Ratha Saptami 2025 In Arasavalli: రథసప్తమి కోసం శ్రీకాకుళంలోని అరసవల్లిలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? రవాణా, బస సౌకర్యాల సంగతేంటి?
Arasavalli News: దేశంలోని నిత్యం పూజలు అందుకుంటున్న ఏకైక దేవాలయం సూర్యనారాయణ స్వామి దేవాలయం రథసప్తమి పండగను మూడు రోజులుగా చేయాలని నిర్ణయించారు. దీని కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
![Ratha Saptami 2025 In Arasavalli: రథసప్తమి కోసం శ్రీకాకుళంలోని అరసవల్లిలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? రవాణా, బస సౌకర్యాల సంగతేంటి? srikakulam arasavalli temple distance from vizag and amadalavala railway station Ratha Saptami 2025 In Arasavalli: రథసప్తమి కోసం శ్రీకాకుళంలోని అరసవల్లిలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? రవాణా, బస సౌకర్యాల సంగతేంటి?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/a5a3c02e3829f4ea28fb11672b4d653d1738146000845215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ratha Saptami 2025 In Arasavalli: వెలుగుల రేడు వేడుకకు అరసవల్లి సన్నద్ధమైంది. ఆ భాస్కరుడి సన్నిధి ముస్తాబైంది. దేశ వ్యాప్తంగా కేవలం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యదేవాలయంలో కలియుగ ప్రత్యేక దైవంసూర్యభగవానుడు నిత్యం పూజలందుకుంటున్నారు. ఒడిశాలో కొణార్క్ దేవాలయం ఉండగా ఆ దేవాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆలయ ప్రవేశాన్ని మూసివేశారు. అక్కడి ఆలయం పర్యాటకులను కనువిందుచేయడానికి పరిమితమైంది.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లి దేవాలయంలో మాత్రం నిరంతరం స్వామివారిని దర్శించుకోవడానికి దోహాదపడుతుంది. దేవేంద్రుడి చేతుల మీదుగా ఈ ఆలయం ప్రతిష్ఠితమైందని ప్రజల విశ్వాసం. సమస్త జనాలకు ఆయురారోగ్యాలను ప్రసాదించే సూర్యభగవానుడి జయంతి రోజున నిజరూప దర్శనానికి భక్తులు క్యూ కట్టడం ఆనవాయితీ. నిత్యం పూజలందుకుంటున్న అరసవల్లిలోని ఆదిత్యుడిని చూసేందుకు లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు.
ప్రత్యక్ష దైవంగా భక్తుల కోర్కెలు తీర్చే ఈ ఆలయంలోని విగ్రహాన్ని ద్వాపర యుగాంతంలో దేవేంద్రుడు ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆలయం అభివృద్ధికి క్రీ.శ.682లో దేవేంద్రవర్మ అనే రాజు భూములిచ్చినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. అరసవల్లి సూర్యదేవాలయం విశిష్టతపై పరిశీలిస్తే ఏడు అశ్వాలతో కూడిన రథంపై దేదీప్యమానంగా మూలవిరాట్ భక్తులకు దర్శనమిస్తుంటాడు.
అరుణశిలతో చేసిన స్వామి వారి ఉత్సవ విగ్రహం భక్తలకు కనువిందు చేస్తుంది. స్వామివారి రెండు హస్తాల్లోని తామర పద్మాలు అబ్బురపరుస్తాయి. కఠారి అనే చురిక(కత్తి) నడుము వద్ద ఆయుధంగా ధరిస్తారు. ఆలయానికి భువనేశ్వరిదేవి సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తారని పురాణాలు చెబుతున్నాయి.
Also Read: అడవి బిడ్డల సంబురానికి వేళాయె - అట్టహాసంగా ఆదివాసీ నాగోబా జాతర ప్రారంభం, ఆచారం వెనుక కథ ఇదే!
అంతటి మహాప్రసిద్ధి చెందిన స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలి రానున్నారు. ఫిబ్రవరి నాలుగు నాడు జరిగే జయంతి వేడుకులకు అరసవల్లి అందంగా ముస్తాబైంది. స్వామి నిజరూపాన్ని కనులారా తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శించుకోవాలంటే ఎలా రావాలి?
అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం శ్రీకాకుళం నగరం మధ్యలో ఉంటుంది. విశాఖపట్నం నుంచి 106 కిలోమీటర్ల దూరంలో ఉందీ అరసవల్లి దేవస్థానం. ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్ దిగిదే ఆటో కానీ క్యాబ్‌లో కానీ వెళ్ళవచ్చు. రైలు మార్గంగా రావాలి అనుకుంటే ఆమదాలవలస రైల్వే స్టేషన్‌లో దిగాల్సి ఉంటుంది. ఆమదాలవలస నుంచి అరసవల్లికి 14 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది.
సుదూర ప్రాంతాల నుంచి అరసవల్లి దేవస్థానానికి వచ్చే వాళ్ల కోసం చుట్టుపక్కల హోటల్స్ ఉంటాయి. అక్కడ ఇష్టం లేని వాళ్లు దగ్గర్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ హోటల్ ఒకటి ఉంది. అక్కడైనా బస చేయవచ్చు.
రథసప్తమికి ఏ ఏ ప్రాంతం నుంచి ప్రజలు వస్తారు..
దేశంలోని నిత్యం పూజలు అందుకుంటున్న ఈ దేవాలయానికి ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి సూర్యనారాయణ స్వామిని దర్శించుకొని వెళ్తారు. ఇలా వచ్చే వాళ్లు ముందుగానే హోటల్స్ బుక్ చేసుకుంటారు. మరి కొంతమంది తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంటారు. వీఐపీలు విశాఖపట్నం వచ్చి అక్కడ బస చేసి ఉదయాన్నే బయలుదేరి అరసవిల్లి చేరుకుంటారు. రథసప్తమి రోజు సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటే మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం.
Also Read: శ్రీ శంబర పోలమాంబ జాతర 2025 - సిరిమానోత్సవం గురించి ఈ విషయాలు తెలుసా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)