Pawan Wife: పవన్ సతీమణి భక్తికి అంతా ఫిదా - అన్నా లెజ్‌నోవాకు అంతా ఫ్యాన్స్ అయిపోయారుగా !
Anna Lezhnova: పవన్ కల్యామ్ సతీమణి అన్నా లెజ్నోవా అందరి మనసుల్ని గెలుచుకున్నారు. తిరుమలలో అత్యంత భక్తి పూర్వకంగా ఆమె సంప్రదాయాలు పాటించడం అందర్నీ ఫిదా చేసింది.

Pawan Kalyan Wife: పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవాకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పెరిగిపోయారు. అన్నా లెజినెవా క్రైస్తవ మతస్థురాలైనప్పటికీ, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హిందూ సాంప్రదాయాలను గౌరవించిన విధానం అందర్నీ ఆకట్టుకుంది. డిక్లరేషన్ ఫారమ్‌పై సంతకం చేయడం, తలనీలాలు సమర్పించడమే కాదు హిందూ సంప్రదాయాల పట్ల ఆమె చూపిన గౌరవం అందర్నీ ఫిదా చేసిందని అనుకోవచ్చు.
విభిన్న విశ్వాసం, దేశం మరియు సంస్కృతిలో పుట్టి పెరిగిన.. కానీ ఆమె హిందూ సంస్కృతికి అనుగుణంగా, సమీకరించిన విధానం ప్రశంసనీయం. హిందూ సంప్రదాయాలపై నమ్మకం🙏🏻 #AnnaLezneva గారికి 🙏 https://t.co/TmgL8BYGsd pic.twitter.com/ducimG6sNM
— prudhvi actor (@ursprudhviraj06) April 14, 2025
అన్నా లెజినెవా రష్యన్. ఆమె పుట్టి పెరిగినదంతా రష్యాలోనే. కానీ పవన్ కల్యాణ్‌తో వివాహం తర్వాత ఆమె భారతీయ సంస్కృతిని హృదయపూర్వకంగా స్వీకరించారు. హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ వస్తున్నారు. వారాహి వాహనానికి పూజ చేసినప్పుడు కానీ.. ఇతర కుటుంబ కార్యక్రమాల్లో కానీ ఆమె హిందూ సంప్రదాయాలను వందశాతం పాటిస్తారు. మతం, సంస్కృతి, దేశం వంటి హద్దులను అధిగమించి, మానవత్వం గొప్పతనాన్ని అన్నా లెజ్‌నోవా చాటి చెబతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
సర్వమత సౌభాగ్యానికి ఆదర్శనీయురాలు శ్రీమతి కొణిదెల అన్నా లెజినోవా గారు
— మన పిఠాపురం 🚩 (@Mana_Pithapuram) April 13, 2025
ఒక క్రైస్తవరాలుగా జన్మించి,క్రైస్తవంలోనే కొనసాగుతూ
హిందూ మతంపై ఉన్న నమ్మకంతో,వెంకన్న స్వామి వారి మీద ఉన్న భక్తితో
మొక్కులు తీర్చుకోవడం కోసం హిందూ సాంప్రదాయంలో తిరుమల వచ్చిన అన్నా గారు అందరికీ ఆదర్శనీయురాలు pic.twitter.com/YB55huMAd2
అన్నా లెజినెవా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి. ఆమె తిరుమలకు వస్తున్నారంటే ఆమె వేసే ప్రతి అడుగును నిశితంగా పరిశీలిస్తారు. ఏ చిన్న అంశం దొరికినా వివాదాస్పదం చేస్తారు. కానీ ఆమె.. వ్యవహరించిన తీరు ప్రతి ఒక్క హిందువును చేతులెత్తి నమస్కరించేలా చేసిందని పలువురు అంటున్నారు. మానవీయ విలువలు, పరమత సహనం, భక్తి శ్రద్ధలతో పాటు సమాజ సేవలో తనను తాను ఒక ఆదర్శంగా నిలిపిన విధానం ప్రజలకు ఒక గొప్ప సందేశాన్ని అందించారని అంటున్నారు.
హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ, ఆచరిస్తున్న
— YS Jagan Fans Campaign™ (@YSJFansCampaign) April 14, 2025
పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా గారిని మనస్పూర్తిగా హర్షిస్తున్నాం.@YSRCParty ఆమెను సంపూర్ణంగా గౌరవిస్తోంది.
ఇలాంటి అంశాల్లో కూడా రాజకీయాలు చేయడం చాలా బాధాకరం @JanaSenaParty. pic.twitter.com/5GZfarFdHv
కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినందుకు కృతజ్ఞతగా చేసిన మొక్కు . ఇది కేవలం ఒక వ్యక్తిగత భక్తి కాదు, హిందూ సంప్రదాయాల పట్ల ఆమె చూపిన గౌరవం, సమాజంలో ఐక్యతను పెంపొందించే ఒక గొప్ప సంకేతం అని అనుకోవచ్చని చెబుతున్నారు. మొత్తంగా పవన్ కల్యాణ్ సతీమణిపై ఇప్పటి వరకూ ఎవరైనా ఎలాంటి అభిప్రాయమైనా పెట్టుకుని ఉండవచ్చు కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా ఆమెను అభిమానించకుండా ఉండలేరని అంటున్నారు.





















