News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Chandrababu Naidu Corona Positive: చంద్రబాబుకు కరోనా పాజిటివ్.. ఇంట్లోనే క్వారంటైన్‌లోకి..

తనకు కరోనా పాజిటివ్ అని తేలగానే వెంటనే ఇంట్లోనే క్వారంటైన్‌లోకి వెళ్లిపోయానని, అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా చంద్రబాబు వెల్లడించారు.

FOLLOW US: 
Share:

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే తన ట్విటర్ ద్వారా ప్రకటించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పారు. తనకు కరోనా పాజిటివ్ అని తేలగానే వెంటనే ఇంట్లోనే క్వారంటైన్‌లోకి వెళ్లిపోయానని, అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఇటీవలి కాలంలో తనకు దగ్గరగా మెలిగిన వారు, నేరుగా కాంటాక్ట్ ఉన్నవారు కూడా జాగ్రత్త వహించాలని చంద్రబాబు సూచించారు. వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైతే క్వారంటైన్‌లోకి వెళ్లాలని చెప్పారు. అందరూ సేఫ్‌గా, జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు కోరారు.

మరోవైపు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సోమవారం (జనవరి 17) సోషల్ మీడియాలో లోకేష్ ప్రకటించారు. తనకు లక్షణాలేమీ లేవని... ఎలాంటి అనారోగ్యం లేదని హోంఐసోలేషన్‌లో ఉన్నానని లోకేష్ ప్రకటించారు. తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

గత వారం రోజులుగా లోకేష్ పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. ఈ ఉదయమే స్కూళ్లకు సెలవులు ఇవ్వాలి ఏపీ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాస్తూ ట్వీట్ చేశారు. కాసేపటికే తనకు కరోనా సోకిందని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసుతో పాటు ఇతర చోట్ల కరోనా నిబంధనలను పక్కాగా పాటిస్తూ ఉంటారు.

Also Read: సీఐడీ విచారణకు రఘురామ డుమ్మా.. 4వారాల సమయం కావాలని లేఖ !

తొలి రెండు వేవ్‌లలో అందుకే టీడీపీ ఆఫీసు సిబ్బంది కూడా పెద్దగా కరోనా బారిన పడలేదు. కానీ థర్డ్ వేవ్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పుడు లోకేష్‌కు కూడా సోకింది. తనకు కరోనా సోకినట్లుగా చంద్రబాబు, లోకేష్ పెట్టిన ట్వీట్‌కు టీడీపీ కార్యకర్తలు స్పందిస్తున్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ అన్ని చోట్లా తీవ్రంగా విస్తరిస్తోంది. అయితే ఎక్కువ మందికి అతి స్వల్ప లక్షణాలు.. లేదా లక్షణాలు లేని పరిస్థితి కనిపిస్తోంది. ఆస్పత్రి పాలయ్యేవారి సంఖ్య.. మొదటి, సెకండ్‌ వేవ్‌లతో పోలిస్తే తక్కువగానే ఉంది.

Also Read: తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించండి.... సీఎం జగన్ కు నారా లోకేశ్ లేఖ

Also Read: ట్విట్టర్ వేదికగా పరస్పరం ట్వీట్లు విసురుకుంటున్న వైసీపీ ఎంపీలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Jan 2022 08:30 AM (IST) Tags: Chandrababu Chandrababu naidu TDP chief Chandrababu Corona positive Andhra Pradesh Ex CM TDP Chief Covid Positive

ఇవి కూడా చూడండి

Gold-Silver Prices Today: పెరిగింది కొండంత, తగ్గేది గోరంత - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: పెరిగింది కొండంత, తగ్గేది గోరంత - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Anantapur Police Supended: ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ

Anantapur Police Supended: ఇద్దరు సీఐలపై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ

APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా

APPMB: ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 170 టీచింగ్ పోస్టులు, వాక్ఇన్ తేదీలు ఇలా

CM Jagan Phone To KTR : కేటీఆర్‌కు ఏపీ సీఎం జగన్ ఫోన్ - ఎందుకంటే ?

CM Jagan Phone To KTR : కేటీఆర్‌కు ఏపీ సీఎం జగన్ ఫోన్ -  ఎందుకంటే ?

Andhra News: ఆ ఓటర్లకు షాక్ - డూప్లికేట్, డబుల్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు

Andhra News: ఆ ఓటర్లకు షాక్ - డూప్లికేట్, డబుల్ ఓట్లపై ఈసీ కీలక ఆదేశాలు

టాప్ స్టోరీస్

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే