Mulugu Maoist Encounter: ములుగు జిల్లాలో ఎదురుకాల్పులు... నలుగురు మావోయిస్టుల మృతి
ములుగు జిల్లాలో మంగళవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి.
![Mulugu Maoist Encounter: ములుగు జిల్లాలో ఎదురుకాల్పులు... నలుగురు మావోయిస్టుల మృతి Telangana Chhattisgarh border area Anti Naxal Operations 4 Maoists died one police injured Mulugu Maoist Encounter: ములుగు జిల్లాలో ఎదురుకాల్పులు... నలుగురు మావోయిస్టుల మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/03/f1e420694eed5af469dcbfeda1727cf2_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలంగాణలోని ములుగు జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ములుగు జిల్లా కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్‌కు గాయాలు అయ్యాయి. మావోయిస్టుల కోసం కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతుంది.
Also Read: అదే జరిగితే మిత్రపక్షం ఎంఐఎంకి కేసీఆర్ ద్రోహం చేసినట్లే.. రేవంత్ రెడ్డి
ములుగు జిల్లాలో పోలీసులు, మావోస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పులలో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లోని వెంకటాపురం మండలం కర్రెగుట్ట సమీపంలో ఎదురుకాల్పులు జరిగాయి. తెలంగాణ సాయుధ బలగాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు సమాచారం. మావోయిస్టుల కాల్పుల్లో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. మృతి చెందిన మావోయిస్టుల్లో వెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీ ఇంఛార్జ్ సుధాకర్ ఉన్నట్టు సమాచారం. ఎన్ కౌంటర్ లో గాయపడిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ను మెరుగైన వైద్యం కోసం హనుమకొండకు తరలించారు.
Also Read: చెల్లి శవంతో నాలుగు రోజులుగా ఇంట్లోనే అక్క.. అది కుళ్లడంతో చివరికి..
'సుమారు 40-50 సాయుధ మావోయిస్టులు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతమైన పేరూరు, ఇల్మిడి, ఉసూరు పోలీస్ స్టేషన్ల పరిధిలోని కొండపాకలో పరిధిలో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో బీజాపూర్ జిల్లా నుంచి గ్రేహౌండ్స్ ఫోర్స్, DRG/CRPF బలగాలను ఈ ప్రాంతంలో కూంబింగ్ చేశాయి. బలగాలను గమనించి మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు కూడా కాల్పులు జరపడంతో సీనియర్ మావోయిస్టు నేత సుధాకర్ తో సహా మరో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మంగళవారం ఉదయం 07:00 గంటలకు బీజాపూర్ జిల్లాలోని ఎల్మిడి పోలీస్ స్టేషన్‌లో పరిధిలోని సెమల్దొడి గ్రామం, పేరూర్ పోలీస్ స్టేషన్‌లోని పెనుగోలు గ్రామం సరిహద్దు ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఎన్‌కౌంటర్ తర్వాత సంఘటన స్థలంలో తనిఖీలు చేయగా ఒక మహిళా మావోయిస్టుతో సహా నలుగురి మావోయిస్టుల మృతదేహాలను కనిపించాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో గ్రేహౌండ్స్ జవాన్ గాయపడ్డారు. అతన్ని చికిత్స కోసం హెలికాప్టర్‌లో తరలించి వరంగల్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో పోలీసులు సోదాలు కొనసాగిస్తున్నారు.' అని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఈ ప్రకటన జారీచేసింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)