అన్వేషించండి

Share Market Opening: మిక్స్‌డ్‌ సిగ్నల్స్‌ మధ్య ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు - భారీగా పెరిగిన బంధన్‌ బ్యాంక్‌

Share Market Updates: టీసీఎస్‌ రెండో త్రైమాసికం ఫలితాలు మార్కెట్‌ అంచనాలను అందుకోలేదు. దీంతో, ఈ స్టాక్‌ లోయర్‌ సైడ్‌లో ప్రారంభమైంది, బలహీనంగా ట్రేడవుతోంది.

Stock Market News Updates Today 11 Oct: ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందుతుండడంతో, ఈ వారంలో చివరి ట్రేడింగ్‌ సెషన్‌ అయిన ఈ రోజు (శుక్రవారం, 11 అక్టోబర్‌ 2024) భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. బంధన్‌ బ్యాంక్‌ షేర్లు భారీగా పెరిగాయి. ఓఎన్‌జీసీ షేర్లు కూడా పుంజుకున్నాయి. ఐటీ, ఆటో, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్స్ సూచీలు పచ్చగా ఉంటే, బ్యాంకింగ్ ఇండెక్స్‌ ఎరుపు రంగులోకి మారింది.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..

గత సెషన్‌లో (గురువారం) 81,611.41 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 133 పాయింట్లు తగ్గి 81,478.49 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. గురువారం 24,998.45 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 13 పాయింట్లు తగ్గి 24,985.30 వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 

షేర్ల పరిస్థితి
మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో 10 షేర్లు ముందుకు, 20 షేర్లు వెనక్కు కదులుతున్నాయి. టాప్‌ గెయినర్స్‌లో.., HCL టెక్ 1.41%, JSW స్టీల్ 0.84%, సన్ ఫార్మా 0.46%, టాటా స్టీల్ 0.38%, ఇన్ఫోసిస్ 0.37%, రిలయన్స్ 0.34%, టెక్ మహీంద్రా 0.27%, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 0.15%, టాటా మోటార్స్ 0.12 శాతం, HUL 0.06 శాతం పెరుగుదలతో ట్రేడవుతున్నాయి. టాప్‌ లూజర్స్‌లో భారతి ఎయిర్‌టెల్ 0.79 శాతం, పవర్‌ గ్రిడ్ 0.78 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.75 శాతం, ఏషియన్ పెయింట్స్ 0.66 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.57 శాతం, టీసీఎస్ 0.55 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.51 శాతం క్షీణతతో ట్రేడవుతున్నాయి.

మజగాన్ డాక్, JSW స్టీల్, IREDA, జస్ట్ డయల్‌ షేర్లలో ఈ రోజు వేగం చూడొచ్చు. స్టాక్ మార్కెట్‌లో ఇటీవల లిస్ట్ అయిన ఆర్కేడ్ డెవలపర్స్‌ షేర్లు కూడా రాడార్‌లో ఉంటాయి.  రెండో త్రైమాసికంలో ఈ కంపెనీ లాభం రూ.6.5 కోట్ల నుంచి రూ.30 కోట్లకు, ఆదాయం రూ.61 కోట్ల నుంచి రూ.125 కోట్లకు పెరిగింది. మజగాన్‌ డాక్ మహారాష్ట్ర పవర్ జనరేషన్ నుండి 1.22 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్‌ అందుకుంది. IREDA కూడా అద్భుతమైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.

సెక్టార్ల వారీగా... 
నిఫ్టీ బ్యాంక్ 0.28 శాతం క్షీణించగా, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.42 శాతం, రియల్టీ 0.45 శాతం పడిపోయాయి. మెటల్, ఐటీ ఇండెక్స్‌లు వరుసగా 0.75 శాతం, 0.63 శాతం పెరిగాయి. 

విస్తృత మార్కెట్లలో, నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.14 శాతం & నిఫ్టీ స్మాల్‌ క్యాప్ 100 సూచీ 0.16 శాతం పెరిగాయి.

ఉదయం 09.42 గంటలకు, సెన్సెక్స్ 192.30 పాయింట్లు లేదా 0.24% పడిపోయి 81,419.10 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి నిఫ్టీ 49.50 పాయింట్లు లేదా 0.20% తగ్గి 24,948.95 దగ్గర ట్రేడవుతోంది.

గ్లోబల్‌ మార్కెట్లు 
ఆసియా దేశాల స్టాక్ మార్కెట్లు మిక్స్‌డ్‌ ట్రెండ్‌లో ఉన్నాయి. నికాయ్‌ 0.59 శాతం, స్ట్రెయిట్ టైమ్స్ 0.20 శాతం, తైవాన్ వెయిటెడ్ 1.32 శాతం, కోస్పి 0.26 శాతం, జకార్తా 0.70 శాతం పెరుగుదలతో ట్రేడవుతున్నాయి. అయితే చైనా స్టాక్ మార్కెట్ షాంఘై కాంపోజిట్ 1.56 శాతం క్షీణతతో ట్రేడవుతోంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: 29 ఏళ్ల యువకుడే రతన్ టాటా బెస్ట్ ఫ్రెండ్‌ అండ్‌ మేనేజర్- గుడ్‌ బై లైట్‌హౌస్‌ అంటూ వీడ్కోలు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Moosi Funds : మూసీ సుందీరకరణకు ఎంత ఖర్చు అయినా సరే రేవంత్ రెడీ - నిధుల సమీకరణకు  మాస్టర్ ప్లాన్సే ఉన్నాయిగా !
మూసీ సుందీరకరణకు ఎంత ఖర్చు అయినా సరే రేవంత్ రెడీ - నిధుల సమీకరణకు మాస్టర్ ప్లాన్సే ఉన్నాయిగా !
YS Jagan : క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
Central Taxes: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
Weather Update: బంగాళాఖాతంలో తుపాను, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది,ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి?
బంగాళాఖాతంలో తుపాను, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది,ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ratan Tata News: అంత పెద్ద రతన్ టాటాకు చిన్న కుర్రాడే బెస్ట్ ఫ్రెండ్Ratan Tata: రతన్ టాటా మృతిపై స్పందించిన మాజీ గర్ల్‌ ఫ్రెండ్Ratan Tata Last Post: సోషల్ మీడియాలో రతన్ టాటా లాస్ట్ పోస్ట్ ఇదేRatan Tata News: మధ్యతరగతి వాడి కోసం ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Moosi Funds : మూసీ సుందీరకరణకు ఎంత ఖర్చు అయినా సరే రేవంత్ రెడీ - నిధుల సమీకరణకు  మాస్టర్ ప్లాన్సే ఉన్నాయిగా !
మూసీ సుందీరకరణకు ఎంత ఖర్చు అయినా సరే రేవంత్ రెడీ - నిధుల సమీకరణకు మాస్టర్ ప్లాన్సే ఉన్నాయిగా !
YS Jagan : క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
Central Taxes: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
Weather Update: బంగాళాఖాతంలో తుపాను, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది,ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి?
బంగాళాఖాతంలో తుపాను, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది,ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి?
Karnataka : హనీట్రాప్‌లు, సీక్రెట్ భేటీలు, సీఎంపై కేసులు - కర్ణాటకలో ప్రభుత్వ మార్పునకు సమయం దగ్గర పడిందా ?
హనీట్రాప్‌లు, సీక్రెట్ భేటీలు, సీఎంపై కేసులు - కర్ణాటకలో ప్రభుత్వ మార్పునకు సమయం దగ్గర పడిందా ?
Ratan Tata: రతన్ టాటాకు శునకం 'గోవా' కన్నీటి వీడ్కోలు - పార్థీవ దేహం వద్ద వేదనతో!, వైరల్ వీడియో
రతన్ టాటాకు శునకం 'గోవా' కన్నీటి వీడ్కోలు - పార్థీవ దేహం వద్ద వేదనతో!, వైరల్ వీడియో
Telugu States IAS IPS : కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
BYD eMAX 7: వావ్ అనిపిస్తున్న బీవైడీ కొత్త కారు - సింగిల్ ఛార్జింగ్‌తో ఎంత రన్ అవుతుంది?
వావ్ అనిపిస్తున్న బీవైడీ కొత్త కారు - సింగిల్ ఛార్జింగ్‌తో ఎంత రన్ అవుతుంది?
Embed widget