అన్వేషించండి

Youngest Billionaire: 19 ఏళ్లకే వేల కోట్ల ఆస్తి, ఈ అమ్మాయి ప్రపంచంలోనే యువ బిలియనీర్‌

బిలియన్‌ డాలర్ల (వంద కోట్ల అమెరికన్‌ డాలర్లు లేదా 8,329 కోట్ల రూపాయలు) కంటే ఎక్కువ ఆస్తి ఉన్న వాళ్లు ఫోర్బ్స్ లిస్ట్‌లోకి ఎక్కారు.

Worlds Youngest Billionaire: ఫోర్బ్స్ ఇటీవలే ప్రపంచ సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఇందులో మొత్తం 2,781 మందికి చోటు దక్కింది. ఫ్రెంచ్ వ్యాపారవేత్త, లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ LMVH యజమాని బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఫోర్బ్స్ బిలియనీర్స్‌ లిస్ట్‌లో అగ్రస్థానంలో నిలిచారు. 75 ఏళ్ల బెర్నార్డ్ ఆర్నాల్ట్ మొత్తం నికర విలువ (సంపద విలువ) దాదాపు 233 బిలియన్‌ డాలర్లు. ఈ జాబితాలో.. ఎక్స్‌, స్టార్‌లింక్, టెస్లా కంపెనీల యజమాని ఎలాన్ మస్క్‌ పేరు సెకండ్‌ ప్లేస్‌లో ఉంది. అతని ఆస్తుల విలువ 195 బిలియన్ డాలర్లు. 

బిలియన్‌ డాలర్ల (వంద కోట్ల అమెరికన్‌ డాలర్లు లేదా 8,329 కోట్ల రూపాయలు) కంటే ఎక్కువ ఆస్తి ఉన్న వాళ్లు ఫోర్బ్స్ లిస్ట్‌లోకి ఎక్కారు.

ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలో 19 ఏళ్ల యువతికి కూడా చోటు దక్కింది. ఆమె పేరు లివియా ఓయిగ్ట్ (Livia Voigt). వయస్సు కేవలం 19 సంవత్సరాలు. బ్రెజిల్‌కు చెందిన ఈ అమ్మాయి ప్రస్తుతం చదువుకుంటోంది. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన బిలియనీర్ ‍‌(Youngest billionaire in the world) బిరుదును ఈమె సాధించింది. ఇంతకుముందు, ఈ టైటిల్‌ను 19 ఏళ్ల ఇటాలియన్ అమ్మాయి క్లెమెంటే డెల్ వెచియో గెలుచుకుంది. ఆమె లివియా ఓయిగ్ట్ కంటే రెండు నెలలు మాత్రమే పెద్దది.

లివియా ఓయిగ్ట్ ఎవరు?
ప్రపంచంలోనే యంగెస్ట్‌ బిలియనీర్‌గా గుర్తింపు సాధించిన లివియా ఓయిగ్ట్ నేపథ్యం వ్యాపార కుటుంబం. ఆమె కుటుంబ యాజమాన్యంలో ఉన్న సంస్థ భారతదేశంలోని అగ్రశ్రేణి మోటార్ తయారీ కంపెనీల్లో ఒకటి. WEG అనే ఈ మోటార్ కంపెనీలో లివియా ఓయిగ్ట్ అతి పెద్ద వ్యక్తిగత వాటాదారు. ఈ కంపెనీని లివియా ఓయిగ్ట్ తాత వెర్నర్ రికార్డో ఓయిగ్ట్ (Werner Ricardo Voigt) ప్రారంభించారు. ఫోర్బ్స్ ప్రకారం, లివియా ఓయిగ్ట్ మొత్తం నికర విలువ (Livia Voigt Networth) సుమారు 1.1 బిలియన్‌ డాలర్లు. మన రూపాయల్లో చెప్పుకుంటే ఇది రూ.9,162 కోట్ల పైమాటే.

భారతదేశంలో అతి పిన్న వయస్కుడైన బిలియనీర్
జీరోధ వ్యవస్థాపకులు నితిన్ కామత్ & నిఖిల్ కామత్‌ల పేర్లు భారతదేశంలోని అత్యంత పిన్న వయస్కులైన బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఓనర్లు సచిన్, బిన్నీ బన్సాల్ కూడా భారతదేశపు అత్యంత పిన్న వయస్కులైన సంపన్నుల జాబితాలో ఉన్నారు. 

భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళ
ఫోర్బ్స్ విడుదల చేసిన బిలియనీర్ల జాబితాలో దాదాపు 200 మంది భారతీయులు చోటు దక్కించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముకేశ్ అంబానీ భారతదేశం & ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. అంబానీ నికర విలువ దాదాపు 116 బిలియన్ డాలర్లు. గౌతమ్ అదానీ భారతదేశంలో రెండో అత్యంత సంపన్న వ్యాపారవేత్త. ఫోర్బ్స్ జాబితాలో అతను 17వ స్థానంలో ఉన్నారు. అదానీ సంపద విలువ 84 బిలియన్ డాలర్లు. కేవలం మహిళలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే... జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్ సావిత్రి జిందాల్ భారతదేశంలో అత్యంత సంపన్న మహిళగా కొనసాగుతున్నారు. ఆమె సంపద విలువ 35.5 బిలియన్ డాలర్లు.

మరో ఆసక్తికర కథనం: చిరుత నుంచి సూపర్‌స్టార్‌ వరకు - సొంత విమానాలున్న దక్షిణాది నటులు వీళ్లే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Embed widget