Bank Holiday: ఆగస్టులో బ్యాంకులు 14 రోజులు పని చేయవు, ఈ లిస్ట్ సేవ్ చేసుకోండి
ఆగస్టు 06న ఆదివారంతో మొదలై ఆగస్టు 31న రాఖీ పండుగతో హాలిడేస్ ముగుస్తాయి.

Bank Holidays list in August 2023: వచ్చే నెలలో (ఆగస్టు) బ్యాంకులు 14 రోజులు పని చేయవు. రెండు వేల రూపాయల నోట్లు మార్చుకోవడానికి గానీ, మరో పని కోసం ఈ నెలలో బ్యాంక్‌కు వెళ్లాలని మీరు అనుకుంటుంటే, బ్యాంక్ హాలిడేస్ లిస్ట్‌ను కచ్చితంగా గుర్తుంచుకోండి. ఆ లిస్ట్‌కు తగ్గట్లుగా మీ పనిని ప్లాన్ చేసుకోవచ్చు.
ఆగస్టు నెలలో బ్యాంకులకు 14 రోజులు సెలవులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ కస్టమర్ల సౌలభ్యం కోసం ప్రతి నెలకు సంబంధించిన బ్యాంక్ హాలిడేస్ లిస్ట్‌ను ముందుగానే విడుదల చేస్తుంది. ప్రతి రాష్ట్రంలోని పండుగలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో వచ్చే సెలవుల వివరాలు ఆ లిస్ట్‌లో ఉంటాయి. ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు 14 రోజులు సెలవులు ఉన్నాయి. శని, ఆదివారాల్లో వచ్చే సాధారణ సెలవులతో పాటు, పండుగలు, ఇతర కార్యక్రమాల వల్ల వచ్చే సెలవులు కూడా ఈ లిస్ట్‌లో కలిసి ఉన్నాయి. ఆగస్టు 06న ఆదివారంతో మొదలై ఆగస్టు 31న రాఖీ పండుగతో హాలిడేస్ ముగుస్తాయి. బ్యాంకు సెలవుల జాబితా ఒక రాష్ట్రానికి, మరొక రాష్ట్రానికి మారుతుంది.
2023 ఆగస్టు నెలలో బ్యాంకుల సెలవు రోజులు:
ఆగస్టు 06 - ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 08 - మంగళవారం - (టెండోంగ్ లో రమ్ ఫాత్): సిక్కింలో బ్యాంక్ సెలవు
ఆగస్టు 12 - రెండో శనివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 13 - ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 15 - మంగళవారం - (స్వాతంత్ర్య దినోత్సవం): దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 16 - బుధవారం - (పార్సీ నూతన సంవత్సరం- షాహెన్‌షాహి): బేలాపూర్, ముంబై, నాగ్‌పుర్‌లలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 18 - శుక్రవారం - (శ్రీమంత శంకరదేవుని తిథి): గువాహతిలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 20 - ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 26 - నాలుగో శనివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 27 - ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్టు 28 - సోమవారం - (మొదటి ఓనం): కోచి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 29 - మంగళవారం - (తిరువోణం): కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 30 - బుధవారం - (రాఖీ పండుగ): జైపూర్, సిమ్లాలో బ్యాంకులకు సెలవు
ఆగస్టు 31 - గురువారం - (రాఖీ పండుగ/శ్రీనారాయణ గురు జయంతి/పాంగ్-లాబ్సోల్): డెహ్రాడూన్, గాంగ్‌టక్, కాన్పూర్, కొచ్చి, లఖ్‌నవూ, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
బ్యాంకు సెలవు రోజుల్లో నగదు లావాదేవీలు ఎలా?
RBI, బ్యాంక్ సెలవులను మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. 'హాలిడేస్ అండర్ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్', 'రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేస్' & 'క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్'. ఏ బ్యాంక్ సెలవైనా ఈ మూడు కేటగిరీల్లో ఒకదాని కిందకు వస్తుంది. బ్యాంకులకు సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్ & నెట్ బ్యాంకింగ్, UPI, ATM సేవలు 24 గంటలూ పని చేస్తాయి. బ్యాంకు సెలవుల్లో నగదు విత్‌డ్రా/డిపాజిట్ చేయాల్సివస్తే ATMను ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి మొబైల్ బ్యాంకింగ్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా UPIని ఉపయోగించవచ్చు.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇవాళ్టి రేట్లివి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

