అన్వేషించండి

Andhra Pradesh News: 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న పీఎం మోదీ- 80 వేల కోట్ల పెట్టుబడుల పార్క్‌కు శంకుస్థాపన

PM Modi Tour In AP: కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రి మోదీ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. వైజాగ్‌లో పర్యటించనున్నారు.

Prime Minister Vizag Tour : నవంబర్‌ 29న ఆంధ్రప్రదేశ్‌ వస్తున్న ప్రధానమంత్రి మోదీ విశాఖ కేంద్రంగా భారీ పెట్టుబడుల పార్క్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ పార్క్‌ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌కు 80 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. 

విశాఖలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా జరగబోతోందని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు.  గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌తో పాటు గ్రీన్‌ అమ్మోనియా, గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ల ఏర్పాటుకు భూమిపూజ చేస్తారని పేర్కొన్నారు. ఈ మూడు ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1200 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్టుల కారణంగా వచ్చే నాలుగేళ్లలో 48 వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 

Also Read: ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు అయ్యన్న చురకలు- మొన్న చంద్రబాబు క్లాస్, నేడు స్పీకర్ సీరియస్!

విశాఖలోని పూడిమడకలో ఎన్టీపీసీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. మూడు దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు. 84,700 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ మాన్యుఫాక్చరింగ్‌ జోన్లు వస్తాయని... విండ్, సోలార్‌ హైబ్రిడ్‌ పంప్డ్‌ స్టోరేజీకి కావాల్సిన 20 గిగా వాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి చేయొచ్చని చంద్రబాబు వివరించారు. ఈ ప్రాజెక్టులో ఏపీ జెన్‌కోకు 50 శాతం భాగస్వామ్యం ఉంది. సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుతో  రూ.65వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్‌ సంస్థతో చేసుకున్న ఒప్పందం గురించి కూడా చంద్రబాబు వివరించారు. 

వీటితోపాటు విశాఖలో టాటా గ్రూప్‌ పెట్టుబడులు పెట్టబోతోందన్నారు. అక్కడ ఐటీ ప్రొఫెషనల్స్‌ తయారు చేస్తుందని వెల్లడించారు. ఎల్‌జీ సంస్థ కూడా పెట్టుబడులకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. 2014-19 మధ్య 227 ఎంవోయూలు జరిగినా వైసీపీ ప్రభుత్వం చర్యల కారణంగా వాళ్లు పెట్టుబడులు పెట్టలేదన్నారు. 

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధానమంత్రి రానున్న సందర్భంగా గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విశాఖ రైల్వే జోన్‌ శంకుస్థాపన కూడా మోదీ చేతుల మీదుగా చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. శుక్రవారం ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబు ఈ విషయంపై క్లారిటీ తీసుకోనున్నారు. ఇప్పటికే రైల్వే జోన్‌కు కావాల్సిన భూమిని కూడా రైల్వే శాఖకు ప్రభుత్వం అప్పగించింది. శంకుస్థాపన ప్రక్రియ పూర్తి అయితే పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. 

Also Read: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Upcoming 5G Smartphones: వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Upcoming 5G Smartphones: వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
Allu Arjun Meets Chiranjeevi: బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
బిగ్ బాస్ ఇంటికి బన్నీ... అరెస్ట్, జైలు తర్వాత మావయ్య దగ్గరకు మొదటిసారి, పుష్ప 2 టీ షర్ట్ లేకుండా
Group 2 Exams: కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
కొంపముంచిన ఆ ఒక్క 'నిమిషం' నిబంధన - గ్రూప్ 2 పరీక్షలకు దూరమైన అభ్యర్థులు
Cycle Yatra Beyond Borders: సైక్లింగ్ ద్వారా ప్రపంచాన్ని అన్వేషిస్తున్న యువకుడు- తండ్రి కలను నెరవేరుస్తున్న వరంగల్ వాసి
సైక్లింగ్ ద్వారా ప్రపంచాన్ని అన్వేషిస్తున్న యువకుడు- తండ్రి కలను నెరవేరుస్తున్న వరంగల్ వాసి
Srisailam: శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం - డ్యాం సమీపంలో సంచారంతో ఉలిక్కిపడ్డ జనం
Embed widget