NTR Death Anniversary: ఎన్టీఆర్ ఆత్మ ఆ అమ్మాయిలోకి వెళ్లి నాతో మాట్లాడింది, 26 ఏళ్ల తర్వాత ఆ సీక్రెట్ చెప్తున్నా.. లక్ష్మీ పార్వతి వ్యాఖ్యలు
ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై అందరి దృష్టి పడింది.
నందమూరి తారక రామారావు 26వ వర్థంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద పలువురు నివాళులు అర్పిస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు ఆయన రెండో భార్య లక్ష్మీ పార్వతి మంగళవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చారు. ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యలపై అందరి దృష్టి పడింది. మంగళవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 26 ఏళ్ల తర్వాత మీకో రహస్యం చెబుతానంటూ మాట్లాడారు.
‘‘ఎన్టీఆర్ గారు చనిపోగానే ఆయన ఆత్మతో మాట్లాడదామని నేనే ప్రయత్నం చేశాను. మొదటిసారిగా ఆ విషయం మీకు చెబుతున్నాను. జీవితా రాజశేఖర్ నన్ను మద్రాసు తీసుకెళ్లి కుముద్విని అనే 16 ఏళ్ల అమ్మాయితో కలిపించారు. ఆ అమ్మాయి ఎన్నో ఆత్మలను తనలో ప్రవేశింపజేసుకొని వారితో అన్ని మాట్లాడిస్తూ ఉంటుంది. అలా చాలా మంది ఆ అమ్మాయికి దగ్గరికి వెళ్లేవారు. అలా నా భర్త ఎన్టీఆర్ కూడా నాకు ఏం చెప్పారో తెలుసుకుందామని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లా. నేను వెళ్లగానే ఆ అమ్మాయి ఎన్టీఆర్‌లా ప్రవర్తించింది. ఆ హావభావాలు, ఒంటితీరు, కూర్చొనే తీరు మొత్తం ఎన్టీఆర్‌లా వ్యవహరించింది. ఆ స్థితిలో ఆమెను నేను ఎన్నో ప్రశ్నలు అడుగుదామని అనుకున్నా.. కానీ, దు:ఖం తన్నుకొచ్చి ఏమీ అడగలేకపోయాను.’’ అంటూ లక్ష్మీ పార్వతి మీడియాతో మాట్లాడారు.
ఎన్టీఆర్ చనిపోలేదని ఆయన ఆత్మ తెలుగు రాష్ట్రాల్లోనే ఉందని అన్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి నుంచి ఎన్టీఆర్ ఆత్మ కాపాడాలని కోరుకున్నారు. ఎన్టీఆర్ చల్లని చూపు తెలుగు ప్రజలపై ఉండాలని, ముఖ్యమంత్రుల హృదయాల్లో ఎన్టీఆర్ ఆత్మ ప్రవేశించాలని లక్ష్మీ పార్వతి కోరారు.
ఏపీలో ఏపీలో ఎన్టీఆర్ విగ్రహాలపై దాడుల గురించి కూడా లక్ష్మీ పార్వతి మాట్లాడారు. విగ్రహాలు కొల్లగొట్టే ఆ పని ఎవరు చేసినా తప్పేనని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేసి సీఎం జగన్ హుందాగా వ్యవహరించారని లక్ష్మీ పార్వతి కితాబిచ్చారు. దుర్గి ఘటనపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డితో మాట్లాడి వాస్తవాలు తెలుసుకున్నానని అన్నారు. ప్రతిపక్షాలు కూడా హుందాగా వ్యవహరించాలని సూచించారు. గతంలో టీడీపీలో ఉన్నవారు ఆ విగ్రహం ఏర్పాటు చేశారని, ఇప్పుడు వారు వైఎస్ఆర్ సీపీలో చేరారని అన్నారు. వారు పెట్టిన విగ్రహాన్ని వారే ధ్వంసం చేయాలని అనుకున్నారని చెప్పారు.
Also Read: Chandrababu Naidu Corona Positive: చంద్రబాబుకు కరోనా పాజిటివ్.. ఇంట్లోనే క్వారంటైన్‌లోకి..
Also Read: Peddapalli: చెల్లి శవంతో నాలుగు రోజులుగా ఇంట్లోనే అక్క.. అది కుళ్లడంతో చివరికి..
Also Read: ట్విట్టర్ వేదికగా పరస్పరం ట్వీట్లు విసురుకుంటున్న వైసీపీ ఎంపీలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి