(Source: ECI/ABP News/ABP Majha)
Tata-Haldiram Deal: తూచ్, ఆ వార్తలు ఉత్తదేనన్న టాటా గ్రూప్ - షేర్ ప్రైస్ డ్రాప్
అలాంటి డీల్ లేదని, ఎలాంటి చర్చలు జరగడం లేదని స్టాక్ మార్కెట్‌లకు స్పష్టం చేసింది.
Tata Consumer Products - Haldiram Deal: టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ - హల్దీరామ్ మధ్య డీల్‌కు సంబంధించి నేషనల్ మీడియాలో నిన్నటి నుంచి తిరుగుతున్న వార్తలు ఉత్తదేనని తేలిపోయింది. హల్దీరామ్‌లో స్టేక్ కొంటే టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ బిజినెస్‌కు వాల్యూ యాడ్ అవుతుందని, షేర్ ప్రైస్ పెరుగుతుందని ఆశించిన ఇన్వెస్టర్లకు నిరాశ మిగిలింది.
ఫుడ్ కంపెనీ హల్దీరామ్‌లో 51% వాటా కొనుగోలు చేయబోతోందంటూ వచ్చిన వార్తలను టాటా గ్రూప్ ఖండించింది. నేషనల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తలు తప్పని గ్రూప్‌లోని కన్జ్యూమర్ కంపెనీ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వెల్లడించింది. అలాంటి డీల్ లేదని, ఎలాంటి చర్చలు జరగడం లేదని స్టాక్ మార్కెట్‌లకు స్పష్టం చేసింది.
వార్త రాసిన రాయిటర్స్
దేశీయ ఆహార సంస్థ హల్దీరామ్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుకు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ చర్చలు జరుపుతున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నిన్న (బుధవారం, 06 సెప్టెంబర్ 2023) ఒక వార్తను ప్రచురించింది. హల్దీరామ్‌లో కనీసం 51% వాటా కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ సిద్ధంగా ఉందని రాసింది. అయితే, తమ కంపెనీ విలువను 10 బిలియన్ డాలర్ల వద్ద విలువ కట్టాలని హల్దీరామ్ డిమాండ్ చేసిందని వెల్లడించింది. హల్దీరామ్, తన కంపెనీ విలువను చాలా ఎక్కువగా కోట్ చేసిందని, కాబట్టి డీల్‌పై ముందుకు వెళ్లాలా, వద్దా? అని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఆలోచన చేస్తోందని రాయిటర్స్ రిపోర్ట్‌లో ఉంది.
సమాధానం కోరిన స్టాక్ మార్కెట్లు
టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ - హల్దీరామ్ మధ్య డీల్‌కు సంబంధించి రాయిటర్స్‌లో వార్త రావడంతో, దేశంలోని ప్రధాన స్టాక్ మార్కెట్లు BSE & NSE రెండూ టాటా కన్స్యూమర్ నుంచి సమాధానం అడిగాయి. రాయిటర్స్ రిపోర్ట్‌లో ఉన్నట్లు హల్దీరామ్‌లో 51% వాటా కొనుగోలుకు చర్చలు జరుగుతున్నాయా, ఒకవేళ చర్చలు జరుగుతుంటే దానికి సంబంధించి మొదటి నుంచి ఇప్పటి వరకు ఉన్న మొత్తం సమాచారాన్ని అందించాలని స్టాక్ ఎక్స్ఛేంజీలు అడిగాయి. టాటా కన్స్యూమర్ దీనిపై స్పందించింది. రాయిటర్స్ వార్తలో రాసినట్లుగా హల్దీరామ్‌లో వాటా కొనుగోలు ఉద్దేశం తమకు లేదని, దీనికి సంబంధించి ఎలాంటి చర్చలు జరగడం లేదంటూ స్టాక్ ఎక్సేంజీలకు సమాధానం ఇచ్చింది.
ఇలాంటి వార్తలతో ఎవరైనా షేర్ల ధరను ప్రభావితం చేస్తున్నారన్న ఏదైనా సమాచారం మీ దగ్గర ఉందా అని కూడా స్టాక్ ఎక్స్ఛేంజీలు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌ను అడిగాయి. సెబీ నిబంధనల ప్రకారం అలాంటి సమాచారాన్ని స్టాక్ మార్కెట్లకు చెప్పాలని సూచించాయి. అలాంటి సమాచారం ఏదీ తనకు తెలియదని సమా టాటా గ్రూప్ కంపెనీ సమాధానం స్పష్టం చేసింది.
హల్దీరామ్‌లో వాటా కొనుగోలు వార్తలతో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేర్ ప్రైస్ నిన్న మధ్యాహ్నం తర్వాత హఠాత్తుగా పెరిగింది. ఆ వార్తలు ఉత్తదేనని కంపెనీ స్పష్టం చేయడంతో, ఈ రోజు (గురువారం, 07 సెప్టెంబర్ 2023) ఓపెనింగ్ సెషన్‌లో అమాంతం పడిపోయింది, 2% పైగా నష్టపోయింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈరోజు రేట్లు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial