Jr NTR: ఎన్టీఆర్ బరువు తగ్గడానికి ఓజెంపిక్ ట్రీట్మెంట్ తీసుకున్నారనే వార్తల్లో నిజమెంత? అసలు ఓజెంపిక్ అంటే ఏమిటో తెలుసా?
Jr NTR : తాజాగా వైరల్ అవుతున్న ఎన్టీఆర్ పిక్ చూశాక, ఆయన బరువు తగ్గడానికి ఓజెంపిక్ ఉపయోగించారని వస్తున్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది? ఇంతకీ ఓజెంపిక్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? అనే వివరాలను తెలుసుకుందాం.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇటీవల దుబాయ్ వెకేషన్ లో కనిపించిన ఫోటోలు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. అయితే తాజా లుక్ లో ఎన్టీఆర్ పూర్తిగా సరికొత్త అవతారంలో కనిపించడం గాసిప్స్ కు దారి తీసింది. నిన్న మొన్నటిదాకా కాస్త బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్ సడన్ గా సన్నబడడం ఆయన అభిమానులను ఆందోళనలో పడేసింది. మరోవైపు ఎన్టీఆర్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఓజెంపిక్ అనే ట్రీట్మెంట్ తీసుకున్నారని ఊహాగానలు వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ ట్రాన్స్ఫర్మేషన్ వెనుక ఉన్న కథ ఇదే
ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'డ్రాగన్' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఎన్టీఆర్ ఈ మూవీ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దుబాయ్ వెకేషన్ లో కనిపించారు ఎన్టీఆర్. అయితే ఆ టైంలో ఎన్టీఆర్ పూర్తిగా సన్నబడిపోయి కనిపించడంతో ఆయన అనారోగ్యం బారిన పడ్డారని ఓవైపు, మరోవైపు ఓజెంపిక్ అనే ట్రీట్మెంట్ చేయించుకున్నారని రూమర్స్ వినిపించాయి.
తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. అంతేకాదు ఆయన ఇంటెన్స్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఎలాంటి ఓజెంపిక్ ట్రీట్మెంట్ తీసుకోలేదని తారక్ టీం వెల్లడించింది. అయితే ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీ కోసం కొత్త డైట్ ఫాలో అవుతున్నాడని, ఫిబ్రవరి నుంచి ఆయన ఫాలో అవుతున్న ఈ డైట్ ఫలితమే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అని సమాచారం.
ఓజెంపిక్ అంటే ఏంటి?
ఓజెంపిక్ అనేది టైప్ 2 డయాబెటిస్ లో ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ కోసం ఉపయోగించే ప్రైమరీ యాంటీ డయాబెటిక్. దీర్ఘకాలంలో బరువు పెరగకుండా మేనేజ్ చేయడానికి, యాంటీ ఒబెసిటీ మెడికేషన్ గా కూడా ఇది పని చేస్తుంది. వారానికి ఒకసారి తీసుకుంటే జీర్ణ క్రియను నిమ్మదింపజేసి, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. కానీ ఎన్టీఆర్ ఈ మెడిటేషన్ ఏది తీసుకోలేదని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి 'వార్ 2' చివరి దశ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ హై - వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే ఏప్రిల్ 22 నుంచి 'డ్రాగన్' షూటింగ్లో అడుగు పెట్టబోతున్నారు తారక్. ఇక ఇప్పటిదాకా ఈ మూవీ టైటిల్ ని మేకర్స్ అనౌన్స్ చేయలేదు. దీంతో నందమూరి అభిమానులు అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ 2026 జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ గత చిత్రం 'దేవర' సూపర్ హిట్ కావడంతో ఆయన నెక్స్ట్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే 'దేవర' జపాన్ రిలీజ్ ప్రమోషన్స్ పూర్తి చేసిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' ప్రే రిలీజ్ ఈవెంట్ కు కూడా హాజరయ్యారు. అనంతరం దుబాయ్ వెకేషన్ కు వెళ్లిపోయారు.





















