అన్వేషించండి

Pakistan vs India Military Power: పాకిస్తాన్‌, భారత్‌లో ఎవరి వద్ద ఎక్కువ సైనిక శక ఉంది? గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఏం చెబుతోంది?

Pakistan and India military power:భారత-పాకిస్తాన్ సైనిక బలాలపై పాకిస్తాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం ఆర్మీ పవర్ ఎలా ఉందో చూద్దాం.

India vs Pakistan Army: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇస్లామాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో భారతదేశం,  భారత సైన్యంపై నోరుపారేసుకున్నారు.  జనరల్ మునీర్ భారతదేశం బలాన్ని ప్రస్తావిస్తూ, '13 లక్షల మంది భారత సైన్యం తమ బలంతో పాకిస్తాన్ ఆర్మీని భయపెట్టలేకపోయింది అలాంటిది పిడికెడు ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆర్మీని ఓడించగలరా?' అని అన్నారు. ఈ ప్రకటన తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక శక్తి పోలిక మళ్ళీ చర్చనీయాంశంగా మారింది.

ఎవరి బలం ఎంత?
గ్లోబల్ ఫైర్‌పవర్ (GFP) 2025 నివేదిక ప్రకారం, భారతదేశం ప్రపంచంలో నాలుగో అత్యంత బలమైన సైనికశక్తి ఉన్న దేశం. అదే సమయంలో పాకిస్తాన్ గత సంవత్సరం 2024లో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇప్పుడు  ఇది 12వ స్థానానికి పడిపోయింది. గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ (GFP) ప్రతి సంవత్సరం దేశాల సాంప్రదాయ యుద్ధ సామర్థ్యాలను అంచనా వేస్తుంది. ఈ సూచికలో జనాభా, రక్షణ బడ్జెట్, సైనిక వనరులు, కొనుగోలు శక్తి,  వ్యూహాత్మక స్థితి వంటి 60 కంటే ఎక్కువ అంశాలను పరిగణనలోకి తీసుకొని సైనిక శక్తిని గణిస్తుంది. 

భారతదేశం మొత్తం జనాభా దాదాపు 1.4 బిలియన్లు, ఇది ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. అయితే పాకిస్తాన్ జనాభా దాదాపు 240 మిలియన్లు, ఇది ఐదో స్థానంలో ఉంది. భారతదేశం 5 మిలియన్లకుపైగా సైనిక శక్తిని కలిగి ఉంది. పాకిస్తాన్ దాదాపు 1 మిలియన్ మందినే కలిగి ఉంది. భారత్‌ యాక్టివ్ మిలిటరీ స్ట్రెంత్ దాదాపు 1.4 మిలియన్లు. ఇది పాకిస్తాన్ 650,000 యాక్టివ్ సైనికుల కంటే చాలా ఎక్కువ. అంతేకాకుండా భారతదేశం రిజర్వ్ ఆర్మీ , పారా మిలిటరీ దళాల బలం అధికం.

రక్షణ బడ్జెట్ పోలిక
2023-24 కేంద్ర బడ్జెట్‌లో భారతదేశం తన రక్షణ ఏర్పాట్ల కోసం 5.94 ట్రిలియన్ (సుమారు $73.8 బిలియన్) కేటాయించింది. మరోవైపు పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ కేవలం $6.34 బిలియన్ మాత్రమే. అంటే భారత్‌ సైనిక బడ్జెట్ పాకిస్తాన్ కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉందని స్పష్టమవుతుంది. దీని ద్వారా భారతదేశం అధునాతన ఆయుధాలు, సైనిక సాంకేతికత, భద్రతా మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడి పెడుతుంది.

నింగిలో కూడా భారత్‌ ఆధిపత్యం

భారతదేశం మొత్తం 2,296 విమానాలను కలిగి ఉంది. ఇది ప్రపంచ స్థాయిలో వైమానిక శక్తిలో నాలుగో స్థానంలో ఉంది.అయితే పాకిస్తాన్ 1,434 విమానాలను కలిగి ఉంది. భారత వైమానిక దళంలో 606 ఫైటర్ విమానాలు, 31 స్క్వాడ్రన్లు ఉన్నాయి. ఇందులో SU-30MKI, రాఫెల్, తేజస్ వంటి ఆధునిక విమానాలు ఉన్నాయి. పాకిస్తాన్ కేవలం 387 ఫైటర్ విమానాలను కలిగి ఉంది. వీటిలో ఎక్కువ భాగం పాత అమెరికన్, చైనీస్ సాంకేతికతతో ఉన్నాయి.

భూ సైన్యం ఆర్టిలరీ
భారతదేశం 4,614 ట్యాంకులను కలిగి ఉంది. పాకిస్తాన్ 3,742 ట్యాంకులను కలిగి ఉంది. బుల్లెట్‌ప్రూఫ్ వాహనాల విషయానికి వస్తే భారతదేశం దాదాపు 1.51 లక్షల బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు కలిగి ఉంది. ఇది పాకిస్తాన్ దాదాపు 50,000 వాహనాల కంటే మూడు రెట్లు ఎక్కువ. భారతదేశం కంటే పాకిస్తాన్ ఎక్కువ ఆటోమేటిక్ తుపాకులను కలిగి ఉంది. కానీ భారతదేశం మరింత ఆధునిక ట్యాంకులు, మెరుగైన సైనిక వాహనాలను కలిగి ఉంది. 

నౌకాదళం: బ్లూ వాటర్ vs గ్రీన్ వాటర్
భారతదేశం మొత్తం 294 నౌకాదళ ప్లాట్‌ఫామ్‌లను కలిగి ఉంది. పాకిస్తాన్ 114 కలిగి ఉంది. భారతదేశం రెండు విమాన నౌకలను (INS విక్రాంత్, INS విక్రమాదిత్య) కలిగి ఉంది. పాకిస్తాన్ వద్ద ఒక్క విమాన నౌక కూడ లేదు. ఈ కారణంగా భారత నౌకాదళాన్ని బ్లూ-వాటర్ నౌకాదళం వర్గంలో ఉంచుతారు. అయితే పాకిస్తాన్ నౌకాదళాన్ని గ్రీన్-వాటర్ నౌకాదళం అంటారు. ఇలా ఏ విభాగంలో చూసుకున్నా సరే పాకిస్థాన్ కంటే భారత్ మెరుగైన స్థితిలో ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

NDA Convenor Chandrababu?: ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
ఎన్డీయే కూటమికి కొత్త కన్వీనర్ ఏర్పాటుకు మోదీ గ్రీన్ సిగ్నల్! రేసులో చంద్రబాబు!
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget