Viral News: ఆవు పేడ గోడలకు రాస్తే ఏసీలు అక్కర్లేదు- ప్రిన్సిపాల్ డిస్కవరీ - సోషల్ మీడియా ఏమంటుందో తెలుసా?
Cow dung : ఎండలు ఎక్కువగా ఉన్నాయని కాలేజీ గోడలకు ఆవుపేడ రాసిందో ప్రిన్సిపాల్. నిజంగానే చల్లగా అవుతుందా అని సోషల్ మీడియా ఆశ్చర్యపోతోంది.

Delhi University principal: ఎండలు ముదురుతున్నాయి. అందరికీ వేడిగానే ఉంటుంది. చల్లదనం కోసం ఏసీలు, కూలర్లు పెట్టుకుంటారు. అయితే కాలేజీల్లో మాత్రం ఇలాంటి అవకాశాలు ఉండవు. అందుకే ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన లక్ష్మీబాయి కళాశాల ప్రిన్సిపాల్ ప్రత్యూష్ వత్సల పిల్లలకు చల్లగా ఉండాలని కొత్త ప్రయత్నం చేశారు. క్లాస్‌రూమ్ గోడలకు ఆవు పేడ పులిమారు. వేసవిలో చల్లగా ఉండేందుకు ఇలా చేసినట్లుగా సమర్థించుకున్నారు. అయితే పేడ పూస్తే చల్లగా ఉంటుందని ఎవరు చెప్పారని ఆమెను చాలా మంది ప్రశ్నించారు. అందుకే ఆమె ఇది తమ పరిశోధనలో భాగమని.. ఆవు పేడ వాడకం వల్ల క్లాస్‌రూమ్‌లు చల్లగా ఉంటాయని, ఇది పర్యావరణ అనుకూలమైన పద్ధతి అని చెప్పుకొచ్చారు. తమ పరిశోధనా ఫలితాలను వారం రోజుల్లో వెల్లడిస్తారమని కవర్ చేసుకున్నారు.
The principal of Delhi University's Laxmibai College has been caught on video smearing cow dung on the walls of a classroom.
— Mr. Perfect (@Brave_092) April 14, 2025
When asked, Principal Pratyush Vatsala said that the purpose is to keep the classrooms cool in a natural way during summers.
#DelhiUniversity #BabyGirl pic.twitter.com/rpEKj0HLth
ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయంపై చర్చలు జరిగాయి, కొందరు ఈ చర్యను పర్యావరణ హితమైన ఆలోచనగా సమర్థించగా, మరికొందరు విద్యాసంస్థలో ఇలాంటి పద్ధతులు సముచితం కాదని విమర్శించారు.
The principal of Delhi University's Laxmibai College has been caught on video coating the walls of a classroom with cow dung. When asked, The Principal Pratyush Vatsala told that the act was part of an ongoing research, being undertaken by a faculty member. pic.twitter.com/zdmvnFqdWx
— Mohammed Zubair (@zoo_bear) April 14, 2025
ప్రిన్సిపాల్ చర్య విద్యార్థులు, ఉపాధ్యాయులు, మరియు సమాజంలో విస్తృత చర్చకు దారితీసింది. కొందరు దీనిని ఆరోగ్యకరమైనదిగా భావించారు. కొంత మంది హానికరంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.
This is a video from Laxmibai College of the University of Delhi.
— Roshan Rai (@RoshanKrRaii) April 14, 2025
The woman you see in the video coating cow dung on the walls of the classrooms is the Principal of the college.
She is doing this to give relief from heat to students because she read on Whatsapp that Cow Dung… pic.twitter.com/xRx92HI9Vn
ఈ సంఘటనపై ఢిల్లీ యూనివర్సిటీ యాజమాన్యం లేదా ఇతర అధికారుల నుండి అధికారిక స్పందన లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం విస్తృత చర్చ జరుగుతోంది. వారం రోజుల తర్వాత ఆమె ఫలితాలను ప్రకటిస్తే... చాలా చల్లగా ఉందని అనుకుంటే.. ఆవుపేడల్ని పులిమేసుకునేందుకు చాలా మంది రెడీ అవుతారేమో.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

