Stocks To Watch 27 July 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Tata Consumer, Netweb, RVNL
మన స్టాక్ మార్కెట్ ఇవాళ గ్యాప్-అప్‌లో ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 27 July 2023: ఇవాళ (గురువారం) ఉదయం 8.10 గంటల సమయానికి, గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 19 పాయింట్లు లేదా 0.10 శాతం గ్రీన్ కలర్‌లో 20,003 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ గ్యాప్-అప్‌లో ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ Q1 రిజల్ట్స్ ప్రకటించే కీలక కంపెనీలు: నెస్లే, BEL, మాక్రోటెక్, శ్రీరామ్ ఫైనాన్స్. ఈ స్టాక్స్ ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
టాటా కన్స్యూమర్: టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లాభం మొదటి త్రైమాసికంలో 30% పెరిగి రూ. 359 కోట్లకు చేరుకుంది. ఆ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 12% పెరిగి రూ.3,741 కోట్లుగా నమోదైంది.
RVNL: ఈరోజు ప్రారంభమయ్యే "ఆఫర్ ఫర్ సేల్" ద్వారా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌లో (RVNL) సుమారు 5.36% వాటాను ప్రభుత్వం విక్రయిస్తుంది.
నెట్‌వెబ్ టెక్నాలజీస్: IPOకు బంపర్ ర్పెస్పాన్స్ అందుకున్న నెట్‌వెబ్ టెక్నాలజీస్ షేర్లు ఈరోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అవుతాయి. స్టాక్ 70% పైగా ప్రీమియంతో లిస్ట్ అవుతుందని అంచనా.
RBL బ్యాంక్: RBL బ్యాంక్‌లో 3.53% వాటాను రూ. 417 కోట్లకు కొనుగోలు చేసినట్లు మహీంద్ర అండ్ మహీంద్ర స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
యాక్సిస్ బ్యాంక్: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ లాభం 40% జంప్ చేసి రూ.5,797 కోట్లకు చేరుకుంది.
టెక్ మహీంద్ర: ఈ ఐటీ కంపెనీ నికర లాభం మొదటి త్రైమాసికంలో 39% తగ్గి రూ.693 కోట్లకు పడిపోయింది. కార్యకలాపాల ఆదాయం 4% పెరిగి రూ.13,159 కోట్లకు చేరుకుంది.
మారికో: సతియ న్యూట్రాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 58% వరకు వాటా కొనుగోలు చేసేందుకు మారికో ఒప్పందం కుదుర్చుకుంది.
కోల్గేట్: మొదటి త్రైమాసికంలో రూ.274 కోట్ల నికర లాభాన్ని కోల్గేట్ ప్రకటించింది. ఈ కంపెనీకి రూ. 1,323 కోట్ల ఆదాయం వచ్చింది.
అయాన్ ఎక్సేంజ్: జూన్ త్రైమాసికంలో అయాన్ ఎక్స్ఛేంజ్ 33.3 కోట్ల రూపాయల నికర లాభాన్ని ఆర్జించింది. ఇదే కాలానికి ఆదాయం రూ.479 కోట్లుగా ఉంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్: భారతదేశ అసెట్ మేనేజ్‌మెంట్ ఇండస్ట్రీలోకి ప్రవేశించడానికి 50:50 జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడానికి జియో ఫైనాన్షియల్, బ్లాక్‌రాక్ ఒక ఒప్పందంపై సంతకం చేశాయి.
ఒరాకిల్ ఫైనాన్షియల్: మొదటి త్రైమాసికంలో ఒరాకిల్ ఫైనాన్షియల్ నికర లాభం స్వల్పంగా 2% పెరిగి రూ.501 కోట్లకు చేరుకోగా, ఆదాయం 4% పెరిగి రూ.1,462 కోట్లకు చేరుకుంది.
HFCL: ఏప్రిల్-జూన్ కాలానికి HFCL రూ. 68 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా, కార్యకలాపాల ద్వారా రూ.995 కోట్ల ఆదాయం వచ్చింది.
వేదాంత్ ఫ్యాషన్స్: మొదటి త్రైమాసికంలో వేదాంట్ ఫ్యాషన్స్ లాభం చాలా రెట్లు పెరిగి రూ.92 కోట్లకు చేరుకుంది. అయితే, ఆదాయం 4% తగ్గి రూ.312 కోట్లకు పరిమితమైంది.
జిందాల్ స్టెయిన్‌లెస్: జిందాల్ స్టెయిన్‌లెస్ జూన్ త్రైమాసికంలో రూ.737 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. రూ.10,184 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
ఇది కూడా చదవండి: బ్యాంకుల దగ్గర మూలుగుతున్న ₹5,729 కోట్లు, మీ డబ్బును క్లెయిమ్ చేయడం ఇప్పుడు ఈజీ
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial