అన్వేషించండి

Telangana: కనీసం నిలబడలేకపోతున్నాడని చెప్పారు, పోలీసులపై ఎదురుకాల్పులు ఎలా జరుపుతాడు, నా భర్తను పోలీసులే హత్య చేశారన్న చెన్నకేశవులు భార్య రేణుక

పోలీసులే తన భర్తను హత్య చేశారని ఆరోపించింది దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు భార్య రేణుక. త్రిసభ్య కమిషన్ విచారణలో భాగంగా మంగళవారం ఆమె వాంగ్మూలం నమోదు చేశారు.

‘‘నా భర్త చెన్నకేశవులు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. దిశ కేసులో అరెస్టయిన తర్వాత పోలీసులే అనారోగ్య విషయాన్ని మాకు చెప్పారు. నిలబడలేకపోతున్నాడ ని సమాచారం ఇచ్చారు. అలాంటప్పుడు చెన్నకేశవు లు పోలీసులపై ఎదురుకాల్పులుఎలా జరుపుతాడు? నా భర్తను పోలీసులే హత్య చేశారు. మా కుటుంబానికి న్యాయం చేయండి’’ అని విచారణ కమిషన్‌ ఎదుట దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు భార్య రేణుక వాపోయింది. త్రిసభ్య కమిషన్‌ విచారణలో భాగంగా మంగళవారం ఆమె వాంగ్మూలం నమోదు చేశారు. ‘దిశ’ హత్య కేసులో తన భర్తను పోలీసులు పట్టుకెళ్లిన తర్వాత జైలులో పలుమార్లు కిందపడిపోయాడన్నారు. ఎందుకు ఇలా పడిపోతున్నాడని అడిగితే కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని చెప్పానని.. అందుకు సంబంధించిన ఆసుపత్రి రికార్డులు పంపించానని వెల్లడించింది. అలా సరిగా నడవడమే రాని తన భర్త ఎన్‌కౌంటర్‌ సమయంలో పోలీసులపై ఎలా తిరగబడతారని కమిషన్‌ ముందు నిలదీసింది.

Also Read : చిన్నారిపై హత్యాచార నిందితుడిపై భారీ రివార్డ్.. పట్టిస్తే రూ.10 లక్షలు..

పోలీస్‌ తరఫు న్యాయవాదులు ఆమెను క్రాస్‌ ఎగ్జామిన్‌ చేస్తూ.. ‘దిశ’ అత్యాచారం సమయంలో ముగ్గురు యువకులు నడుస్తూ వెళ్తున్న సీసీ ఫుటేజీని చూపించారు. అందులో చెన్నకేశవులును గుర్తుపట్టగలరా..? అని ప్రశ్నిస్తే ఆమె గుర్తు పట్టింది. ఎన్‌కౌంటర్‌ అనంతరం ఆమె ప్రసవం జరిగినప్పుడు ఆసుపత్రి రికార్డుల్లో వయసు ఎక్కువగా ఎందుకు నమోదు చేయించారని ప్రశ్నించారు. ఆ సమయంలో వయసు తక్కువ అని చెబితే ఇబ్బంది వస్తుందనే అలా నమోదు చేయించానని ఆమె వాంగ్మూలమిచ్చారు. పాఠశాలలో విద్యార్థుల వయసును ఎలా నమోదు చేస్తారని చెన్నకేశవులు చదివిన గుడిగండ్ల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సింహులును స్టేట్‌ కౌన్సిల్‌ సురేందర్‌రావు విచారించారు. చెన్నకేశవులు వయసును ఆయన కుటుంబ సభ్యులు చెప్పినట్లుగానే నమోదు చేశామని నర్సింహులు తెలిపారు. మరో మూడు రోజులపాటు ఈ విడత విచారణ జరగనుంది. ఎన్‌కౌంటర్‌ మృతులు జొల్లు నవీన్‌, శివ కుటుంబసభ్యుల వాంగ్మూలాలతోపాటు వారు చదివిన పాఠశాల ఉపాధ్యాయుల్ని కూడా విచారించనున్నారు.

Also read: జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల.. ఆరుగురు తెలుగు విద్యార్థులకు ఫస్ట్ ర్యాంకు

Also Read: యాపిల్ కొత్త స్మార్ట్ వాచ్ వ‌చ్చేసింది.. అదిరిపోయే హెల్త్ ట్రాకింగ్ ఫీచ‌ర్లు!

Also read: ఐఫోన్ 13 సిరీస్ వ‌చ్చేసింది.. ముందు వెర్ష‌న్ల కంటే త‌క్కువ ధ‌ర‌కే!

Also read: ఈ రోజు ఈ రాశులవారికి ఒత్తిడి తొలగిపోతుంది..వారు ఆనందంగా ఉంటారు, ఏ రాశి వారికి ఎలా ఉందంటే...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 SRH vs DC: 5 వికెట్లతో స్టార్క్ అదుర్స్, హాఫ్ సెంచరీతో ఆదుకున్న అనికేత్ వర్మ - ఢిల్లీ ముందు మోస్తరు టార్గెట్
5 వికెట్లతో స్టార్క్ అదుర్స్, హాఫ్ సెంచరీతో ఆదుకున్న అనికేత్ వర్మ - ఢిల్లీ ముందు మోస్తరు టార్గెట్
CM Revanth Reddy: పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
Money Facts: దేశంలో సగం మంది వద్ద 3.5 లక్షలు కూడా లేవు, ప్రపంచంలో 90 శాతం మందికి జీతం టెన్షన్..!
దేశంలో సగం మంది వద్ద 3.5 లక్షలు కూడా లేవు, ప్రపంచంలో 90 శాతం మందికి జీతం టెన్షన్..!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP DesamHardik Pandya captaincy IPL 2025 | టీమ్ సెలక్షన్ లోనూ పాండ్యా తప్పిదాలు | ABP DesamGT vs MI 197 Target Match Highlights IPL 2025 | మొన్న చెన్నై, నిన్న ముంబై సరిగ్గా అలాగే ఓడిపోయాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 SRH vs DC: 5 వికెట్లతో స్టార్క్ అదుర్స్, హాఫ్ సెంచరీతో ఆదుకున్న అనికేత్ వర్మ - ఢిల్లీ ముందు మోస్తరు టార్గెట్
5 వికెట్లతో స్టార్క్ అదుర్స్, హాఫ్ సెంచరీతో ఆదుకున్న అనికేత్ వర్మ - ఢిల్లీ ముందు మోస్తరు టార్గెట్
CM Revanth Reddy: పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి: ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
Money Facts: దేశంలో సగం మంది వద్ద 3.5 లక్షలు కూడా లేవు, ప్రపంచంలో 90 శాతం మందికి జీతం టెన్షన్..!
దేశంలో సగం మంది వద్ద 3.5 లక్షలు కూడా లేవు, ప్రపంచంలో 90 శాతం మందికి జీతం టెన్షన్..!
CM Chandrababu: ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
ఉగాది నాడు పేదలకు గుడ్‌న్యూస్, కీలక ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం
Hari Hara Veera Mallu: ధర్మం కోసం పోరాడే యోధుడు వచ్చేస్తున్నాడు - 'హరిహర వీరమల్లు' నుంచి పవన్ కల్యాణ్ కొత్త లుక్
ధర్మం కోసం పోరాడే యోధుడు వచ్చేస్తున్నాడు - 'హరిహర వీరమల్లు' నుంచి పవన్ కల్యాణ్ కొత్త లుక్
PM Modi: దీక్షభూమిలో మోదీ పూజలు.. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులకు నివాళులు
దీక్షభూమిలో మోదీ పూజలు.. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకులకు నివాళులు
Spirit Movie: ప్రభాస్ 'స్పిరిట్' మూవీపై అదిరిపోయే అప్ డేట్ - షూటింగ్ అక్కడే ప్రారంభిస్తామన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
ప్రభాస్ 'స్పిరిట్' మూవీపై అదిరిపోయే అప్ డేట్ - షూటింగ్ అక్కడే ప్రారంభిస్తామన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
Embed widget