Stocks to watch 02 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - అదరగొట్టిన Britannia, Tata Chem
మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
![Stocks to watch 02 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - అదరగొట్టిన Britannia, Tata Chem Stocks to watch in todays trade 02 February 2023 todays stock market todays share market Stocks to watch 02 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - అదరగొట్టిన Britannia, Tata Chem](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/02/5090501648a8c89670de5f372a38bbff1675305341502545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Stocks to watch today, 02 February 2023: ఇవాళ (గురువారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 65 పాయింట్లు లేదా 0.37 శాతం రెడ్ కలర్‌లో 17,634వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
అదానీ గ్రూప్ స్టాక్స్: గత కొన్ని సెషన్లుగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీ అమ్మకాలను చూశాయి. బుధవారం ఒక్కరోజే దాదాపు రూ. 12 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లింది. చాలా స్టాక్‌ల వ్యూ బేరిష్‌గా ఉంది. అవన్నీ రీబౌండ్ సాధించగలవో, లేదో అర్ధం చేసుకోవడం చాలా కీలకం.
బ్రిటానియా ఇండస్ట్రీస్: ఈ కంపెనీ, 2022 డిసెంబర్ త్రైమాసికంలో రూ. 932 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 150% పెరిగింది. ఏకీకృత విక్రయాలు 16% వృద్ధితో రూ. 4,101 కోట్లకు చేరుకోగా, నిర్వహణ లాభం 55% పెరిగి రూ. 760 కోట్లకు చేరుకుంది.
టాటా కెమికల్స్: 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 26% పెరిగి రూ. 391 కోట్లకు చేరుకుంది. ఆదాయం 32% వృద్ధితో రూ. 4,148 కోట్లకు చేరుకుంది.
జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్: 2022 డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ నికర లాభం 36% తగ్గి రూ. 88 కోట్లకు పడిపోయింది. ఆదాయం 10% వృద్ధితో రూ. 1,316 కోట్లకు చేరుకుంది, డొమినోస్ ఆర్డర్‌ల పెరుగుదల కారణంగా అమ్మకాల్లో పెరుగుదల కనిపించింది. ఈ కంపెనీ, భారతదేశం డొమినోస్ ఆపరేటర్.
HDFC లిమిటెడ్: ఈ కంపెనీ ఫలితాలు ఇవాళ వెలువడతాయి. లోన్ బుక్‌లో బలమైన వృద్ధి & స్థిరమైన మార్జిన్లతో 2022 డిసెంబర్ త్రైమాసికంలో నికర లాభంలో రెండంకెల వృద్ధిని నివేదించే అవకాశం ఉంది. ఈ హోమ్ లోన్ కంపెనీ నికర లాభం సంవత్సరానికి 15% పెరిగి రూ. 3,752 కోట్లకు చేరుకుందని అంచనా.
టైటన్ కో: 2022 డిసెంబర్ త్రైమాసిక ఆదాయాలను ఇవాళ విడుదల చేయనుంది. అన్ని వ్యాపార విభాగాల్లో మంచి పనితీరు నేపథ్యంలో నికర లాభంలో బలమైన రెండంకెల వృద్ధిని సాధించగలదని మార్కెట్ అంచనా.
మహీంద్ర లాజిస్టిక్స్: 2022 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం సంవత్సరానికి (YoY) 22% తగ్గి రూ. 1.39 కోట్లకు పడిపోయింది. ఆదాయం 17% పెరిగి రూ. 1,330 కోట్లకు చేరుకుంది.
అశోక్ లేలాండ్: ఎగుమతులు రెండంకెలకు పడిపోయినప్పటికీ, బలమైన దేశీయ డిమాండ్ నేపథ్యంలో జనవరి నెలలో మొత్తం అమ్మకాలు ఏడాదికి (YoY) 23% పెరిగి 17,200 యూనిట్లకు చేరుకున్నాయి.
ఐషర్ మోటార్స్: జనవరిలో మొత్తం వాణిజ్య వాహనాల అమ్మకాలు ఏడాదికి 32% పెరిగి 7,181 యూనిట్లకు చేరుకున్నాయి. దేశీయ మార్కెట్‌లో ట్రక్కులు & బస్సుల అమ్మకాలు 50% వృద్ధిని సాధించాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిళ్ల విక్రయాలు 27% పెరిగి 74,746 యూనిట్లకు చేరుకున్నాయి.
IDFC: 2022 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ. 272 కోట్లుగా తేలింది. ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది రూ. 18.2 కోట్లుగా ఉంది. అయితే, ఆదాయం 45% క్షీణించి రూ. 29.7 కోట్లకు చేరుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)