By: RAMA | Updated at : 11 Jan 2023 06:23 AM (IST)
Edited By: RamaLakshmibai
Love and Relationship Horoscope 11th January 2023 (Image Credit: freepik)
Horoscope Today 11th January 2023 : ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...
మేష రాశి
ఈ రోజు మీ జీవితంలోకి ఒక అపరిచితుడు వస్తాడు. వారిద్వారా మీకు మంచి జరుగుతుంది. స్త్రీ భాగస్వామి మద్దతుతో మీ జీవితంలో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి
వృషభ రాశి
అనవసర బంధాలను వదులుకోండి..వైవాహిక జీవితంలో ఇబ్బందులు తొలగించుకునేందుకు ప్రయత్నించండి. మీరు కోరుకున్న వ్యక్తిని పొందుతారు కానీ వారితో శాశ్వత సంబంధాన్ని కోరుకోవద్దు.
మిథున రాశి
ఈ రాశి వారు పనిచేసే ప్రదేశంలో ఒకరిపట్ల ఆకర్షితులవుతారు. మీ జీవిత భాగస్వామితో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కోపం తగ్గించుకోండి, మాట తూలొద్దు. కుటుంబ బాధ్యతలు నెరవేర్చడంలో మీరు విజయం సాధిస్తారు.
Also Read: సంక్రాంతికి ఇంటిముందు ముగ్గుల్లో 'కుండ' తప్పనిసరిగా వేస్తారెందుకు!
కర్కాటక రాశి
ప్రేమికుల మధ్య వివాదం ఉంటుంది. వారితో బంధాన్ని శాశ్వతంగా ఉంచుకోవాలంటే ఓ మెట్టుదిగాలి. జీవిత భాగస్వామితో చీటికి మాటికీ గొడవపడొద్దు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.
సింహ రాశి
ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగితో సాన్నిహిత్యం పెరుగుతుంది...ఇది మీ కెరీర్ కి ఎంతమాత్రం మంచిదికాదని గుర్తుంచుకోండి. బంధంలో తొందరపాటుకి దూరంగా ఉండడం మంచిది.
కన్యా రాశి
ఈ రోజు కొత్త భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. ఈ సంబంధం వివాహంగా మారే అవకాశం ఉంది. పాత స్నేహం మరింత బలపడుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళతారు
తులా రాశి
ఈ రోజు మీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఓ కొత్తవ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. వివాహితులు కుటుంబం కోసం సమయం కేటాయించండి
వృశ్చిక రాశి
ఈ రోజు మీరు ఉత్సాహంగా ఉంటారు. మీ భాగస్వామి నుంచి మీరు పొందే ఆనందం మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇతరుల మాటల ప్రభావం మీపై ఉండనంత వరకూ ీ జీవితంలో సంతోషం ఉంటుంది. ప్రేమికులు పెళ్లి దిశగా అడుగులేస్తారు.
Also Read: సంక్రాంతి పండుగ వెనుక ఇన్ని కథలున్నాయా!
ధనుస్సురాశి
మీరు ఒక పాత ప్రేమ భాగస్వామిని కలుసుకుంటారు..తద్వారా మూలన పడిన బంధానికి మళ్లీ ఉపిరిపోస్తారు. భాగస్వామిపై మీకున్న నమ్మకం వమ్ముకాదు. ప్రేమికులు పెళ్లిచేసుకునేందుకు ముందడగు వేయండి.
మకరరాశి
మీ మనసులో భావాలు పంచుకునేందుకు ఓ వ్యక్తి ఉన్నారని గుర్తుపెట్టుకోండి. కొత్తవారితో స్నేహం పెరుగుతుంది. ప్రేమలో కొత్త మలుపు రాబోతోంది. ఈ రోజు మీ మనసులో మాట చెప్పేందుకు మంచి రోజు.
కుంభ రాశి
మీ జీవిత భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కొత్త భాగస్వామిని కలవడం ద్వారా మనస్సు సంతోషంగా ఉంటుంది. అందరి కళ్ళు మీపై ఉంటాయి. ఈ రోజు ఆనందంగా ఉంటారు.
మీన రాశి
ఈ రోజు ప్రేమికుడు లేదా ప్రేమికురాలితో ఆకస్మిక సమావేశం చిరస్మరణీయంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో ఒంటరిగా ఉన్నవారికి ఈ రోజు శుభదినం. వివాహితులకు మాత్రం జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.
Horoscope Today 08th February 2023: ఈ రాశివారు కొన్నివిషయాల్లో సంకోచం లేకుండా దూసుకుపోతారు, ఫిబ్రవరి 8 రాశిఫలాలు
Mahamrityunjaya Mantra:మృత సంజీవని అని చెప్పే మృత్యుంజయ మంత్రం ఎప్పుడు జపించాలి!
Job And Business Astrology: మీ రాశి-నక్షత్రం ప్రకారం మీరు ఏ రంగంలో సక్సెస్ అవుతారో తెలుసా!
Horoscope Today 07th February 2023: ఈ రాశివారు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే డబ్బు సంపాదించే అవకాశం ఉంది, ఫిబ్రవరి 7 రాశిఫలాలు
Horoscope Today 06th February 2023: ఈ రోజు ఈ రాశివారు ఏదైనా కొత్తగా ట్రై చేసి సక్సెస్ అవుతారు, ఫిబ్రవరి 6 రాశిఫలాలు
ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్
Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్ని కూడా !
PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్