By: ABP Desam | Updated at : 17 Jan 2022 02:16 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
నారా లోకేశ్(ఫైల్ ఫొటో)
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా విస్తరిస్తోన్న తరుణంలో విద్యార్థులకు తరగతులు నిర్వహించడం సరికాదని, విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. ఏపీలో థర్డ్ వేవ్ ఉద్ధృతమవుతున్న కారణంగా విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు పాఠశాలలకు సెలవులు పొడిగించాయని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే పాఠశాలలకు సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
Also Read: సీఐడీ విచారణకు రఘురామ డుమ్మా.. 4వారాల సమయం కావాలని లేఖ !
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని ముఖ్యమంత్రి @ysjagan గారికి లేఖ రాసాను. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి.
— Lokesh Nara (@naralokesh) January 17, 2022
తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్ కి సెలవులు ప్రకటించాయి.(1/2) pic.twitter.com/iCWaMJiPOt
ప్రాణాలతో చెలగాటమాడొద్దు
'15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడోద్దు. గత పది రోజుల్లో ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత పది రోజుల్లోనే రోజుకి 500 కేసుల నుంచి 5 వేల కేసులు నమోదు అయ్యే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో పాఠశాలల పునఃప్రారంభం పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. తల్లిదండ్రులను మరింత మానసిక ఆందోళనకు గురిచేయకుండా ప్రభుత్వం తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలి. తక్షణమే స్కూల్స్ కి సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.' ---నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
I have tested positive for COVID-19.
— Lokesh Nara (@naralokesh) January 17, 2022
I’m asymptomatic and feeling fine but will be self-isolating until recovery.
I request those who have come in contact with me to get tested at the earliest and take necessary precautions.
Urging everyone to stay safe. 🙏
లోకేశ్ కు కరోనా పాజిటివ్
నారా లోకేశ్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని లోకేశ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తనకు కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఇటీవల తనతో కాంటాక్ట్ అయిన వాళ్లందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఆయన క్వారంటైన్ కు వెళ్లినట్లు ప్రకటించారు.
Also Read: ట్విట్టర్ వేదికగా పరస్పరం ట్వీట్లు విసురుకుంటున్న వైసీపీ ఎంపీలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్
AP News : విశాఖ రుషికొండ తవ్వకాల స్టే, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్
Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, రేపు ఆర్జితసేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
Nellore Crime : సినిమా స్టైల్ లో వెంటాడి మరీ దొంగతనం, పట్టించిన సీసీ కెమెరాలు
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!
Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?