Stocks To Watch 31 July 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Maruti, IDFC Bank, Marico
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 31 July 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 01 పాయింట్లు లేదా 0.01 శాతం గ్రీన్ కలర్‌లో 19,789 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ Q1 రిజల్ట్స్ ప్రకటించే కీలక కంపెనీలు: మారుతి సుజుకి, పవర్ గ్రిడ్, గెయిల్, అదానీ గ్రీన్. ఈ స్టాక్స్ ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
IDFC ఫస్ట్ బ్యాంక్: 2023-24 మొదటి త్రైమాసికంలో IDFC ఫస్ట్ బ్యాంక్ లాభం 61% పెరిగి రూ. 765 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం 43% వృద్ధితో రూ. 8,282 కోట్లుగా నమోదైంది.
NTPC: విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రభుత్వ యాజమాన్యంలోని NTPC నికర లాభం Q1లో 9% పెరిగి రూ. 4,066 కోట్లుగా రికార్డ్ అయింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 2% తగ్గి రూ. 39,122 కోట్లకు పరిమితమైంది.
మారికో: ఏప్రిల్-జూన్ కాలానికి మారికో కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ 15% పెరిగి రూ.427 కోట్లకు చేరుకుంది. అయితే కార్యకలాపాల ఆదాయం 3% తగ్గి రూ. 2,477 కోట్లుగా ఉంది.
సొనాటా సాఫ్ట్‌వేర్: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో సొనాటా సాఫ్ట్‌వేర్ రూ.120 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా రూ. 2015 కోట్ల ఆదాయం వచ్చింది.
సైమెన్స్: సైమెన్స్ లార్జ్ డ్రైవ్స్ లిమిటెడ్‌కు సైమెన్స్‌కు చెందిన లో ఓల్టేజీ మోటార్స్, గేర్డ్ మోటార్స్ వ్యాపారాల విక్రయానికి వ్యతిరేకంగా సీమెన్స్ వాటాదారులు ఓటు వేశారు.
SBI కార్డ్: జూన్ త్రైమాసికంలో SBI కార్డ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 5% తగ్గి రూ. 593 కోట్లకు పరిమితమైంది. కార్యకలాపాల ఆదాయం 24% పెరిగి రూ. 4,046 కోట్లకు చేరుకుంది.
నజారా టెక్: మొదటి త్రైమాసికంలో నజారా టెక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 31% వృద్ధితో రూ. 21 కోట్లుగా ఉంది. ఆదాయం 14% పెరిగి రూ. 254.4 కోట్లకు చేరుకుంది.
ఈక్విటాస్ SFB: తొలి త్రైమాసికంలో ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 191 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. నికర వడ్డీ ఆదాయం రూ. 743 కోట్లు వచ్చింది.
యునైటెడ్ బ్రూవరీస్: ఈ కంపెనీ నికర లాభం మొదటి త్రైమాసికంలో రూ.136 కోట్లకు చేరుకుంది. రూ. 2,274 కోట్ల ఆదాయం మీద ఆ లాభం సంపాదించింది.
గ్లాండ్ ఫార్మా: ఈ ఫార్మా కంపెనీకి చెందిన VSEZ స్టెరైల్ ఆంకాలజీ ఫెలిలిటీలో USFDA తనిఖీలు పూర్తయ్యాయి, ఒక్క అబ్జర్వేషన్ కూడా ఇవ్వలేదు.
బ్యాంక్ ఆఫ్ ఇండియా: జూన్ త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 1,551 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. NII రూ. 5,914 కోట్లుగా ఉంది.
MCX: Q1లో MCX రూ. 19.6 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, ఆదాయం రూ.146 కోట్లుగా ఉంది.
పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్: పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్ బోర్డు టెండర్ ఆఫర్ రూట్ ద్వారా రూ.1,750 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ను ఓకే చేసింది.
ఇది కూడా చదవండి: ఆగస్టులో బ్యాంకులు 14 రోజులు పని చేయవు, ఈ లిస్ట్ సేవ్ చేసుకోండి
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial