస్తున్న సిద్ధార్థ్ వేరు. చాలా మారాను. నేను చనిపోతే, అరె ఓ మంచి నటుడు లేడే  అని అందరూ బాధపడాలి. అందుకే ప్రేమకథలను ఒప్పుకోలేదు. తర్వాత నిర్మాతగా జోనర్స్ సినిమాలను టచ్ చేశాను. ‘చిన్నా’ సినిమాకు క్రిటికల్ ఎక్లయిమ్స్ వచ్చాయి. కానీ వసూళ్లు తెప్పించడానికి  మానసికంగా చాలా నలిగిపోయాను. ఆ సమయంలోనే దర్శకుడు చెప్పిన కథ నచ్చింది. ప్రపంచంలో ఏ వ్యక్తి తన నచ్చని అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడు. అదే సినిమాలోని కొత్త పాయింట్ . ఈ మూవీ నచ్చితే కొత్త ప్రేమకథల ట్రెండ్ వస్తుంది ’’ అని చెప్పారు సిద్ధార్థ్. 

Also Readటీలో బిస్కెట్లు ముంచడం మంచిదేనా? బాడీలో బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఏం చేయాలి?

నేను తెలంగాణ అల్లుడిని..

కథానాయిక అదితీ రావ్ హైదరీ తో ఆయన వివాహమైన సంగతి తెలిసిందే. తన మ్యారేజ్ లైఫ్ గురించి కూడా షేర్ చేసుకున్నారు. ‘‘అదితి రూపంలో నా జీవితంలోకి ఓ దేవత వచ్చింది. 2024 లో నా జీవితంలో ఏదైనా మంచి విషయం జరిగిందీ అంటే అది అదితీతో వివాహమే. నా లైఫ్ ను పూర్తిగా మార్చేసింది. తన వల్ల నేను తెలంగాణ అల్లుడ్ని అయ్యాను’’ అన్నారాయన. 

అదితీ సినీ కెరీర్

తెలుగు, తమిళ, హిందీ భాషల చిత్రాల్లో, వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకుల దగ్గరైన అదితీ రావ్ హైదరీ అదితీ తల్లిదండ్రులిద్దరూ హైదరాబాద్ సంస్థానానికి చెందిన వారు. 2006 నుంచి పలు హిందీ, తమిళ, మలయాళ చిత్రాలలో నటించడం మొదలుపెట్టారు అదితి.  ‘చెలియా’ అనే చిత్రంలో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. భరతనాట్య కళాకారిణిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన అదితీ రావ్ హైదరీ ‘సమ్మోహనం’, ‘మహా సముద్రం’ చిత్రాల ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ప్రేమ టూ పెళ్లి

‘మహాసముద్రం’ సమయంలోనే జంటగా నటించిన సిద్ధార్థ్, అదితీలు ఆ సినిమా సమయంలో మొదలైన తమ ప్రేమను పెళ్లి వరకూ తీసుకొచ్చారు. ‘హీరామండీ’ అనే వెబ్ సిరీస్ లో కనిపించి, తన నటనతో మెప్పించారు. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ‘గాంధీ టాక్స్ ’ అనే మూకీ సినిమా లోనూ ఆమె నటించారు. ‘లయనెస్’  అనే ఆంగ్ల చిత్రంలోనూ కనిపించారు. ఇక సిద్ధార్థ్ త్వరలో ‘ఇండియన్ 3’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 

Also Readనన్ను లేట్ అనొద్దు, నాది ఆన్ టైమ్... పుష్ప 2 మ్యూజిక్ ఇష్యూస్‌ - నిర్మాతపై దేవి శ్రీ ప్రసాద్ సెటైర్లు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
IPL 2025 SRH VS RR Updates: ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప‌టిష్టం.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా SRH.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
Odela 2 OTT Deal Price: టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
IPL 2025 SRH VS RR Updates: ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ప‌టిష్టం.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
ఫేవ‌రెట్ గా స‌న్ రైజ‌ర్స్, అన్ని విభాగాల్లో ప‌టిష్టంగా SRH.. కెప్టెన్సీకి సంజూ దూర‌మవ‌డంతో బ‌లహీనంగా రాయ‌ల్స్.. మ్యాచ్ కు వ‌ర్షం ముప్పు!!
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
Odela 2 OTT Deal Price: టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
టాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తమన్నా 'ఓదెల 2' ఓటీటీ డీల్... థియేటర్స్ నుంచి రావాల్సింది అంతేనా?
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
IPL 2025 RCB VS KKR Result Update: కోహ్లీ, సాల్ట్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీలు.. కేకేఆర్ ను బోల్తా కొట్టించిన ఆర్సీబీ.. ఫ‌స్ట్ మ్యాచ్ లో పాటిదార్ సేన‌ ఘ‌న విజ‌యం
కోహ్లీ, సాల్ట్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీలు.. కేకేఆర్ ను బోల్తా కొట్టించిన ఆర్సీబీ.. ఫ‌స్ట్ మ్యాచ్ లో పాటిదార్ సేన‌ ఘ‌న విజ‌యం
Online Gaming Websites:357 వెబ్‌సైట్‌లు బ్లాక్‌- 2400 అకౌంట్లు సీజ్‌-రూ.126 కోట్లు ఫ్రీజ్‌- గేమింగ్ సంస్థలకు బిగ్‌షాక్
357 వెబ్‌సైట్‌లు బ్లాక్‌- 2400 అకౌంట్లు సీజ్‌-రూ.126 కోట్లు ఫ్రీజ్‌- గేమింగ్ సంస్థలకు బిగ్‌షాక్
Sushant Singh Rajput Case: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
Embed widget