అన్వేషించండి

Engineering College: ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల అరుదైన ఘనత, ఏకంగా పదేళ్లపాటు అటానమస్‌ హోదా!

గతంలో రెండుసార్లు ఆరేళ్ల చొప్పున స్వయంప్రతిపత్తి ప్రకటించిన యూజీసీ ఈసారి ఏకంగా పదేళ్లపాటు అటానమస్‌ హోదాను దక్కించుకుని.. ఓయూ చరిత్రలోనే మరో మైలురాయిని అధిగమించింది.

ఉస్మానియా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్‌ కళాశాల మరోసారి యూజీసీ పది సంవత్సరాల పాటు స్వయంప్రతిపత్తి (అటానమస్‌) హోదాను సాధించింది. గతంలో రెండుసార్లు ఆరేళ్ల చొప్పున స్వయంప్రతిపత్తి ప్రకటించిన యూజీసీ ఈసారి ఏకంగా పదేళ్లపాటు అటానమస్‌ హోదాను దక్కించుకుని.. ఓయూ చరిత్రలోనే మరో మైలురాయిని అధిగమించింది. ఓయూకు న్యాక్‌ ఏ గుర్తింపు ఉండడం, ఇంజినీరింగ్‌ కళాశాలలోని అన్ని విభాగాలకు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ అక్రిడిటేషన్‌ ఎన్‌బీఏ గుర్తింపు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న యూజీసీ అధికారులు కళాశాలను సందర్శించకుండానే 2022-23 నుంచి 2031-32 వరకు స్వయంప్రతిపత్తిని ప్రకటించినట్లు ఓయూ అధికారులు తెలిపారు.

ఓయూ చరిత్రలోనే మరో మైలురాయిని అధిగమించింది. 1929లో స్థాపించిన ఈ కళాశాలకు గతంలో రెండు సార్లు ఆరేళ్ల చొప్పున అటానమస్‌ హోదా దక్కగా, తాజాగా మూడోసారి పదేళ్ల పాటు అటానమస్‌ గుర్తింపునిస్తూ యూజీసీ ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ హోదాతో కోర్సులు, సిలబస్‌ రూపకల్పన అంశాల్లో కళాశాలకు స్వేచ్ఛ ఉంటుందని, పరిశోధనా ప్రాజెక్టుల్లోనూ ప్రాధాన్యం ఉంటుందని ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ అభిప్రాయపడ్డారు. కళాశాలకు స్వయంప్రతిపత్తి హోదా దక్కడం పట్ల ఓయూ ఉపకులపతి దండెబోయిన రవీందర్‌యాదవ్‌, రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణలు ఆనందం వ్యక్తం చేస్తూ ఇటీవల ఇంజనీరింగ్‌ కాలేజీలో మౌలిక వసతుల కల్పనకు పనులు ప్రారంభించడంతోపాటు ఆధునిక కోర్సులు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.

ALSO READ:

30 కళాశాలల్లోనే 35 శాతం ఇంజినీరింగ్‌ సీట్లు, హైదరాబాద్ పరిసర కాలేజీలదే హవా!
తెలంగాణలోని మొత్తం ఇంజినీరింగ్ సీట్లలో 35 శాతం 30 కళాశాలల్లోనే ఉన్నాయి. అది కూడా హైదరాబాద్ పరిసరాల్లోని ఇంజినీరింగ్ కళాశాలల్లోనే ఉండటం విశేషం. రాష్ట్రంలో ఒక్కో ఇంజినీరింగ్ కాలేజీలో వెయ్యికి పైగా సీట్లున్న కళాశాలల సంఖ్య 30కి చేరింది. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా మరో 10 కళాశాలలు 1000 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో భారత్, సీవీఆర్, గీతాంజలి, ఏస్ తదితర పలు కళాశాలలున్నాయి. రాష్ట్రంలో కన్వీనర్, యాజమాన్య కోటా కలిపి మొత్తం 176 కళాశాలల్లో 1,07,039 సీట్లు ఉండగా... ఈ 30 ప్రైవేట్ కళాశాలల్లోనే 37,842 సీట్లున్నాయి. ఇది 35.35 శాతంతో సమానం. ఈ కళాశాలల్లో కేవలం ఒక్కటి మాత్రమే గ్రామీణ జిల్లాల్లో ఉండగా...మిగిలిన 29 హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నాయి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..

ఏపీలో 1.59 లక్షల ఇంజినీరింగ్‌ సీట్లు అందుబాటులో, అత్యధికం ఈ జిల్లాలోనే!
ఏపీలోని ప్రైవేటు, ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు, రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయానికి కలిపి 1,59,024 ఇంజినీరింగ్‌ సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలు మొత్తం 252 ఉన్నాయి. వీటిల్లో 1,49,154 సీట్ల భర్తీకి ఏఐసీటీఈ అనుమతి లభించింది. ఇందులో 52 శాతం కంప్యూటర్‌ సైన్స్ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ) బ్రాంచిలోనే ఉండటం విశేషం. ఇక ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌(ఈసీఈ), ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), సీఎస్‌ఈ సీట్లను కలిపితే 77.02 శాతం (1,14,885) సీట్లు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు సంబంధించినవే ఉన్నాయి. మరోవైపు కోర్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచిలైన సివిల్‌, మెకానికల్‌, ఈఈఈలో సీట్లు భారీగా తగ్గిపోయాయి. 
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..

తెలంగాణలో మ‌రో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి
తెలంగాణలో మ‌రో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. కోర్ గ్రూపుల్లో సీట్లు వెన‌క్కి ఇస్తామ‌ని పేర్కొంటూ ఇంజినీరింగ్ కాలేజీలు కంప్యూట‌ర్ కోర్సుల్లో సీట్లకు అనుమ‌తి కోరాయి. దీంతో 6,930 సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి ఇచ్చింది. అలాగే కొత్తగా 7,635 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి ఖరారు చేసింది. ఫ‌లితంగా అద‌న‌పు సీట్లతో ఏటా స‌ర్కారుపై రూ. 27.39 కోట్ల భారం ప‌డ‌నుంది. ఇటీవ‌ల 86,106 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి ఇవ్వగా, తాజాగా అనుమ‌తిచ్చిన వాటితో క‌లిపి రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 1,00,671కి చేరింది.
సీట్ల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Chairman: తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
YS Jagan : ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
Ekta Diwas 2024: ఉగ్రవాద మాస్టార్లూ లగేజ్ సర్దుకొని బయల్దేరండీ- గుజరాత్‌ నుంచి మోదీ వార్నింగ్
ఉగ్రవాద మాస్టార్లూ లగేజ్ సర్దుకొని బయల్దేరండీ- గుజరాత్‌ నుంచి మోదీ వార్నింగ్
Google News: గూగుల్‌తో మంత్రి నారా లోకేష్ చర్చలు- విశాఖలో డాటా సెంటర్ ఏర్పాటుకు రిక్వస్ట్
గూగుల్‌తో మంత్రి నారా లోకేష్ చర్చలు- విశాఖలో డాటా సెంటర్ ఏర్పాటుకు రిక్వస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఎన్నికల ప్రచారంలో చెత్త ట్రక్ తోలిన ట్రంప్టీటీడీ ఛైర్మన్‌‌గా బీఆర్ నాయుడు, అధికారిక ప్రకటనబిర్యానీ తెప్పించాలన్న బోరుగడ్డ - జడ్జి స్ట్రాంగ్ కౌంటర్‌తో సైలెంట్SS Rajamouli Lion Update | వైల్డ్ సఫారీ ఫోటోలతో హింట్స్ ఇస్తున్న రాజమౌళి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Chairman: తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
తిరుమలలో పని చేసే వాళ్లంతా హిందువులై ఉండాలి- టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు
YS Jagan : ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
ఆస్తుల వివాదానికి ముగింపు ఏమిటి ? జగన్‌కు సరైన సలహాలిచ్చేవారు ఎవరు ?
Ekta Diwas 2024: ఉగ్రవాద మాస్టార్లూ లగేజ్ సర్దుకొని బయల్దేరండీ- గుజరాత్‌ నుంచి మోదీ వార్నింగ్
ఉగ్రవాద మాస్టార్లూ లగేజ్ సర్దుకొని బయల్దేరండీ- గుజరాత్‌ నుంచి మోదీ వార్నింగ్
Google News: గూగుల్‌తో మంత్రి నారా లోకేష్ చర్చలు- విశాఖలో డాటా సెంటర్ ఏర్పాటుకు రిక్వస్ట్
గూగుల్‌తో మంత్రి నారా లోకేష్ చర్చలు- విశాఖలో డాటా సెంటర్ ఏర్పాటుకు రిక్వస్ట్
Amaran Movie Review - అమరన్ రివ్యూ: శివకార్తికేయన్ కెరీర్ బెస్ట్ సినిమా అనొచ్చా? - మరి సాయి పల్లవి నటన?
అమరన్ రివ్యూ: శివకార్తికేయన్ కెరీర్ బెస్ట్ సినిమా అనొచ్చా? - మరి సాయి పల్లవి నటన?
Viral Video:  అమెరికా అధ్యక్ష భవన్‌ వైట్‌ హౌస్‌లో
అమెరికా అధ్యక్ష భవన్‌ వైట్‌ హౌస్‌లో "ఓం జై జగదీష హరే" పాట- సోషల్ మీడియాలో వీడియో వైరల్
Diwali Wishes: దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ప్రమఖులు- ఆరోగ్యం, సంపన్నమైన జీవితం ఇవ్వాలని ఆకాంక్ష
దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ప్రమఖులు- ఆరోగ్యం, సంపన్నమైన జీవితం ఇవ్వాలని ఆకాంక్ష
Revanth Chit Chat Politics : చిట్‌చాట్‌లతో బీఆర్ఎస్ నేతల్ని రెచ్చగొడుతన్న రేవంత్ రెడ్డి - ట్రాప్‌లోకి లాగుతున్నారా ?
చిట్‌చాట్‌లతో బీఆర్ఎస్ నేతల్ని రెచ్చగొడుతన్న రేవంత్ రెడ్డి - ట్రాప్‌లోకి లాగుతున్నారా ?
Embed widget