అన్వేషించండి

AP Engineering Seats: ఏపీలో 1.59 లక్షల ఇంజినీరింగ్‌ సీట్లు అందుబాటులో, అత్యధికం ఈ జిల్లాలోనే!

ఏపీలోని ప్రైవేటు, ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు, రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయానికి కలిపి 1,59,024 ఇంజినీరింగ్‌ సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది.

➦ ప్రైవేటులో 1.44లక్షల సీట్లు, ప్రభుత్వ కాలేజీల్లో 5,130 సీట్లు 

➦ కొత్తగా మూడు కొత్త కాలేజీల ఏర్పాటుకు ఏఐసీటీఈ అనుమతి

➦ సాఫ్ట్‌వేర్‌ సంబంధిత బ్రాంచిల్లోనే 77% సీట్లు అందుబాటులో

ఏపీలోని ప్రైవేటు, ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలు, రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయానికి కలిపి 1,59,024 ఇంజినీరింగ్‌ సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలు మొత్తం 252 ఉన్నాయి. వీటిల్లో 1,49,154 సీట్ల భర్తీకి ఏఐసీటీఈ అనుమతి లభించింది. ఇందులో 52 శాతం కంప్యూటర్‌ సైన్స్ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ) బ్రాంచిలోనే ఉండటం విశేషం. ఇక ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌(ఈసీఈ), ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), సీఎస్‌ఈ సీట్లను కలిపితే 77.02 శాతం (1,14,885) సీట్లు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు సంబంధించినవే ఉన్నాయి. మరోవైపు కోర్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచిలైన సివిల్‌, మెకానికల్‌, ఈఈఈలో సీట్లు భారీగా తగ్గిపోయాయి. 

మూడు కొత్త కాలేజీలు..
ఈ ఏడాది కొత్తగా మూడు కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతులు మంజూరు చేసింది. వీటిల్లో రాయచోటిలోని భాస్కర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, చిత్తూరు జిల్లాలో విజయం, నెల్లూరులో శ్రీవేంకటేశ్వర కళాశాలల్లో ఒక్కోచోట 360 చొప్పున మొత్తం 1,080 సీట్లకు ఆమోదం తెలిపింది. గతేడాదితో పోల్చితే అన్నింటిలో కలిపి 7,637 ఇంజినీరింగ్‌ సీట్లు పెరిగాయి. వీటితోపాటు అమృత, గీతం, కేఎల్‌యూ, విజ్ఞాన్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలకు 8,430 సీట్లకు అనుమతి లభించింది. ఏఐసీటీఈ అనుమతి పొందిన సీట్లు, కళాశాలలకు రాష్ట్ర విశ్వవిద్యాలయాల నుంచి ఆమోదం పొందాలి. డీమ్డ్‌ వర్సిటీల్లో సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకుంటాయి. ప్రైవేటులోని మొత్తం 1,44,024 సీట్లలో 70 శాతం కన్వీనర్‌ కోటాలో భర్తీచేస్తారు. 

ప్రభుత్వ కాలేజీల్లో ఎమర్జింగ్‌ కోర్సులు..
ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలలు ఈ ఏడాది ఎమర్జింగ్‌ కోర్సులను ప్రవేశపెట్టాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో ఐటీ, రాయలసీమ వర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో కృత్రిమ మేథ (ఏఐ) కోర్సులను ప్రారంభించాయి. రాయలసీమ వర్సిటీలో సీఎస్‌ఈ సీట్లు 60 నుంచి 120కి పెరిగాయి. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌, ఫైన్‌ ఆర్ట్స్‌ వర్సిటీలో సదుపాయాలు, సేవల ప్రణాళిక, డిజైన్‌, ప్లానింగ్‌లో డిజిటల్‌ టెక్నిక్స్‌, గేమ్‌ డిజైన్‌ టెక్నాలజీ, కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌ కోర్సులను ప్రవేశపెట్టింది.

మాతృభాషలో యంత్ర విద్య..
మాతృభాషలో ఇంజినీరింగ్‌ కోర్సులను రెండు కళాశాలలు ఆహ్వానించాయి. విజయవాడ సమీపంలోని ఎన్‌ఆర్‌ఐ, ఒంగోలుకు చెందిన పెస్‌ కళాశాలలు తెలుగులో సీఎస్‌ఈ కోర్సుకు అనుమతి పొందాయి. ఒక్కో కళాశాలకు సీఎస్‌ఈలో 60 సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం లభించింది

గుంటూరులో అత్యధికం..
రాష్ట్రంలో అత్యధికంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 22,800 సీట్లు ఉండగా.. రెండో స్థానంలో 19,215 సీట్లతో ఉమ్మడి కృష్ణాజిల్లా నిలిచింది. కళాశాలలూ ఈ రెండు జిల్లాలోనే ఎక్కువ. మూడు, నాలుగో స్థానాల్లో చిత్తూరు(16,890), విశాఖపట్నం(14,505) ఉన్నాయి. నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్క ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాల లేదు. 

జిల్లాలు, బ్రాంచ్‌ల వారీగా ఇంజినీరింగ్ సీట్ల వివరాలు పరిశీలిస్తే...

AP Engineering Seats: ఏపీలో 1.59 లక్షల ఇంజినీరింగ్‌ సీట్లు అందుబాటులో, అత్యధికం ఈ జిల్లాలోనే!

ALSO READ:

తెలంగాణలో మ‌రో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి
తెలంగాణలో మ‌రో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. కోర్ గ్రూపుల్లో సీట్లు వెన‌క్కి ఇస్తామ‌ని పేర్కొంటూ ఇంజినీరింగ్ కాలేజీలు కంప్యూట‌ర్ కోర్సుల్లో సీట్లకు అనుమ‌తి కోరాయి. దీంతో 6,930 సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి ఇచ్చింది. అలాగే కొత్తగా 7,635 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి ఖరారు చేసింది. ఫ‌లితంగా అద‌న‌పు సీట్లతో ఏటా స‌ర్కారుపై రూ. 27.39 కోట్ల భారం ప‌డ‌నుంది. ఇటీవ‌ల 86,106 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమ‌తి ఇవ్వగా, తాజాగా అనుమ‌తిచ్చిన వాటితో క‌లిపి రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 1,00,671కి చేరింది.
సీట్ల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Allu Arjun Police Notices Again | సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కు షాక్ | ABP DesamShyam Benegal Passed Away | ఏడుసార్లు జాతీయ అవార్డు పొందిన దర్శకుడి అస్తమయం | ABP DesamMinister Seethakka on Pushpa 2 | పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు | ABP DesamSchool Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget